Updated : 27 Jun 2022 09:12 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. మేమున్నది ఊళ్లోనా.. అడవిలోనా?

‘ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలతో రైతులకు అన్యాయం జరిగింది. ఈ విషయమై నిలదీసినందుకు నాపై వైకాపా నాయకులు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. మహిళనని కూడా చూడకుండా నెల రోజులుగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇంటికి తాళం వేసి.. నీళ్లు, పాలు అందకుండా చేశారు. మేము ఉంటున్నది ఊళ్లోనా.. లేక అడవిలోనా అనేది తెలియట్లేదు’ అని ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరుకు చెందిన కవిత ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం

2. Telangana News: నన్ను చదివించండి సారూ!

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఓ ఆలయ సందర్శనకు వెళ్లారు. హఠాత్తుగా ఓ బాలుడు వచ్చి ఆయన చేయి పట్టుకుని రోదించసాగాడు. అనూహ్య పరిణామంతో ఆయనకు వెంటనే ఏమీ అర్థం కాలేదు. బాలుడిని సముదాయించి.. ఏంటని ఆరాతీయగా.. ‘నన్ను చదివించండి సారూ’ అంటూ అతడు వేడుకున్నాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలం కాకర్లపహాడ్‌ మైసమ్మ దేవాలయం వద్ద ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. హన్వాడ మండలానికి చెందిన మల్లెల వెంకటేశ్‌ నిరుపేద. సొంతూళ్లో ఆస్తిపాస్తులు లేకపోవటంతో.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆ చీకటి రోజులు మరవొద్దు

భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు 1975లో అత్యయిక స్థితి రూపంలో ఒక ప్రయత్నం జరిగిందని.. దాన్ని దేశ ప్రజలు తిప్పికొట్టారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో అత్యయిక స్థితి పరిణామాలను ప్రస్తావిస్తూ పరోక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. ఆ చీకటి రోజులు మరవొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘అత్యయిక స్థితి సమయంలో పౌరుల నుంచి అన్ని హక్కులను లాగేసుకున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. TS TET Results 2022: టెట్‌ ఫలితాలు నేడు లేనట్లే!

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఫలితాలను ఈ నెల27న వెల్లడిస్తామని టెట్‌ నోటిఫికేషన్‌లోనే స్పష్టంచేసిన పాఠశాల విద్యాశాఖ దానిపై ఆదివారం రాత్రివరకు అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి మాత్రం తేదీ ఖరారయ్యాక సమాచారం ఇస్తామని తెలిపారు. అంటే సోమవారం ఫలితాలు వెల్లడి కాకపోవచ్చని భావిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Weather Forecast: నేడు, రేపు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు!

5. Chiranjeevi: ఆ ప్రేమని గోపీచంద్‌ కొనసాగిస్తున్నారు

‘‘గోపీచంద్‌ తండ్రి టి.కృష్ణ నాకు కాలేజీలో సీనియర్‌. ఆయన ఎప్పుడూ నాకు హీరోలా కనిపించేవారు. అద్భుతమైన దర్శకులు. సినిమాపై ఆయనకున్న ప్రేమని గోపీచంద్‌ కొనసాగిస్తున్నార’’న్నారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘పక్కా కమర్షియల్‌’ ముందస్తు విడుదల వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గోపీచంద్‌, రాశిఖన్నా జంటగా నటించిన చిత్రమిది. మారుతి దర్శకత్వం వహించారు. బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పకులు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

నెదర్లాండ్‌కు చెందిన ఓ నిపుణులు ప్రత్యేకమైన దిండును తయారు చేశాడు. ఈ అధునాతన దిండు తయారీలో నీలమణి, వజ్రాలు, బంగారం, మల్బరీ సిల్క్‌తో పాటు పలు విలువైన వస్తువులను వినియోగించినట్లు రూపకర్త థిజ్‌ వాన్ డెర్ హిల్ట్స్‌ వెల్లడించారు. ఈ ప్రత్యేకమైన దిండును తయారీకి ఏకంగా 15 ఏళ్లపాటు కృషి చేసినట్లు తెలిపాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు ఇదేనని.. ఈ దిండు ప్రారంభ ధర 57వేల డాలర్లుగా (దాదాపు రూ.45లక్షలు) నిర్ణయించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. చెరువు చేనైంది

ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని కొనకనమిట్ల మండలంలో అక్రమార్కులు చెరువులనే కబ్జాచేశారు. అధికార పార్టీ నేతల భాగస్వామ్యంతో తమ వశం చేసుకొని చుట్టూ కంచె వేసి మరీ విక్రయాలు చేస్తున్నారు. చినారికట్ల, పెదారికట్ల గ్రామాల్లోని రెండు చెరువులకు సంబంధించి 90 ఎకరాల భూమి అన్యాక్రాంతం కాగా అందులో 70 ఎకరాల్లో పంటలు వేసేశారు. మరో 20 ఎకరాలను ఇతరులకు విక్రయించేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Dharmana Prasada Rao: పార్టీపై ఆధారపడి బతకొద్దు

8. కూనపై అలవోకగా..

ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో భారత్‌ శుభారంభం చేసింది. ఆదివారం వరుణుడు ప్రభావం చూపిన మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్య నేతృత్వంలోని టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో.. దీపక్‌ హుడా (47 నాటౌట్‌; 29 బంతుల్లో 6x4, 2x6), ఇషాన్‌ కిషన్‌ (26; 11 బంతుల్లో 3x4, 2x6), హార్దిక్‌ పాండ్య (24; 12 బంతుల్లో 1x4, 3x6) చెలరేగడంతో 109 పరుగుల లక్ష్యాన్ని భారత్‌.. 9.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. లీజుకు క్వార్టర్లు!

రాష్ట్ర రాజధానిని అమరావతి నుంచి తరలించేందుకు వీల్లేదని మార్చి 3న హైకోర్టు విస్పష్టంగా తీర్పు చెప్పినా ప్రభుత్వ వైఖరిలో ఏ మాత్రం మార్పు రాలేదు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల నివాసం కోసం రాజధానిలో నిర్మించిన అపార్ట్‌మెంట్‌ టవర్లను ప్రైవేటు సంస్థలకు లీజుకివ్వాలని తాజాగా నిర్ణయించింది. నిధుల సమీకరణకు రాజధానిలో భూములు విక్రయించేందుకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇది బెబ్బులి అడ్డానా..?

 అడుగులతోనే అలజడి రేపుతున్న బెబ్బులి నచ్చినట్టు వేటాడుతూ సంచరిస్తోంది. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఉపప్రణాళిక ప్రాంతంలోని సమీప గ్రామాల్లో రోజుకు పది నుంచి 20 కిలోమీటర్లు పయనిస్తున్న దాని ప్రవర్తన అర్థంకాక అటవీ యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. ఇప్పటివరకు అది దాదాపు 150 చదరపు కి.మీ. విస్తీర్ణంలో సంచరించింది. తాజాగా రౌతులపూడి మండలం ఎ.మల్లవరం, లచ్చిరెడ్డిపాలెం గ్రామాల్లో పులి అడుగుజాడలు జనాన్ని ఆదివారం భయపెట్టాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పెళ్లి కాదేమో అంటారంతా..

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని