Updated : 04 Jul 2022 09:11 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. వాడిన నూనే ఇం‘ధనమ’వునులే!

వాడిన వంటనూనెతో జీవ ఇంధన (బయో డీజిల్‌) ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి వాడిన వంటనూనెలను కొనుగోలు చేసి, వాటినుంచి బయోడీజిల్‌ తయారుచేసే సంస్థలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. ఈ సంస్థలు నూనెను జీవ ఇంధనంగా మార్చి, కేంద్రప్రభుత్వ సంస్థలైన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం, హిందూస్థాన్‌ పెట్రోలియం తదితర సంస్థలకు విక్రయిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ప్లాస్టిక్‌ పనిపట్టండి.. ఈ సంచి చేపట్టండి

2. ‘చెత్త’ రుసుం పక్కదారి!

నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నుంచి సేకరిస్తున్న చెత్త కోసం వసూలు చేస్తున్న రుసుములు పక్కదారి పడుతున్నాయి. వాలంటీర్లు, సచివాలయాల సిబ్బందిలో కొందరు వీటిని సొంతానికి వాడుకుంటున్నారు. వసూలు చేసిన మొత్తాలకు రసీదులనూ ఇవ్వడం లేదు. కొన్నిచోట్ల పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) డివైజ్‌లు ఇచ్చినా సరిగా ఉపయోగించడం లేదు. బకాయిలపై కమిషనర్లు సిబ్బందిని ప్రశ్నించిన చోట ప్రజలు చెల్లించడం లేదని చెప్పి తప్పించుకుంటున్నారు. రాష్ట్రంలోని 42 పుర, నగరపాలక సంస్థల్లో ఇళ్ల నుంచి చెత్త సేకరిస్తున్నందుకు ప్రజల నుంచి ప్రతి నెలా వినియోగ రుసుములు వసూలు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌గా సినీశెట్టి

ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌(2022) టైటిల్‌ను కర్ణాటకకు చెందిన సినీశెట్టి గెలుచుకున్నారు. ఆదివారం ముంబయిలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా గ్రాండ్‌ ఫైనల్‌ జరిగింది. ఈ పోటీల్లో రాజస్థాన్‌కు చెందిన రూబల్‌ శెఖావత్‌ మొదటి రన్నరప్‌గా నిలువగా, ఉత్తర్‌ప్రదేశ్‌ యువతి షినాటా చౌహాన్‌ ద్వితీయ రన్నరప్‌గా ఎంపికయ్యారు. బాలీవుడ్‌ నటులు నేహా ధూపియా, డినో మోరియా, మలైకా అరోరా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

13 ఏళ్లు.. 17 కంప్యూటర్‌ కోర్సులు

4. రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని ఆనాడే ఆమె వద్దనుకున్నారు!

దేశ అత్యున్నత పీఠమైన రాష్ట్రపతి పదవిని చేపట్టే అవకాశం లభిస్తుందంటే సాధారణంగా ఎవరైనా ఆనందంతో అంగీకరిస్తారు. కానీ రుక్మిణీ దేవి అరండల్‌ మాత్రం ఆనాడే ఇలాంటి ప్రతిపాదనను తిరస్కరించారు. దేశ తొలి మహిళా రాష్ట్రపతిగా మహారాష్ట్రకు చెందిన ప్రతిభా పాటిల్‌ చరిత్రలో నిలిచిపోయిన సంగతి మనందరికీ తెలుసు. తాజాగా ఎన్నికలు జరుగుతున్న వేళ.. మరో మహిళ ద్రౌపదీ ముర్ము కూడా బరిలో కీలకంగా ఉన్నారు. అయితే 1977లోనే ఓ మహిళను ప్రథమ పౌరురాలిగా ఎన్నుకోవడానికి ప్రయత్నం జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘సుమో’సా.. బరువు 8 కిలోలు మాత్రమే

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారి.. ఏకంగా 8 కిలోల సమోసాను తయారు చేశారు. మేరఠ్‌లోని లాల్‌కుర్తిలో స్నాక్స్‌ దుకాణం నడిపిస్తున్న శుభమ్‌ కౌశల్‌.. శనివారం భారీ సమోసాను తయారు చేసి బాహుబలి సమోసాగా పేరు పెట్టారు. దీని తయారీకి రూ.1,100 ఖర్చు అయిందని చెప్పారు. అంతేకాకుండా త్వరలోనే పది కేజీల సమోసాను తయారు చేయబోతున్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* మెట్లపై జారిపడ్డ లాలూ..

6. బ్యాంకు క్లర్కు కొలువు సాధిద్దాం!

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 6 వేలకు పైగా క్లర్కు పోస్టుల భర్తీకి ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 209, తెలంగాణలో 99 ఉద్యోగాల ఖాళీలు భర్తీకానున్నాయి. ఈ సంఖ్య మరింత పెరగొచ్ఛు నోటిఫికేషన్‌ విడుదల సమయంలో మొత్తం 11 బ్యాంకుల్లో నాలుగు బ్యాంకులు తమ ఖాళీల వివరాలను ఐబీపీఎస్‌కు తెలియజేయలేదు. మార్చి 31, 2023 వరకు ఖాళీల వివరాలను తెలిపే వీలుండటంతో ఆలోగా ఉండే పదవీ విరమణ.. తదితర కారణాలతో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆ జాబితాలో నా పేరు లేదు.. పర్యటనకు రాలేను: మోదీకి రఘురామ లేఖ

ప్రధాని నరేంద్రమోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆయనకు లేఖ రాశారు. ప్రధాని భీమవరం పర్యటన జాబితాలో తన పేరు లేకపోవడంపై ఫిర్యాదు చేశారు. స్థానిక ఎంపీగా ఉన్న తన పేరును అధికారులు ఆ జాబితాలో చేర్చలేదని.. తన పేరు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందని రఘురామ పేర్కొన్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం ప్రధానిని స్థానిక ఎంపీ ఆహ్వానించాలన్నారు. కానీ తనకు ఆహ్వానం లేకపోవడంతో ఆ కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నట్లు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్‌

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం జరిగింది. అసహజ శృంగారం చేస్తూ తనను ఇబ్బంది పెట్టాడని భర్తపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగ్న వీడియోలు తీసి బెదిరిస్తున్నాడని లసుడియా పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. రూ.కోటి రూపాయలు ఇవ్వకపోతే ఈ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తానని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తన భర్తకు అత్తమామలు కూడా సహకరిస్తున్నారని వారిపై కూడా కేసు పెట్టింది. బాధితురాలి భర్త.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

గన్ను పట్టారా.. వెన్ను విరిగినట్లే..!

9. తాజ్‌మహల్‌ గదుల్లో దేవతల విగ్రహాలు లేవు

ప్రపంచ 7 వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌లో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ).. సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) కింద ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ఇందులో వాస్తవం లేదని స్పష్టం చేసింది. తాజ్‌ మహల్‌ నేలమాళిగలో(బేస్‌మెంట్‌) మూసి ఉన్న గదులు కానీ, హిందూ దేవతల విగ్రహాలు కానీ లేవని ఏఎస్‌ఐ పునరుద్ఘాటించింది. ఆర్‌టీఐ కింద అడిగిన ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. బిగించారు..ముగిస్తారా..?

అయిదో టెస్టులో టీమ్‌ ఇండియా పట్టుబిగిస్తోంది. ఇక ఇంగ్లాండ్‌కే సవాల్‌. మొదటి ఇనింగ్స్‌లో 132 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించిన భారత్‌.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. పుజారా (50 బ్యాటింగ్‌; 139 బంతుల్లో 5×4) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడితో పాటు పంత్‌ (30 బ్యాటింగ్‌; 46 బంతుల్లో 4×4) క్రీజులో ఉన్నాడు. ఆదివారం ఓవర్‌నైట్‌ స్కోరు 84/5తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లాండ్‌.. 284 పరుగులకు ఆలౌటైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని