Updated : 22 May 2022 09:22 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. పోలీస్‌ శాఖలో పోస్టులెన్నైనా ఒకేసారి శారీరక సామర్థ్య పరీక్షలు

పోలీస్‌ కొలువుల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులకు పోలీస్‌ నియామక మండలి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసినా ఒకేసారి పీఎంటీ, పీఈటీలాంటి శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరైతే సరిపోయేలా కార్యాచరణ రూపొందించింది. గతంలో జరిగిన నియామకాల్లో ఎన్ని పోస్టులకు దరఖాస్తు చేస్తే అన్ని మార్లు ఈ పరీక్షలకు హాజరు కావాల్సివచ్చేది. 2018లో తొలిసారిగా మండలి ఒక అభ్యర్థి ఎన్ని పోస్టులకు దరఖాస్తు చేసినా ఒకేసారి శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరయ్యేలా చూసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5 నిమిషాలు దాటితే అనుమతించం

2. అల్లర్లు మొదలుపెట్టాలన్న ఉద్దేశం లేదు: సుదీప్‌

హిందీపై తన వ్యాఖ్యలతో చర్చ గానీ, అల్లర్లు గానీ మొదలుపెట్టాలన్న ఉద్దేశం తనకు లేదని కన్నడ హీరో కిచ్చా సుదీప్‌ స్పష్టీకరించారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌తో మొదలైన వివాదంతో.. హిందీ జాతీయ భాష కాదని వ్యాఖ్యానించి సుదీప్‌ పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. భారతీయ భాషలన్నీ పూజ్యనీయమేనని ప్రధాని మోదీ చెప్పడంతో సుదీప్‌ ఆనందంలో మునిగిపోయారు. దీనిపై జాతీయ వార్తా సంస్థలతో మాట్లాడుతూ.. ‘‘నేను కేవలం కన్నడం గురించే మాట్లాడలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ముంబయి మెరిసె.. బెంగళూరు మురిసె

దిల్లీపై ముంబయి గెలిచింది..  బెంగళూరు మురిసింది. అవును.. ముంబయి విజయం ఇప్పుడు బెంగళూరుని ప్లేఆఫ్స్‌ చేర్చింది. ముందంజ వేయాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో దిల్లీ ఓడిపోవడంతో నాలుగో జట్టుగా బెంగళూరు ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. బ్యాటింగ్‌లో వైఫల్యం.. ఫీల్డింగ్‌లో విఫలం.. నాయకత్వంలో తప్పిదం.. ఇలా పంత్‌సేన చేజేతులారా పరాజయం పాలైంది. మరోవైపు ఈ సారి పేలవ ప్రదర్శనతో నిరాశపర్చిన ముంబయి.. చివరకు విజయంతో సీజన్‌ను ముగించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. త్వరలో దేశంలో సంచలనం

‘వ్యాపారులు కలిసినప్పుడు వ్యాపారం గురించే మాట్లాడుకుంటారు.. రాజకీయ నాయకులు కలిస్తే రాజకీయాలే మాట్లాడుకుంటారు.. త్వరలో దేశంలో సంచలనం జరగాలి.. జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడండి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. దిల్లీలో సర్వోదయ పాఠశాల సందర్శన అనంతరం ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంతకుమందు యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌.. కేసీఆర్‌ను ఆయన నివాసానికి వచ్చి కలిశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పెట్రో ధరల తగ్గింపు

అధిక ధరల భారంతో అల్లాడిపోతున్న ప్రజలపై కేంద్ర ప్రభుత్వం ఉపశమనపు జల్లును కురిపించింది. నిత్యావసరాల పెంపునకు, తద్వారా ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తున్న పెట్రో ఉత్పత్తుల ధరల పరుగులకు కళ్లెం వేసింది. లీటర్‌ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 మేర ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ శనివారం సాయంత్రం ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. దీంతో ఆ రెండు ఇంధనాల ధర లీటర్‌కు వరుసగా రూ.9.50, రూ.7 వరకు దిగి వస్తుందని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తప్పు... అలా వేలెత్తి చూపొద్దు!

‘అందంగా లేనా... అసలేం బాలేనా...’ అంటూ ప్రేమిస్తున్న వ్యక్తిని ప్రశ్నిస్తుంది ఓ తెలుగు సినిమాలో నాయిక. అమ్మాయి అందం చుట్టూ తిరిగే సినిమా ప్రేమల్ని పక్కనబెట్టినా, మన సమాజంలో పెళ్లి సంబంధం కుదుర్చుకునేటప్పుడు మొట్టమొదట చూసేది రూపమే. అది నచ్చాకే ఇతర విషయాల్లోకి వెళ్తారు. యువతీ యువకుల రూపాల గురించి నిస్సంకోచంగా, బహిరంగంగా చర్చించడం మనదేశంలోనే ఎక్కువ. సౌందర్య సాధనాలూ వ్యాయామ పరికరాల వాణిజ్య ప్రకటనల్లోనే కాదు, ఆఖరికి పెళ్లి సంబంధాల ప్రకటనల్లోనూ ఆ విషయాన్ని ప్రస్తావిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆరోగ్య బీమా మరింత భారం

కొవిడ్‌-19 ఎంతోమంది ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేసింది. ఆసుపత్రుల బిల్లులు రూ.లక్షల మేర కావడంతో, తట్టుకునేందుకు చాలామంది ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేందుకు మొగ్గు చూపారు. దీంతో ఈ రంగంలో గతంలో ఎన్నడూ లేనంత వృద్ధి నమోదైంది. కొవిడ్‌ తొలి దశ (2020), రెండో దశ (2021)లో తీసుకున్న చాలా ఆరోగ్యబీమా పాలసీలకు ఇప్పుడు పునరుద్ధరణ సమయం వచ్చింది. అయితే పెరిగిన ప్రీమియాలు పాలసీదార్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. తలపడి తలవంచిన మేరియుపొల్‌

పుతిన్‌ సేనలు ఉక్రెయిన్‌పై సాగించిన యుద్ధం ఒకెత్తయితే, అందులో తీరనగరం మేరియుపొల్‌లో సాగిన ఘట్టం మరొకెత్తు! ఫిబ్రవరి 24న సైనికచర్యకు దిగింది మొదలు... రష్యా ప్రధానంగా దృష్టి సారించిన తీర ప్రాంతం- మేరియుపొల్‌! అక్కడున్న అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగారాన్ని చేజిక్కించుకునేందుకు మాస్కో చెమటోడ్చక తప్పలేదు. నువ్వా-నేనా అన్నట్టు సాగిన పోరాటంలో చివరకు ఉక్రెయిన్‌ సేనలు చేతులెత్తేశాయి. శత్రు బలగాల నుంచి ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు చివరి వరకూ ప్రయత్నించి, లొంగిపోయిన 2,439 మందిని రష్యా తన దేశానికి తరలించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఎడతెగని ఉత్కంఠ

 వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ వద్ద కారుడ్రైవరుగా పనిచేసి, అనుమానాస్పద పరిస్థితిలో ప్రాణాలు కోల్పోయిన సుబ్రహ్మణ్యం మృతదేహం చుట్టూ రోజంతా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ, తల్లిదండ్రులు శనివారం పగలంతా మాయమయ్యారు. వాళ్లు ఏమైపోయారో, ఎక్కడున్నారో ఎవరికీ తెలియలేదు. వారిని రాజీచేసేందుకు వైకాపా నాయకులు రంగంలోకి దిగారు. అపర్ణ స్వస్థలం సామర్లకోట కావడంతో, ఆమె తల్లిదండ్రులను స్థానిక వైకాపా ప్రజాప్రతినిధి ఒకరు ఒత్తిడి చేసి, తమ కుమార్తె ప్రమాదంతో ఉందని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అత్యధిక రోజులు అప్పు చేసిన రాష్ట్రం ఏపీ

స్వల్పకాలిక ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి గత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ నుంచి స్పెషల్‌ డ్రాయింగ్‌ ఫెసిలిటీ(ఎస్‌డీఎఫ్‌), వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌, ఓవర్‌ డ్రాఫ్ట్‌ రూపంలో అత్యధిక రోజులు అప్పు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. ఏపీ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరంలో 305 రోజులపాటు స్పెషల్‌ డ్రాయింగ్‌ ఫెసిలిటీ, 283 రోజులు వేస్‌ అండ్‌ మీన్స్‌(డబ్ల్యూఎంఏ), 146 రోజులు ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నట్లు ఇన్వెస్ట్‌మెంట్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ అండ్‌ క్రెడిట్‌ రేటింగ్‌ ఇండియా లిమిటెడ్‌(ఐసీఆర్‌ఏ)సంస్థ..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని