Updated : 24 May 2022 09:14 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. జనంపై మరో పిడుగు

అన్ని రకాల ఖర్చులు పెరిగి అల్లాడుతున్న ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం మరో భారం మోపింది. మట్టి మిద్దెల నుంచి.. ఆకాశహర్మ్యాల వరకు అన్ని రకాల నిర్మాణాల మార్కెట్‌ విలువలను పెంచేసింది. సినిమాహాళ్లు, మిల్లులు, కర్మాగారాలు, కోళ్లఫారాల భవన నిర్మాణాలపైనా వడ్డించింది. తాటాకు, కొబ్బరాకులు, రెల్లుగడ్డితో కప్పే గుడిసెలపైనా చదరపు అడుగుకు అదనంగా రూ.10 చొప్పున బాదేసింది. పల్లె, పట్టణమనే తేడా లేకుండా.. ప్రస్తుత విలువలపై సగటున 5% చొప్పున పెంచడం వల్ల ప్రజలపై ఏటా రూ.125 కోట్లకు పైగా భారం పడనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ప్రతి 30 గంటలకు ఓ బిలియనీర్‌

కొవిడ్‌ పరిణామాల కాలంలో ప్రతి 30 గంటలకు ఒక కొత్త బిలియనీర్‌ ఆవిర్భవించారని.. ప్రతి 33 గంటలకు దాదాపు 10 లక్షల మంది కడుపేదరికంలోకి వెళ్లారని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌)లో విడుదలైన ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ నివేదిక అంచనా వేసింది. ఈ సంస్థ ‘ప్రాఫిటింగ్‌ ఫ్రమ్‌ పెయిన్‌’ పేరిట విడుదల చేసిన నివేదికలోని ముఖ్యాంశాలు ఇవీ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. స్వలింగ సంపర్కంతోనే మంకీపాక్స్‌!

మంకీపాక్స్‌ వ్యాధి సోకిన వ్యక్తికి దగ్గరగా మసలిన వారు 21 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉండాలని బ్రిటిష్‌ ఆరోగ్య రక్షణ సంస్థ సోమవారం సూచించింది. మంకీపాక్స్‌ వ్యాధిగ్రస్తునితో ఇంట్లో కానీ, వెలుపల కానీ సన్నిహితంగా ఉన్నవారు తాము ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిసిందీ సంబంధిత అధికారులకు తెలపాలనీ పేర్కొంది. అటువంటి వ్యక్తులు 21 రోజులపాటు బయట తిరగకూడదనీ, వృద్ధులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, 12 ఏళ్లలోపు బాలబాలికలకు సమీపంగా వెళ్లరాదని ఆ సంస్థ సలహా ఇచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. MLC Ananthababu: మన్యంలో అరాచకాలు అనంతం

తాను చెప్పిందే వేదం... తన మాటే శాసనం.. రూ.కోట్ల విలువైన రంగురాళ్ల వ్యాపారం నుంచి మన్యంలో కలప అక్రమ రవాణా, అనధికారిక మట్టి తవ్వకాలు, ఇసుక దోపిడీ, పేకాట శిబిరాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలన్నీ తన కనుసన్నల్లోనే సాగాలి.. ఒక్క ముక్కలో చెప్పాలంటే మన్యంలో ఏం జరిగినా దానికి కర్త, కర్మ, క్రియా అన్నీ తానే కావాలి.. ఇదీ అధికారం అండతో చెలరేగిపోతున్న వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ (అనంతబాబు) తీరు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మధుమేహానికి కొత్త మందు!

పెద్దవారిలో వచ్చే టైప్‌2 మధుమేహానికి కొత్త మందు అందుబాటులోకి వచ్చింది. దీని వాడకానికి అమెరికా ఎఫ్‌డీఏ ఇటీవలే అనుతించింది. పేరు టిర్‌జెపటైడ్‌. ఇన్సులిన్‌ మాదిరిగానే దీన్ని కూడా ఇంజెక్షన్‌ ద్వారా చర్మం కింద తీసుకోవాల్సి ఉంటుంది. వారానికి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. ఇది గ్లుకగాన్‌-లైక్‌ పెప్టైడ్‌-1 (జీఎల్‌పీ-1), గ్లూకోజ్‌-డిపెండెంట్‌ ఇన్సులినోట్రోపిక్‌ పాలీపెప్టైడ్‌ (జీఐపీ) గ్రాహకాలు రెండింటినీ చురుకుగా పనిచేసేలా చేస్తుంది. అన్నవాహిక దగ్గర్నుంచే దీని పని మొదలవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Gujarat vs Rajasthan: కొత్తా.. పాతా?

ఉత్కంఠ వీడింది. ప్లేఆఫ్స్‌ రేసు ముగిసింది. టాప్‌-4 జట్లేవో తేలిపోయాయి. మధ్యలో ఒక్క రోజే విరామం. ఉత్కంఠను, వినోదాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే  టీ20 లీగ్‌ ప్లేఆఫ్స్‌ దశకు రంగం సిద్ధమైంది. లీగ్‌ దశలో టాప్‌-2లో నిలిచిన గుజరాత్‌, రాజస్థాన్‌  క్వాలిఫయర్లో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. మరి అరంగేట్ర సీజన్లోనే అదరగొట్టి అగ్రస్థానంతో లీగ్‌ దశను ముగించిన కొత్త జట్టు గుజరాత్‌ నేరుగా ఫైనల్లో చోటు సంపాదిస్తుందా.. లేక తొలి సీజన్లో ఛాంపియనయ్యాక మళ్లీ ఇంత కాలానికి చక్కటి ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌ చేరిన పాత జట్టు రాజస్థాన్‌ తుది పోరు దిశగా తొలి అడుగు వేస్తుందా?పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Dream 11: డ్రీమ్‌ 11లో జాక్‌పాట్‌.. రాత్రికి రాత్రే రూ.2 కోట్లు!

7. 3 బీహెచ్‌కే ఫ్లాట్లకు భారీ డిమాండ్‌!

రాజీవ్‌ స్వగృహకు సంబంధించి ఎక్కువ మంది 3బీహెచ్‌కే డీలక్స్‌, 3బీహెచ్‌కే ఫ్లాట్లుకే ఎక్కువ శాతం మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా బండ్లగూడ వద్ద అపార్ట్‌మెంట్లలో ఉన్న ఫ్లాట్లకు దరఖాస్తులు వస్తున్నాయి. ఫ్లాట్ల విస్తీర్ణం 1487, 1617 చదరపు గజాలు ఉండటం...ఆ ప్రాంతంలో ఇది చాలా తక్కువ ధర కావడంతో ప్రజలు ముందుకొస్తున్నారు. బండ్లగూడతోపాటు పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి ఈ నెల 11న హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Andhra News: ఉచిత బియ్యం ఊసేదీ?

రేషన్‌ దుకాణాల ద్వారా ఉచిత బియ్యం పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం పక్కనబెట్టింది. రెండు నెలలుగా పంపిణీ చేయడం లేదు. అన్ని రేషన్‌ కార్డులకు కేంద్రమే ఇస్తే.. తాము సరఫరా చేసేందుకు సిద్ధమని రాష్ట్రం పేర్కొంటోంది. కొవిడ్‌ నేపథ్యంలో రేషన్‌ కార్డుదారులకు కేంద్రం పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కింద ఉచిత బియ్యాన్ని అందిస్తోంది. ఆరో దశలో భాగంగా ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఈ రేషన్‌ అందించాల్సి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. క్యాన్సర్‌ను వేటాడే వైరస్‌

ముల్లును ముల్లుతోనే తీయాలి! అదేరీతిలో ఒక వ్యాధిని ఎదుర్కోవడానికి.. మరో వ్యాధికారకాన్ని శాస్త్రవేత్తలు ప్రయోగిస్తున్నారు. క్యాన్సర్‌ను ఎదుర్కోవడానికి వైరస్‌ను రంగంలోకి దించారు. ఇది ఆ వ్యాధిని లక్ష్యంగా చేసుకుంటుంది. దాన్ని నాశనం చేసేలా శరీర రోగనిరోధక వ్యవస్థకు తర్ఫీదు ఇస్తుంది. దీన్ని మానవులపై పరీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ క్యాన్సర్‌ బాధితుడికి ఈ వైరస్‌తో కూడిన ఔషధాన్ని ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Andhra News: నిన్ను నాన్నా.. అనడానికే అసహ్యం వేస్తోంది!

 ‘‘మా నాన్న మూర్ఖుడు.. తాగొచ్చి రోజూ నరకం చూపిస్తున్నాడు. అమ్మ బతికి ఉన్నప్పుడు మంచిగా ఉండేవాడు.. ఆపై మద్యానికి బానిసై మృగంగా మారాడు. నాన్నా.. అని పిలవడానికీ మనసు రావడంలేదు. ఆయనను చంపాలని లేదా చనిపోవాలని ఉంది. మూడుసార్లు ఉరివేసుకున్నా ఎవరో ఒకరు కాపాడారు. ఆయన రోజూ వేధిస్తున్నాడు. ఇంకొన్ని రోజుల్లో నా చావు వార్త అందరికీ తెలుస్తుంది. వెయిటింగ్‌ ఫర్‌ మై డెత్‌’’.. అంటూ ఓ విద్యార్థిని గతంలోనే ఉత్తరం రాసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని