Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... 

Updated : 05 Jul 2022 09:10 IST

1. విద్యుత్తు అవసరం లేని ఏసీ!

వేడి నుంచి ఉపశమనం పొందడానికి నేడు ఏసీలు అనివార్యమయ్యాయి. అయితే వీటి వాడకం వల్ల కరెంటు బిల్లు తడిసిమోపెడవుతోంది. పైగా విద్యుత్తు కోతల సమయంలో ఈ శీతల యంత్రాలు పనిచేయవు. గువాహటిలోని ఐఐటీ శాస్త్రవేత్తలు దీనికి చక్కటి పరిష్కారాన్ని చూపారు. చౌకైన ‘రేడియేటివ్‌ కూలర్‌ పూత’ పదార్థాన్ని అభివృద్ధి చేశారు. దీన్ని ఇంటిపైకప్పులకు వేస్తే కరెంటు అవసరం లేకుండానే చల్లదనం అందిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* డ్రైవర్‌ లేకుండానే రయ్‌.. రయ్‌

2. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ కవాతుపై తూటా

అమెరికా స్వాతంత్య్ర దిన వేడుకల్లో నెత్తురు చిందింది. ఇలినాయీ రాష్ట్రంలోని షికాగో నగర శివారు ప్రాంతమైన హైలాండ్‌ పార్క్‌లో సోమవారం కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. 24 మంది గాయపడ్డారు. స్థానికంగా స్వాతంత్య్ర దినోత్సవ కవాతు ప్రారంభమైన 10 నిమిషాల్లోనే.. కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో కవాతును వీక్షించేందుకు, అందులో పాల్గొనేందుకు వచ్చిన వందల మంది తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. N95 face mask: కరోనా వైరస్‌ను చంపేసే మాస్కు

 కొవిడ్‌-19కు కళ్లెం వేసే కొత్తరకం ఎన్‌95 మాస్కును అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది వ్యాధి వ్యాప్తిని తగ్గించడమే కాకుండా వైరస్‌ను చంపేస్తుంది. ఈ మాస్కును ఎక్కువ కాలం వాడొచ్చు. ఎన్‌95 మాస్కుల్లో వాడే పాలీప్రొపలీన్‌ ఫిల్టర్లలోకి బ్రాడ్‌ స్పెక్ట్రమ్‌ యాంటీ మైక్రోబియల్‌ పాలీమర్లను విజయవంతంగా జోడించడం ద్వారా రెన్‌సెలీర్‌ పాలీటెక్నిక్‌ ఇన్‌స్టిట్యూట్‌, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రోజూ ‘బయోమెట్రిక్‌’ వేసి వెళ్తే నెలకు రూ. 15 వేలు!

రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం(2022-23) అనుబంధ గుర్తింపు పొందేందుకు ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉత్తుత్తి అధ్యాపకుల కోసం మళ్లీ వేట కొనసాగిస్తున్నాయి. అలాంటి వారిని గుర్తించి రప్పించే బాధ్యతను కొన్ని కాలేజీలు కన్సల్టెన్సీలకు అప్పగించాయి. దాంతో కన్సల్టెన్సీల సిబ్బంది కళాశాలల్లో పనిచేసే, మానేసి ఇతర వృత్తుల్లోకి వెళ్లిన వారికి ఫోన్లు చేస్తున్నాయి. ఈ తరహా ఫోన్‌ రికార్డెడ్‌ వాయిస్‌లు కూడా సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారాయి. రోజూ ఉదయం, సాయంత్రం బయోమెట్రిక్‌ హాజరు వేసి వెళితే నెలకు రూ.15 వేలు ఇస్తామని, జేఎన్‌టీయూహెచ్‌ తనిఖీల నాడు వస్తే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు

5. కలెక్టరమ్మా... కాలువల మధ్య ఇళ్లు కట్టలేమమ్మా!

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామస్థులు సుమారు 400 మంది ట్రాక్టర్లపై ‘స్పందన’ కార్యక్రమానికి తరలివచ్చారు. ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా పోలవరం, పుష్కర కాలువ మధ్య పాములచెరువు ప్రాంతంలో అధికారులు పలువురికి ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఇరువైపులా కాలువలతో ప్రమాదకరంగా ఉన్న ఈ ప్రాంతంలో తమకు ఇళ్ల స్థలాలు వద్దని, వేరే చోట ఇవ్వాలంటూ ఏడాదిగా వీరు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తూనే ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ప్రధానిని ఎలా గౌరవించాలో జగన్‌ను చూసి తెలుసుకోవాలి: ధర్మేంద్ర ప్రధాన్‌

ప్రధానిని ఏ విధంగా గౌరవించాలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను చూసి తెలంగాణ సీఎం కేసీఆర్‌ తెలుసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ అన్నారు. హెచ్‌సీయూలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్‌ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని మరిచిపోకూడదు. మోదీని ఈ దేశ ప్రజలు రెండుసార్లు ప్రధానిగా ఎన్నుకున్నారు. ఏపీ సీఎం జగన్‌ ఏ తరహాలో ప్రధానికి ఆహ్వానం పలికారో.. అదే తరహాలో ఏ ముఖ్యమంత్రి అయినా ప్రధానికి గౌరవం ఇవ్వాలి’’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ప్రాణం పోసిన ప్రయోగాత్మక ఔషధం

నీ ఒంట్లో క్యాన్సర్‌ ముదిరిపోయింది! కొద్ది నెలలు మాత్రమే జీవిస్తావు..!! కొన్నేళ్ల కిందట వైద్యులు ఆమెతో అన్న మాటలివి. దీంతో ఆమె ఒక్కసారిగా తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. ఇప్పుడు ఆమె వేడుక చేసుకుంటున్నారు. కారణం.. నీ శరీరంలో క్యాన్సర్‌ జాడలేదని డాక్టర్లు చెప్పడమే. ప్రయోగాత్మకంగా ఇచ్చిన ఇమ్యునోథెరపీ ఔషధం సత్ఫలితమివ్వడంతో.. మోడువారిన ఆమె జీవితం మళ్లీ కొత్త చిగురులు తొడిగింది. నిర్వేదం స్థానంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నెహ్రూ మద్దతు లేకుండానే ప్రథమ రాష్ట్రపతి పదవి

 ప్రథమ ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ మద్దతు లేకపోయినా డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ రాష్ట్రపతి అయ్యారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో గవర్నర్‌ జనరల్‌గా లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ ఉన్నారు. 1948లో ఆయన ఇంగ్లండ్‌ వెళ్లిపోవడంతో చక్రవర్తుల రాజగోపాలాచారి (రాజాజీ) ఆ పదవిలో నియమితులయ్యారు. 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌ జనరల్‌ స్థానంలో రాష్ట్రపతి ఉంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!

‘‘పేదలకు ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న రెండు పడక గదుల ఇళ్లను విక్రయించడం, కొనడం.. రెండూ నేరమే. అమ్ముతున్నవారిపైనా, కొనేవారిపైనా కఠిన చర్యలు తీసుకుంటాం.’’ ఇళ్ల పట్టాల పంపిణీ రోజే ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని లబ్ధిదారులకు స్పష్టంగా చెబుతున్నారు. అయినా కేటాయించిన నెల రోజులకే నగరంలోని పలు చోట్ల డబుల్‌ ఇళ్లు పక్కదారి పడుతున్నాయి. లబ్ధిదారులు వేర్వేరు కారణాలతో విక్రయిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* తెలంగాణ.. స్టార్టప్‌ ‘సూపర్‌స్టార్‌’

10. IND vs ENG : ఐదో టెస్టు మ్యాచ్‌ నాలుగో రోజు ఆట విశేషాలు..

భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య టెస్టు మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. 378 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి మూడు వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. చివరి రోజు ఇంగ్లాండ్‌ విజయానికి 119 పరుగులు అవసరం కాగా.. భారత్‌ గెలవాలంటే ఏడు వికెట్లను పడగొట్టాలి. ఈ క్రమంలో నాలుగో రోజు ఆట ఎలా సాగిందో మ్యాచ్‌ హైలైట్స్‌ చూసేయండి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని