Updated : 23 May 2022 09:18 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. తప్పు చేయలేదనే ధైర్యంతోనే అనంతబాబు బయట తిరుగుతుండొచ్చు: బొత్స

వైకాపా ప్రభుత్వంలో చట్టానికి చుట్టాలు ఉండరని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శ్రీకాకుళంలోని వైకాపా కార్యాలయంలో ఈనెల 26 నుంచి జరగనున్న బస్సు యాత్రపై చర్చించేందుకు పార్టీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుపై కేసు నమోదు చేశాం. నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తున్నాం. ఎమ్మెల్సీ అనంతబాబు ఎక్కడో పెళ్లికి హాజరయ్యారని మీడియాలో చూశా. తప్పు చేయలేదనే ధైర్యంతో అలా తిరిగి ఉంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఎమ్మెల్సీ అనంతబాబు ఎక్కడ?

2. పిలుస్తోంది ఐటీ కొలువు

జోరుగా ఐటీ ఉద్యోగాలు.. ఆకర్షణీయ ప్యాకేజీలు.. గతంలో ఎన్నడూ లేనంతగా కళాశాల ప్రాంగణాల్లో, బయట ఎంపికలు.. ఉద్యోగార్థులకు ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోందని చెప్పొచ్చు. డిగ్రీ, కొద్దిపాటి ఐటీ నైపుణ్యం ఉంటే.. ఉద్యోగం లభించడం పెద్ద కష్టం కాదు. కొత్త టెక్నాలజీల మీద నాలుగైదేళ్లు పనిచేసిన అనుభవం ఉంటే, భారీ జీతభత్యాలు చెల్లించేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. వార్షిక జీతభత్యాలు రూ.4 లక్షల నుంచి 45 లక్షలు, ఇంకా పైన కూడా ఉంటున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పెంచింది 300%.. తగ్గించింది 30 శాతమే

భాజపా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను 300 శాతం పెంచి... 30 శాతం తగ్గించిందని, ఇదంతా కంటితుడుపు చర్యేనని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు ఆదివారం దావోస్‌ నుంచి ట్విటర్‌లో ధ్వజమెత్తారు. 2014, 2022 సంవత్సరాలలో ముడి చమురు ధరలు ఒకేలా ఉన్నాయని, అప్పట్లో పెట్రోలు లీటరు రూ.70 కాగా.. ఇప్పుడు రూ.120 ఎలా అయిందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో గత ఎనిమిదేళ్లలో వ్యాట్‌ పెరగలేదని, కేంద్ర ప్రభుత్వం వల్లనే ఇంధన ధరలు పెరిగాయని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆమె మామూలు ఆంటీ కాదు.. ఫేస్‌బుక్‌లో ‘ఘాటు ప్రేమ’ కాటు!

మన్మథుడు సైతం చిన్నబోయేలా ఫేస్‌బుక్‌ ద్వారా చిలిపి సందేశాల్ని పంపుకొన్నారు. ఆమెను తలచుకోనిదే ఒక్క క్షణమైనా గడవని పరిస్థితులకు ఆ యువకుడు చేరుకున్నాడు. ఈ జీవితానికి తన అర్ధాంగి ఆమేనని అందరికీ తేల్చిచెప్పేశాడు. అందుకు ఆమె కూడా అంగీకరించింది. పెళ్లి ఖర్చులకంటూ ఆమె పినతల్లి ద్వారా రూ.3.50 లక్షలను సర్దుబాటు చేశాడు. ఇంతకూ పెళ్లి పీటల మీదకు వచ్చే సరికి కంగుతినడం ఆ యువకుడి వంతైంది. తను ప్రేమించిన అసలైన ఆ కలల రాణికి అక్షరాలా 50 సంవత్సరాలని తెలిసి గుడ్లు తేలేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Andhra News: పల్లెల్లో కన్నీటి ఘోష

గుక్కెడు గంగ దొరక్క పల్లె ప్రజల గొంతెండిపోతోంది. దాహార్తి తీరే దారిలేక జనం డబ్బాలు కట్టుకుని, బిందెలు పట్టుకుని చెలమలు, బావుల వెంట పరుగులెత్తాల్సిన దుస్థితి దాపురించింది. బీదా బిక్కీ కూడా నెలకు ఆరేడు వందల రూపాయలు ఖర్చు పెడితే తప్ప గొంతు తడిచే దారి లేని దైన్యం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో పల్లెల్లో తాండవిస్తోంది. నీటికొరత తీరుస్తామని హామీలిచ్చిన నేతలు గద్దెనెక్కాక జనం గోడు పట్టించుకోక.. ఊటచెలమల్లో, బావుల్లో రంగు మారిన, పాచిపట్టిన నీరే దిక్కవుతోంది. తాగునీరందించే బోర్లు, రక్షిత పథకాలు ఏళ్ల తరబడి పనిచేయకున్నా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పాపే మాకు ప్రాణం...!

కరోనా తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో దత్తతలు పెరిగాయి. దత్తతలో ఆడపిల్లలే ఎక్కువగా ఉంటున్నారు. ఆడపిల్లలకు జన్మనిచ్చిన మాతృమూర్తులు సామాజిక దురాచారం, అసహాయ పరిస్థితులు, పేదరికం, గృహహింస కారణంగా కన్నపేగు బంధాన్ని కాదనుకుని పుట్టిన వెంటనే వదిలేస్తుంటే.. పిల్లలు లేక ఆరాటపడుతున్న దంపతులు ఎక్కువగా ఆడపిల్లల్నే కోరుకుంటున్నారు. గత ఏడాది కాలంలో జరిగిన దత్తతల్లో మగ పిల్లలతో పోల్చితే ఆడపిల్లల సంఖ్య రెండింతలుగా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఉమ్రాన్‌ వచ్చేశాడు

భారత్‌ క్రికెట్‌ లీగ్‌లో అదరగొట్టి టీమ్‌ఇండియాలో చోటు దక్కించుకున్న కుర్రాళ్ల జాబితాలో ఉమ్రాన్‌ మాలిక్, అర్ష్‌దీప్‌ సింగ్‌ కూడా చేరారు. ఈ సీజన్లో హైదరాబాద్‌ తరఫున మెరుపు వేగంతో బౌలింగ్‌ చేస్తూ వికెట్ల పంట పండించిన ఉమ్రాన్, కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పంజాబ్‌ జట్టులో కీలక బౌలర్‌గా మారిన అర్ష్‌దీప్‌ సింగ్‌లను దక్షిణాఫ్రికాతో అయిదు టీ20ల సిరీస్‌లో తలపడే భారత జట్టుకు సెలక్టర్లు ఎంపిక చేశారు. టీమ్‌ఇండియాలో చోటు దక్కడం వీరికి ఇదే తొలిసారి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మురుగు కాల్వ కాదిది.. బైపాస్‌ రహదారి!

ఇక్కడ కనిపిస్తున్నది కాల్వ కాదు.. కరీంనగర్‌లోని గణేశ్‌నగర్‌ బైపాస్‌ రహదారి. ప్రధాన వరదకాల్వను మరమ్మతుల పేరిట నెలల కిందట తవ్వారు. మురుగు ప్రవాహాన్ని రహదారి మీదుగా మళ్లించి వదిలేశారు. నగరంలో భారీవర్షం పడితే వరద నీరంతా ఇక్కడి నుంచే వెళ్లాలి.. సకాలంలో పనులు పూర్తికాకపోతే కాలనీలు మునిగే ప్రమాదం పొంచి ఉంది. నిజానికి సీఎం ప్రత్యేక నిధులతో ఈ పనులను ఓ గుత్తేదారుకు అప్పగించగా ఆయన వాటిని అర్ధంతరంగా వదిలేశారు. ఫలితంగా ఆరు నెలలుగా పనులు నిలిచిపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఎన్నెన్నో ఎన్‌కౌంటర్‌ కథలు

దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ను సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ వి.ఎస్‌.సిర్పుర్కర్‌ నేతృత్వంలోని కమిషన్‌ తప్పుబట్టడంతో.. దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో జరిగిన ఇలాంటి పలు ఎన్‌కౌంటర్లు మళ్లీ తెరమీదకు వస్తున్నాయి. దిశ కేసులో జరిగిన ఎన్‌కౌంటర్‌ మృతుల్లో ముగ్గురు మైనర్లు కావడం.. పోలీసు సిబ్బంది ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపారని కమిషన్‌ తేల్చడంతో ఈ ఘటనపై భిన్నరకాల స్పందనలు వచ్చాయి. గతంలోనూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇలాగే జరిగిన కొన్ని ఎన్‌కౌంటర్లను వివిధ కమిషన్లు తప్పుబట్టాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మహిళా యాంకర్లు ముఖాలు కప్పుకోవాల్సిందే

మహిళా టీవీ యాంకర్లు వార్తలు చదివేటపుడు ముఖాలను కప్పుకోవాలంటూ గురువారం ఆదేశాలు జారీ చేసిన తాలిబన్లు.. ఇప్పుడు ఆ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు. చాలా టీవీ ప్రసారసంస్థలకు తాలిబన్ల ఆదేశాలు కొన్ని రోజుల క్రితం అందినా తొలుత పెద్దగా పట్టించుకోలేదు. దీంతో తాలిబన్‌ అధికారులు రంగంలోకి దిగారు. తమ ఆదేశాలను పాటించాల్సిందేనని, ఇందులో ఎలాంటి వెసులుబాటు కల్పించే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. దీంతో ఆదివారం నుంచి మహిళా యాంకర్లు ముఖాలు కప్పుకొని వార్తలు చదువుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని