Updated : 29 May 2022 09:18 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ఆధార్‌ నమోదైతేనే ‘పీఎం కిసాన్‌’!

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి(పీఎం కిసాన్‌) పథకం కింద రాష్ట్రంలో లక్షల మంది రైతుల ఆధార్‌ వివరాలు ఇంకా నమోదు కాలేదు. ఇప్పటికే ఈ పథకం కింద అర్హులైన రైతులను గుర్తించడానికి కేంద్రం అనేక నిబంధనలు పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) నుంచి ఆధార్‌ నమోదునూ తప్పనిసరి చేసింది. ఈకేవైసీ పూర్తిచేయడానికి, కొత్తగా ‘పీఎం కిసాన్‌’లో నమోదుకు తొలుత 2022 మార్చి 31 దాకా కేంద్రం గడువు పెట్టింది. అప్పటికి రైతులు స్పందించలేదని గడువును ఈ నెల 31 దాకా పొడిగించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* జులై 4న భీమవరానికి ప్రధాని మోదీ

2. రష్యా ‘అజేయ’ క్షిపణి

ఉక్రెయిన్‌పై దాడులను ముమ్మరం చేసిన నేపథ్యంలో రష్యా తన ఆయుధ పాటవాన్ని ప్రదర్శించింది. ధ్వని వేగం కన్నా 9 రెట్లు (గంటకు 11వేల కిలోమీటర్లు) వేగంగా దూసుకెళ్లే శక్తిమంతమైన జిర్కాన్‌ హైపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణిని తాజాగా పరీక్షించింది. బాలిస్టిక్‌ తరగతికి చెందని క్షిపణుల్లో ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైందని నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా పరిజ్ఞానంలో తన ఆధిపత్యాన్ని మరోసారి రష్యా చాటింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మళ్లీ రవాణా బాదుడు..!

రాష్ట్రంలో వాణిజ్య వాహనాల పన్నులు పెరిగాయి. క్షేత్రస్థాయి అధికారులకే కాదు వాహనదారులకూ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం ఈ పెంపుదలను అమల్లోకి తెచ్చింది. దీంతో మూడు నెలలకోసారి చెల్లించాల్సిన పన్ను తడిసి మోపెడయింది. గడువు మేరకు పన్ను చెల్లించేందుకు ఆన్‌లైన్‌, మీసేవా కేంద్రాల్లో ప్రయత్నిస్తే భారీగా పన్ను పెరిగినట్లు చూపిస్తుండటంతో వాహనదారులు కంగుతింటున్నారు. ఇటీవల వాహనాల జీవితకాల పన్ను మొత్తాన్ని భారీగా పెంచిన ప్రభుత్వం ఇప్పుడు వాణిజ్య వాహనాల పన్నును సైతం పెంచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. శశికళతో విజయశాంతి రహస్య భేటీ?

జయలలిత నెచ్చెలి శశికళతో భాజపా నాయకురాలు, ప్రముఖ నటి విజయశాంతి రహస్యంగా భేటీ అయినట్లు సమాచారం. ఈ సందర్భంగా తన తదుపరి రాజకీయ ప్రయాణం గురించి విజయశాంతిలో శశికళ సమగ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల శశికళ తన మద్దతుదారుల ఇంట కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అప్పుడు విలేకర్లను కలిసి మాట్లాడుతున్నారు. కొన్ని నెలల క్రితం ఆధ్యాత్మిక యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆలయాలను సందర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘ఎలుకల బోను’ తయారీలో జగిత్యాల వాసి గిన్నిస్‌ రికార్డు

జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్‌కు గిన్నిస్‌ బుక్‌లో చోటుదక్కింది. అతి చిన్నసైజులో ఎలుకల బోను నమూనాను సృష్టించిన దయాకర్‌ కృషిని గిన్నిస్‌ సంస్థ గుర్తించింది. 5 మిల్లీమీటర్ల పొడవు, 2.5 మిల్లీమీటర్ల వెడల్పుతో 29 నిమిషాల్లోనే ఈ బోనును రూపొందించడం విశేషం. అయిదేళ్ల క్రితం ఓ భారతీయుడు గంటలో సూక్ష్మ బోనును తయారుచేయగా.. దయాకర్‌ ఆ రికార్డును అధిగమించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పెళ్లి రోజే.. రంపంతో కోసి భార్య, పిల్లలను చంపిన ఐటీ ఉద్యోగి

అప్పుల భారంతో ఓ కుటుంబ పెద్ద తన పెళ్లిరోజే భార్య, పిల్లలను హత్య చేశాడు. రంపంతో భార్య, ఇద్దరు పిల్లల గొంతులు కోసి, ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడు చెన్నైలోని పల్లావరం వద్ద పొళిచ్చలూం్కి చెందిన ప్రకాశ్‌ (42) ఐటీ సంస్థలో పని చేస్తున్నాడు. ఇతనికి భార్య గాయత్రి (39), కుమార్తె నిత్యశ్రీ (13), కుమారుడు హరికృష్ణన్(8) ఉన్నారు. గాయత్రి నాటు మందుల దుకాణం నడుపుతోంది. కొన్ని నెలలుగా ప్రకాశ్‌కు అప్పులు ఎక్కువయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. జూన్‌ 10లోగా పదోతరగతి ఫలితాలు

పదో తరగతి పరీక్షల ఫలితాలను జూన్‌ 10లోగా విడుదల చేయనున్నారు. మూల్యాంకన ప్రక్రియ ముగిసింది. ఫలితాల విడుదలకు పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. మంత్రి బొత్స సత్యనారాయణ ఇచ్చే సమయం ఆధారంగా 8, 10 తేదీల మధ్య విడుదల చేస్తారు. జులై రెండో వారంలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ నిర్వహించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. యుద్ధం 3.10కి మొదలుపెడదాం

‘కరెక్టుగా 3.10 నిమిషాలకు స్టార్ట్‌ యుద్ధం’.. ‘పోలీసువారు భోజనాలు చేస్తున్నారు. ఇదే మంచి సమయం.. అమలాపురం టౌన్‌లోకి రావడానికి’.. ఇలాంటి సందేశాలు ఈ నెల 24న వాట్సప్‌ గ్రూపుల్లో గంపగుత్తగా వెళ్లాయి. అవే అమలాపురంలో విధ్వంసానికి కారణమయ్యాయని పోలీసులు వెల్లడించారు. వీటిని ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు శనివారం మీడియా ముందుంచారు. విధ్వంసం కేసులో మరో 25 మందిని అరెస్టుచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. T20 League : పదిహేను పట్టేదెవరో?

రెండు కొత్త జట్ల రాకతో సుదీర్ఘంగా సాగిన లీగ్‌ దశ తర్వాత, రసవత్తర ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లతో అలరించిన టీ20 లీగ్‌ 15వ సీజన్‌ పతాక పోరు ఆదివారమే. లీగ్‌లోకి అడుగు పెట్టిన తొలి సీజన్లోనే అద్భుత ప్రదర్శనతో లీగ్‌ దశలో అగ్రస్థానంలో నిలిచి, తొలి క్వాలిఫయర్లోనూ సునాయాసంగా నెగ్గి ఫైనల్‌ చేరింది గుజరాత్‌. చాలా ఏళ్ల తర్వాత నిలకడగా ఆడి రెండో స్థానంతో లీగ్‌ ముగించి, తొలి క్వాలిఫయర్లో ఓడినా, రెండో క్వాలిఫయర్లో అలవోకగా నెగ్గి తుది సమరానికి అర్హత సాధించింది రాజస్థాన్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఈ అలవాట్లు... విజయానికి మెట్లు!

అర్థాంతరంగా చదువాపేసి వ్యాపారంలోకి దిగి కోటీశ్వరులు అవుతారు ఒకరు... గుమాస్తాగా ఉద్యోగంలో చేరి కంపెనీ సీఈఓ స్థాయికి ఎదుగుతారు ఇంకొకరు... తండ్రి ఇచ్చిన కుటుంబ వ్యాపారాన్ని అంతర్జాతీయ సంస్థగా అభివృద్ధి చేస్తారు మరొకరు... కార్యకర్తగా కెరీర్‌ మొదలెట్టి కేంద్రమంత్రో ముఖ్యమంత్రో అయిపోతారు ఇంకొకరు... ఏమిటీ వీళ్ల విజయ రహస్యం అంటే- వారి వారి అలవాట్లే... అంటున్నారు పరిశోధకులు. పలువురి విజయ గాథల్ని అధ్యయనం చేసి వారు రూపొందించిన మంచి అలవాట్ల జాబితా ఏ వృత్తిలో ఉన్నవారికైనా అనుసరణీయమే! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని