Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 29 Jun 2022 09:10 IST

1. Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి

ప్రముఖ నటి మీనా(Meena) భర్త విద్యాసాగర్‌ (48) (Vidya Sagar) మంగళవారం రాత్రి చెన్నైలో మరణించారు. ఆయనకు తీవ్రమైన శ్వాసకోశ సమస్య ఉందని, గత కొన్ని నెలలుగా చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. జనవరిలో మీనా కుటుంబం మొత్తం కొవిడ్‌ (Covid-19) బారిన పడింది. ఆ తర్వాత నుంచి ఆయన ఆరోగ్య సమస్య మరింత తీవ్రమైంది. గత కొన్నిరోజులుగా విద్యాసాగర్‌ ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబసభ్యులు ఆయన్ని చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. డీఏ బకాయిలు హుష్‌కాకి!

ఉద్యోగులను ప్రభుత్వం మరోమారు నమ్మించి, మోసం చేసింది. డీఏ బకాయిలను జీపీఎఫ్‌ ఖాతాలకు జమ చేసినట్లే చేసి, వెనక్కి తీసుకుంది. వ్యక్తిగత జీపీఎఫ్‌ ఖాతాల నుంచి తమ అనుమతి లేకుండా తీసుకోవడంపై ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. నిబంధనల ప్రకారం ఖాతాలో ఎవరైనా జమ చేయొచ్చు. విత్‌డ్రా చేసే అధికారం మాత్రం ఉద్యోగికే ఉంటుంది. ఉద్యోగుల అనుమతి లేకుండా ఇప్పుడు ప్రభుత్వం నిధులను తీసేసుకుంది. దీనిపైనా కొందరు ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ₹1000 లోపు హోటల్‌ గదులపైనా 12% జీఎస్‌టీ!

కొన్ని వస్తువులు, సేవలపై పన్ను రేట్లలో మార్పులకు జీఎస్‌టీ మండలి మంగళవారం ఆమోదం తెలిపింది. మాంసం, చేపలు, పెరుగు, పన్నీర్‌, తేనె వంటి ప్రీ-ప్యాక్డ్‌, లేబుల్డ్‌ ఆహార వస్తువులపైనా  జీఎస్‌టీ (వస్తు సేవల పన్ను) విధించనున్నారు. చెక్‌ల జారీకి బ్యాంకులు వసూలు చేసే ఛార్జీలపైనా పన్ను వసూలు చేస్తారు. అంతరాష్ట్ర పరిధిలో పసిడి, విలువైన రాళ్లను రవాణా చేసేందుకు రాష్ట్రాలు ఇ-వే బిల్లు జారీ చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Balineni Srinivasa Reddy: నాటకాలు ఆపకపోతే కాళ్లు విరగ్గొడతా!

సొంత పార్టీ నేతలే ప్రతిపక్షంతో చేతులు కలిపి తనకు వ్యతిరేకంగా నాటకాలు ఆడుతున్నారని, ఇప్పటికైనా వారు పద్ధతి మార్చుకొని వాటిని ఆపకపోతే కాళ్లు విరగ్గొడతానని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఇప్పటివరకు ఓపిక పట్టానని... తాను తింటుందీ ఉప్పూ కారమేనని... ఇకపై ఈ తరహా వ్యవహారాలు సహించేది లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. మంగళవారం నిర్వహించిన ఒంగోలు నియోజకవర్గ వైకాపా ప్లీనరీలో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Gudivada Amarnath: అయ్యన్న నాలుక చీరేస్తా!: మంత్రి అమర్‌నాథ్‌ హెచ్చరిక

5. Udaipur Murder: భగ్గుమన్న ఉదయ్‌పుర్‌

రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ నగరంలో మంగళవారం సంచలన హత్య చోటుచేసుకుంది. ఇస్లాం మతాన్ని అవమానించాడన్న ఆరోపణతో ఓ దర్జీని ఇద్దరు వ్యక్తులు పట్టపగలే అత్యంత కిరాతకంగా నరికి చంపారు. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. చంపేస్తామంటూ ప్రధాని మోదీకీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఉదంతంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నిచోట్ల హింస చోటుచేసుకుంది. పరిస్థితులు మరింత అదుపు తప్పకుండా ఉదయ్‌పుర్‌లో 7పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Social Media: 87% భారతీయులు ఇదే నమ్ముతున్నారు

సాధారణంగా ఏ విషయంపైనైనా వాస్తవ సమాచారం తెలుసుకోవాలంటే పుస్తకాలు, పత్రికలు లేదా ఇతర సంప్రదాయ మార్గాలపై ఆధారపడతాం. ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని, సామాజిక మాధ్యమాల్లోనే సమాచారాన్ని ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారని తాజా అంతర్జాతీయ సర్వే పేర్కొంది. ముఖ్యంగా భారత్‌లో ఈ సంఖ్య అధికంగా ఉందని వెల్లడించింది. భారత్‌లో కచ్చితమైన సమాచారం తెలుసుకొనేందుకు, తమకు తెలిసిన విషయాన్ని రూఢీ చేసుకొనేందుకు 54% మంది ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లనే ఆశ్రయిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!

తెల్లవారితే బదిలీల ప్రక్రియ మొదలుకానుంది. అన్ని ఏర్పాట్లూ జరిగాయి.. సిఫార్సులతో సంబంధం లేకుండా, నిబంధనల ప్రకారం బదిలీలు చేపట్టేందుకు రవాణాశాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ సన్నాహాలు చేశారు. ఇంతలోనే ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. ఇది ఆ శాఖలో సంచలనంగా మారింది. రాజకీయ ఒత్తిళ్లను పట్టించుకోకుండా నిబంధనలు కచ్చితంగా పాటిస్తానని చెప్పిన ఆయన్ను చివరి నిమిషంలో పదవి నుంచి తప్పించడం ఇపుడు ఆ శాఖలో చర్చనీయాంశమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. TS Inter Results 2022: ఇంటర్‌ ఫలితాల్లో మళ్లీ తప్పులు!

 ఇంటర్‌ ఫలితాల వెల్లడిలో బోర్డు నిర్లక్ష్యం విద్యార్థులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోని ఇంటర్‌ బోర్డు అధికారులు ఫలితాలపై నిర్లక్ష్యం వహిస్తున్నట్లు మరోసారి స్పష్టమవుతోంది. ఫలితాలు మంగళవారం విడుదల కాగా....కొందరు విద్యార్థులు అన్నింట్లో మంచి మార్కులతో పాసైనా ఒక సబ్జెక్టులో మాత్రం సున్నా రావడం అధికారుల నిర్లక్ష్యానికి ఉదాహరణ. ఫలితాల విడుదల సందర్భంగా ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ మాట్లాడుతూ. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యారా?

9. గెలిచారు.. అతి కష్టంగా

ఐర్లాండ్‌తో తొలి టీ20లో విజయం సాధించిన టీమ్‌ఇండియా.. రెండో టీ20ని కూడా సొంతం చేసుకుని సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. కానీ 225 పరుగుల భారీ స్కోరు చేసినా గెలుపు అంత తేలిగ్గా దక్కలేదు. పేరుకు చిన్న జట్టే అయినా గొప్పగా పోరాడిన ఐర్లాండ్‌.. అంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించినంత పని చేసింది. ఆఖర్లో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో భారత్‌ ఊపిరి పీల్చుకుంది. మొదట దీపక్‌ హుడా (104; 57 బంతుల్లో 9×4, 6×6) సెంచరీకి సంజు శాంసన్‌ (77; 42 బంతుల్లో 9×4, 4×6) మెరుపులు తోడవడంతో టీమ్‌ఇండియా భారీ స్కోరు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కమలనాథుల ‘మహా’ ఎత్తు

మహారాష్ట్రలో రాజకీయం ఒక్కసారి మలుపు తిరిగింది. అసమ్మతి రాజకీయాలను తెరవెనుక నుంచి ఎగదోస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా మంగళవారం వేగంగా, బాహాటంగా పావులు కదిపింది. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ సంకీర్ణం కుప్పకూలితే శివసేన అసమ్మతి వర్గంతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది కమలనాథుల వ్యూహంగా కనిపిస్తోంది. దీనికి తగ్గ కార్యాచరణను సిద్ధం చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ రంగంలో దిగారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని