Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 01 Aug 2022 09:24 IST

1. శంషాబాద్‌ వద్ద రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్‌ నేత కుమార్తె మృతి

హైదరాబాద్‌ నగర శివారు శంషాబాద్‌ పరిధిలోని శాతంరాయి వద్ద ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్డు ప్రమాదం జరిగింది. ఎయిర్‌పోర్టు నుంచి తిరిగి వస్తుండగా కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతిచెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. చుక్‌ చుక్‌ బండి.. అంతటా ఆగదండి!

రీంనగర్‌ నుంచి పెద్దపల్లి మీదుగా మంచిర్యాలకు రహదారి మార్గంలో వెళ్తే సుమారు 84 కిలోమీటర్ల దూరానికి రెండు గంటలకు పైగా ప్రయాణించాలి. అదే రైలులో పెద్దపల్లి నుంచి మంచిర్యాలకు అర గంటలోపే చేరుకోవచ్చు. దీంతో చాలా మంది కరీంనగర్‌ నుంచి పెద్దపల్లి వరకు బస్సులో వచ్చి అక్కడి నుంచి అందుబాటులో ఉండే ఎక్స్‌ప్రెస్‌ గాని, ప్యాసింజర్‌ రైలు గాని ఎక్కితే మొత్తమ్మీద గంటన్నరలోనే మంచిర్యాల చేరుకోవచ్చు. అయితే ఇదంతా గతం.. దాదాపు రెండున్నరేళ్ల కిందట కరోనా వచ్చిన తర్వాత రైళ్ల వేళలన్నీ మారాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రద్దీ ఉన్నా రద్దా?

3. సేవకో ధర.. పర్యవేక్షణ అరకొర

భువనగిరికి చెందిన తుక్కాపురం జహంగీర్‌ శనివారం తన టాటా ఏసీ వాహనం రోడ్డు రవాణా పన్ను చెల్లించేందుకు పాత బస్టాండులో మీసేవ కేంద్రానికి వెళ్లారు. సాధారణంగా వాహన పన్ను రూ.1060, డిపార్ట్‌మెంట్‌ ఛార్జీ రూ.50 కలిపి మొత్తం రూ.1,110 చెల్లించాలి. నిర్వాహకులు మాత్రం అదనంగా పది రూపాయలు తీసుకొని రూ.1,110కి రసీదు మాత్రమే ఇచ్చారు. రుసుం పట్టికలో యూజర్‌ సర్వీస్‌ ఛార్జీలు లేవని పొందుపర్చారు. కానీ, రోడ్డు రవాణా పన్నుకు మాత్రం అదనంగా రూ.పది వసూలు చేస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సూపర్ సేవలు ఇక లేనట్టేనా...!

విజయవాడ కొత్తాసుపత్రిలో నిర్మించిన సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ లాంటి అధునాతన భవనం ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనూ లేదు. ఐదంతస్తుల్లో రూ.కోట్ల విలువైన పరికరాలను కొనుగోలు చేసి తీసుకొచ్చి మరీ ఈ భవనంలో అందుబాటులో ఉంచారు. ఇక్కడ ఉన్న డిజిటల్‌ ఎక్స్‌రేలాంటి యంత్రాలు ఒక్కొక్కటి రూ.2 కోట్లకు పైగా విలువైనవి. ప్రైవేటులో ఒక్కో వైద్య పరీక్షకు వేల రూపాయలు వసూలు చేస్తారు. పేద రోగుల వైద్య సేవల కోసం గత ప్రభుత్వ హయాంలో భారీగా ఖర్చు చేసి మరీ సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌ను నిర్మించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘ట్రబుల్‌’ ఐటీ!

గ్రామీణ ప్రాంత విద్యార్థులను సాంకేతిక రంగంలో మెరికలుగా మార్చాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన బాసర రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్‌జీయూకేటీ)ను నిధుల కొరత పట్టి పీడిస్తోంది. దీంతో బాసర ట్రిపుల్‌ఐటీ అధికారులు మౌలిక వసతుల కల్పన గురించి పట్టించుకోవడం లేదు. ఇటీవల విద్యార్థుల ఆందోళన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపినా ఇప్పటికీ ప్రభుత్వం రెగ్యులర్‌ ఉపకులపతిని నియమించకపోవడం గమనార్హం.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

బరువును మించి.. బడి సంచి..!

6. జడివానకు జడవాల్సిందేనా?

గంటలో ఐదు సెం.మీ., రెండు గంటల్లో పది సెం.మీ. వర్షం... హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో జులై నెలలో పలుమార్లు ఈ విధంగా కుండపోతగా కురిసిన వర్షాలతో వరద జనావాసాల్లోకి పోటెత్తింది. ఉరుము లేని పిడుగులా వచ్చి కాలనీలు, ఇళ్లను ముంచెత్తింది. తక్కువ సమయంలో అధిక వర్షపాతానికి వాతావరణ మార్పులే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటీవలి వర్షాలు ఒక హెచ్చరిక మాత్రమేనని.. మున్ముందు మరిన్ని వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి ఇలాంటి జడివానతో జనం జడవాల్సిందేనా? ఎదుర్కొనే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భలే బండి.. తొక్కేయండి

గుర్ల మండలం గోషాడ గ్రామానికి చెందిన భావి ఇంజినీరు బోగురోతు బెనర్జీ తన ఆలోచనలకు పదును పెట్టి కొత్త బ్యాటరీ బైక్‌ను రూపొందించాడు. దీనికి ఒక్కసారి  ఛార్జి చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని చెబుతున్నాడు. విజయనగరంలోని సీతం కళాశాలలో బీటెక్‌ ఆఖరి సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థి ఇంధనంతో నడిచే పాత ద్విచక్రవాహనం నుంచి కొన్ని విడిభాగాలను తీసుకొని వాటికి రెండు బ్యాటరీలను అమర్చాడు. ఇందుకు రూ.20 వేలు ఖర్చు చేసినట్లు బెనర్జీ తెలిపాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వారెవ్వా.. వెదురిల్లు!

8. తీరాన్నీ వదలట్లేదు

విశాలమైన 193 కిలోమీటర్ల తీరం జిల్లా సొంతం.. ఒకప్పుడు ఉన్నతమైన సరుగుడు వనాలతో కళకళలాడేది. పర్యవేక్షణ లోపించడం, వన సంరక్షణ సమితులు నిర్వీర్యమవ్వడం, మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టకపోవడంతో పరిస్థితే మారిపోయింది. సరుగుడు వృక్షాలు ఎక్కడికక్కడ నరికివేతకు గురికాగా, తీర భూములకు రక్షణ లేకపోయింది, దీంతో చాలా వరకు ఆక్రమణలకు గురవుతోంది. ఈ ఆక్రమిత భూముల్లో ఇసుక తరలింపు యథేచ్ఛగా సాగిపోతోంది. దీంతో ఇసుక దిబ్బలు కనుమరుగై ఏకంగా తీరాన్నే ముప్పులో పడేసే పరిస్థితులు తీసుకొస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కలెక్టర్‌ చెప్పినా... కాలేదు జమ!

వంశధార నిర్వాసితులకు అదనపు పరిహారం చెల్లింపుల్లో గందరగోళం నెలకొంటోంది. ప్రభుత్వం సీఎఫ్‌ఎంఎస్‌ విధానంలో నిర్వాసితుల ఖాతాలకు రూ.లక్ష చొప్పున జమ చేస్తుండడంతో స్పష్టమైన సమాచారం తెలియక వారు గందరగోళానికి గురవుతున్నారు. హిరమండలం తహసీల్దారు కార్యాలయంలో తహాసీల్దారు బి.మురళీమోహనరావుతో పాటు కార్యాలయ ఉద్యోగులు, వీఆర్వోలు పది రోజులుగా నిరంతరం సేకరించిన వివరాలు పరిశీలించి కంప్యూటర్లలో నమోదు చేసి కలెక్టరు కార్యాలయానికి నివేదిస్తూనే ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సీతారాములకు పునరావాస కష్టాలు

10. పేకముక్కలపై పెళ్లి పుస్తకం..

ఎన్నో మధుర జ్ఞాపకాల కలబోత పెళ్లి. దీనిని పది కాలాలు గుర్తుండిపోయేలా ఇటీవల మెహందీ, సంగీత్‌ వేడుకలంటూ..పెళ్లికి ముందు, తరువాత ఫొటోషూట్‌లు ఇలా ఎన్నో రకాలుగా పెళ్లి పుస్తకం కొత్త పుంతలు తొక్కుతోంది. అందులో భాగంగానే పేకముక్కలపై సైతం ఎవరి పెళ్లికి వచ్చామో గుర్తుండిపోయేలా ఇలా వధూవరుల చిత్రాలు ముద్రించి ఇస్తూ వినూత్న ఆలోచనకు తెరతీశారు. మరోవైపు వివాహ వేడుక చిత్రాలను చూపించే ఆల్బమ్‌తో పాటుగా, దానిమీదే పెళ్లి వీడియోను సైతం చూపించేందుకు వీలుగా ఒక ఎల్‌ఈడి తెర.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని