Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 Jul 2022 09:11 IST

1. నేడు, రేపు అతి భారీ వర్షాలు

ఝార్ఖండ్‌పై రెండురోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం మంగళవారం మధ్యప్రదేశ్‌పైకి విస్తరించింది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. మరోవైపు బంగాళాఖాతంపై మరో ఉపరితల ఆవర్తనం 4.5 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడింది. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ప్రభుత్వ బడిలో ఐఏఎస్‌ పిల్లలు

2. ఎంపీ సెల్‌ఫోన్‌ మిస్సింగ్‌పై వివాదం

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌రామ్‌ సెల్‌ఫోన్‌ మిస్సింగ్‌పై వివాదం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి రోజాకు వీడ్కోలు పలికేందుకు మంగళవారం ఆయన రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ ఓ మహిళ ఆయనతో సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం తన సెల్‌ఫోన్‌ చోరీకి గురైందని కోరుకొండ పోలీసులకు ఎంపీ ఫిర్యాదు చేశారు. దీంతో వారు రంగంలోకి దిగారు. సిగ్నల్స్‌ ఆధారంగా గాడాల సమీపంలోని ఓ కాలనీలో నివసిస్తున్న శిరీష ఇంటికి వెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా పెరిగింది. చమురు సంస్థలు రూ.50 మేర పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో గ్యాస్‌ ధర రూ.1055 నుంచి రూ.1105కు చేరింది. సాధారణంగా ప్రతి నెల 1న వీటి ధరల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఈ నెల 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధరను చమురు సంస్థలు రూ.183.50 మేర తగ్గించాయి. తాజాగా గృహావసరాల గ్యాస్‌ ధరను పెంచాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కలాం అలా కళ్లెం వేశారు!.. ముషారఫ్‌ను నిలువరించిన వేళ..

సమయం, సందర్భం లేకుండా వివిధ వేదికలపై కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తడం పాకిస్థాన్‌కు కొత్తేమీ కాదు. అబ్దుల్‌ కలాం రాష్ట్రపతిగా ఉన్న సమయంలో నాటి పాక్‌ సైనిక పాలకుడు పర్వేజ్‌ ముషారఫ్‌ ఇలాంటి ప్రయత్నమే చేయబోగా ఆయన్ను కలాం వ్యూహాత్మకంగా అడ్డుకున్నారు. 2005 ఏప్రిల్‌లో భారత్‌ - పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌ చూడటానికి ముషారఫ్‌ వచ్చారు. మ్యాచ్‌ అనంతరం ఆయన రాష్ట్రపతి భవన్‌కు వెళ్లనుండగా.. ముషారఫ్‌ కచ్చితంగా కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావిస్తారని కలాంకు ఆయన కార్యదర్శి పి.ఎం.నాయర్‌ చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌, డేటా చౌర్యం!

5. ప్రముఖ సినీ ఎడిటర్‌ గౌతమ్‌ రాజు కన్నుమూత

ప్రముఖ సినీ ఎడిటర్‌ గౌతమ్‌ రాజు (Gautham Raju) (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. గౌతమ్‌ రాజు మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేశారు. గౌతమ్‌రాజు కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!

విదేశీ విద్య లక్షల మంది విద్యార్థుల కల. ఏదో ఒక మంచి కాలేజీలో సీటు రావడమే మహాభాగ్యంగా భావిస్తారు! ఇక అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మక సంస్థల్లో సీటంటే ఎంత పోటీ? అలాంటిది కేంబ్రిడ్జ్‌ సహా ఆరు అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో సీటు సాధించింది చిట్టూరి నయన చౌదరి. ప్రతి దశలోనూ ముందస్తు ప్రణాళిక, అధ్యయనం, తగిన వ్యూహం ఉంటే ఎవరైనా ఇలా సాధించవచ్చంటోందీ చదువుల తల్లి... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రూ.19 వేల కోట్ల కోత

తెలంగాణ రాష్ట్ర రుణ పరిమితిని 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ.19 వేల కోట్ల మేర తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బాండ్ల విక్రయం ద్వారా రూ.34,970 కోట్లను రాష్ట్ర అభివృద్ధి రుణంగా తీసుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించింది. ప్రస్తుత సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ) ప్రకారం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి మేరకు బాండ్ల విక్రయం ద్వారా రూ.53,970 కోట్లను రుణంగా తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే కేంద్ర ఆర్థికశాఖ ఈ ఏడాది నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మందుల ధరలకు కళ్లెం..

8. పడగొట్టలేక పంచుకున్నారు

ఇంగ్లిష్‌ గడ్డపై పరాజయాల పరంపరకు తెరదించి, టెస్టు సిరీస్‌ గెలిచేందుకు వచ్చిన అవకాశాన్ని భారత్‌ ఉపయోగించుకోలేకపోయింది. నిరుడు సిరీస్‌ ఆగిపోయినప్పటికి.. ఇప్పుటికి చాలా మారిన ఇంగ్లిష్‌ జట్టు.. ఏకంగా 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్‌ను ఎగరేసుకుపోయింది. సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 259/3తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లాండ్‌.. ఇంకో వికెట్‌ కోల్పోకుండానే ఛేదన పూర్తి చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ప్రముఖ వాస్తు నిపుణుడి దారుణ హత్య.. శరీరంపై 39 కత్తిపోట్లు

ప్రముఖ వాస్తు నిపుణుడు చంద్రశేఖర గురూజీ మంగళవారం కర్ణాటకలోని హుబ్బళ్లిలో దారుణ హత్యకు గురయ్యారు. నగర శివార్లలోని ఉణకల్‌ హోటల్‌లో ఈ ఘాతుకం చోటుచేసుకున్నట్లు పోలీసు కమిషనర్‌ లాభూరాం వెల్లడించారు. వాస్తు సూచనల కోసమంటూ వచ్చిన ఇద్దరు ఆగంతుకులు ఆయనను కత్తులతో విచ్చలవిడిగా పొడిచి పరారయ్యారు. ఆయన శరీరంపై 39 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానితుల ఆచూకీ కోసం... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మెత్తని భూతం!

ప్లాస్టిక్‌ లేకపోతే జీవితం ఎలా ఉండేది? దీన్ని కనుగొనకపోయి ఉంటే మన పరిసరాలు, సమాజం ఎలా ఉండేవి? ఎప్పుడైనా ఊహించారా? ఇంట్లో స్విచ్చులు, దువ్వెనలు, కుర్చీలు, బల్లలు.. ఆ మాటకొస్తే పొద్దున లేవగానే పళ్లు తోముకునే బ్రష్షుల దగ్గర్నుంచి రిమోట్‌ కంట్రోళ్లు, మిక్సీలు, గ్రైండర్ల వంటి పరికరాల వరకూ అన్నీ పాస్టిక్‌తో తయారైనవే మరి. ఇంట్లోనే కాదు బయటా ఇదే పరిస్థితి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అతి నీలలోహిత కిరణాలతో ప్లాస్టిక్‌ను కరిగించేయొచ్చు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని