Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 07 Aug 2022 09:11 IST

1. ఆర్జీయూకేటీని వీడని సమస్యల గ్రహణం!

విశ్వవిద్యాలయం అంటే అదో విశాల ప్రపంచం. ఆచార్యులు, ఔత్సాహిక విద్యార్థుల పరిశోధనలతో వినూత్న ఆవిష్కరణల కేంద్రం. కానీ నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో ఒక్కరంటే ఒక్క ఆచార్యుడు లేరు. నూతన ఆవిష్కరణల మాటేలేదు. పుష్కరకాలంగా సమస్యల గూటిలో చిక్కి విలవిల్లాడుతోంది. గ్రామీణ విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. సమస్యల పరిష్కారం కోసం తరచూ విద్యార్థులు ఆందోళన బాట పడుతున్నారు. ఇటీవల తనను కలిసిన వారికి ఇచ్చిన హామీ మేరకు ఆదివారం రాష్ట్రగవర్నర్‌ తమిళిసై విద్యాలయాన్ని సందర్శించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* అమ్మలా విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే వచ్చా: గవర్నర్‌ తమిళిసై

2. CWG 2022: చరిత్ర సృష్టించిన భవినా పటేల్

కామన్వెల్త్‌ పోటీల్లో భారత పారా టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ భవినా పటేల్‌ చరిత్ర సృష్టించింది. పారా టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్ 3-5 కేటగిరీలో స్వర్ణం గెలుచుకుంది. గుజరాత్‌కు చెందిన 35 ఏళ్ల భవినా.. ఫైనల్స్‌లో నైజీరియాకు చెందిన క్రిస్టియానాపై 3-0తో గెలుపొందింది. దీంతో టీటీ విభాగంలో భారత తరఫున గోల్డ్‌ సాధించిన మొదటి క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. పోటీల్లో అంతకముందు మరో పారా టీటీ ప్లేయర్‌ సోనాల్‌బెన్‌ మనూబాయి పటేల్‌ కాంస్యం సొంతం చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అధ్యాపకుడి అకృత్యం

పాఠాలు బోధించి మంచి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఓ అధ్యాపకుడు విద్యార్థినులపైనే కన్నేశాడు. డబ్బు ఆశజూపి ఒకరిని శారీరకంగా లోబర్చుకున్నాడు. ఆమె సాయంతో అభంశుభం తెలియని మరో బాలికను బలవంతంగానైనా దారిలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. అసభ్య దృశ్యాల్ని వీడియోలో చిత్రీకరించి బెదిరించాలనుకున్నాడు. ఈ వైనం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చర్చనీయాంశంగా మారిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఒకరి గురించి ఒకరికి తెలియకుండా నాలుగు పెళ్లిళ్లు

4. నారాయణ.. నారాయణ!

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా ఉంది నారాయణపురం సాగునీటి ప్రాజెక్టు పరిస్థితి. ఆనకట్ట ఆధునికీకరణకు జైకా నిధులు మంజూరైనా పనుల్లో అడుగులు ముందుకు పడడం లేదు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 37,345 ఎకరాలకు సాగునీరు అందించేందుకు నాగావళి నదిపై నిర్మించిన ఈ ఆనకట్ట పనులు పూర్తికాక శివారు భూములకు అందని దుస్థితి ఏర్పడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వసతి గృహాలు.. సమస్యలకు నిలయాలు

పేద, మధ్యతరగతి, వెనుకబడిన వర్గాలకు చెందిన లక్షలాది మంది విద్యారులకు నాణ్యమైన విద్యనందించేకు ఏర్పాటుచేసిన వసతిగృహాలు సమస్యలకు నిలయంగా మారుతున్నాయి. అరకొర వసతులు, పారిశుద్ధ్య సమస్యలు, నాణ్యతలోపించిన భోజనంతో విద్యారులు అనారోగ్యాలకు గురవుతున్నారు. శుభ్రమైన మరుగుదొడ్లు, శుద్ధమైన తాగునీరు, మెనూ ప్రకారం భోజనం అందించడంలో అధికారులు విఫలమవుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* నిర్మాణానికి రూ.కోట్లు... వినియోగానికి తూట్లు!

6. ఉన్నది పోయి ఉపాధి కరవై

హంద్రీనీవా సుజల స్రవంతి పథకం విస్తరణ మల్యాల రైతుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ గ్రామానికి చెందిన పొలాలు ఇప్పటికే శ్రీశైలం జలాశయం, కేసీ, హంద్రీనీవా ప్రాజెక్టుల నిర్మాణాలకు తీసుకున్నారు. తాజాగా హంద్రీ నీవా కాలువ విస్తరణలో భాగంగా మరో ఆరు పంపుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం మరి కొంత భూసేకరణ చేపట్టాలని అధికారులు నిర్ణయించడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కళ్లముందే కబ్జా!

ముదిగుబ్బ మండలంలో భూ ఆక్రమణలు ఆగడం లేదు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు పాగా వేస్తున్నారు. స్థానిక నాయకులు కొందరు బృందంగా ఏర్పడి కబ్జాలకు పాల్పడుతున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు అక్రమార్కులతో చేతులు కలుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా గుంజేపల్లి రెవెన్యూ గ్రామ పరిధి సర్వే నంబరు 1190-3లోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు. సమీపంలోని స్టేడియానికి వెళ్లే 50 అడుగుల దారిని సైతం కలిపేసుకుని హోటల్‌ నిర్మాణం సాగిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పడకల్లేక పాట్లు..

8. చెత్తపన్ను తెస్తేనే జీతం..!

‘విజయవాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న మెడికల్‌ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, మేస్త్రీలు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సూపర్‌వైజర్లు, వార్డు హెల్త్‌ సెక్రటరీలు, వార్డు శానిటరీ సెక్రటరీలు, అడ్మిన్‌లు అందరూ డివిజన్లలో యూజర్‌ ఛార్జీలు(చెత్తపన్ను) చెల్లించిన రశీదులు పొందని పక్షంలో ఆగస్టు నెల వేతనం చెల్లించబోమంటూ వీఎంసీ ప్రజారోగ్య శాఖ ప్రధాన వైద్యాధికారి నోటీసు జారీచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అమ్మఒడి వచ్చిందా..? రాలేదు!

ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల వేళ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి చేదు అనుభవం ఎదురైంది. గుంటూరులో తిరంగా ర్యాలీ అనంతరం ఎన్‌టీఆర్‌ స్టేడియంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంలో మాట్లాడుతూ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాకే నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని అన్నారు. అనంతరం ‘అమ్మఒడి’ వచ్చిందా అని అడగ్గా రాలేదంటూ విద్యార్థులు చేతులు అడ్డంగా ఊపడంతో ఆమె నిరాశచెందారు. తాను స్వాతంత్య్రం గురించి అడుగుతున్నానంటూ ప్రసంగం ముగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. తటాకం కాదు.. తారు రోడ్డు

ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. ముందే అంతంత మాత్రంగా ఉన్న రహదారులు వర్షాలకు గుంతలమయంగా మారిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బనగానపల్లి నుంచి అవుకు వెళ్లే ప్రధాన రహదారి దారుణంగా మారింది. అవుకునకు 3 కిలోమీటర్ల దూరంలో రోడ్డు చూడటానికే భయంకరంగా ఉంది. గతంలో అధికారులు ఇక్కడ వంతెన నిర్మాణానికి రోడ్డును తవ్వి కంకర పోసి వదిలేశారు. దాంతో వర్షాలకు కుంటలను తలపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఎమ్మెల్యేకూ తప్పని ఫీట్లు

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని