Updated : 08 Aug 2022 09:09 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. జేఈఈ మెయిన్‌ ర్యాంకుల విడుదల

జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌ ర్యాంకులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఆదివారం ర్యాంకులను విడుదల చేయకుండా కేవలం ప్రొవిజనల్‌ ఫైనల్‌ కీని మాత్రమే ఎన్‌టీఏ విడుదల చేసింది. తాజాగా ర్యాంకులను కూడా అందుబాటులోకి తెచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆధార్‌ కార్డు మీది.. క్రెడిట్‌ వారిది..

ఆధార్‌ కార్డులతో బ్యాంకుల్లో క్రెడిట్‌ కార్డులు తీసుకుంటూ పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని మోసాలకు పాల్పడి దండుకుంటున్న ముఠాను కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలిసింది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఓ ముఠా కమిషనరేట్‌ పరిధిలోని కొంతమందికి ఈ వ్యవహారంలో సాయమందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చాలావరకు ప్రైవేటు బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఇటీవల వెలుగులోకి రావడంతో బ్యాంకు అధికారులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా టాస్క్‌ఫోర్స్‌ రంగంలోకి దిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* అక్రమమే ముచ్చట అడ్డే లేదిచ్చట!

3. బస్సులు రావు.. బాధలు తీరవు!

మన్యంలో గిరిజనులను రవాణా సదుపాయం దూరభారంగా మారింది. ఏళ్లు గడుస్తున్నా రోడ్లు వేస్తున్నా వీరికి కష్టాలు వీడటం లేదు. కొన్ని గ్రామాలకు తారురోడ్లున్నా ఆర్టీసీ బస్సులు నడపటం లేదు. మరికొన్ని గ్రామాలకు సరైన రహదారులు లేక రవాణా సాధనాలు అందుబాటులో ఉండటం లేదు. దీంతో చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో అనేక గ్రామాల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయంగా ఆటోలు, జీపులు వంటి ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కామన్వెల్త్‌లో ఇందూరు పంచ్‌

ఇందూరు బిడ్డలు బాక్సింగ్‌లో ఒకే రోజు రెండు పతకాలు సాధించి జిల్లా కీర్తిని అంతర్జాతీయంగా చాటారు. కామన్వెల్త్‌ క్రీడల్లో బాక్సింగ్‌లో ప్రాతినిధ్యం వహించిన వీరు అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ప్రపంచ మహిళా బాక్సింగ్‌ ఛాంపియన్‌గా ఉన్న నిఖత్‌ జరీన్‌ 50 కిలోల విభాగంలో ప్రత్యర్థులను మట్టికరిపించి పసిడి పట్టేసింది. నిజామాబాద్‌కే చెందిన మరో బాక్సర్‌ హుస్సాముద్దీన్‌ సెమీస్‌లో ఓడినప్పటికీ అద్భుత ప్రదర్శనతో కాంస్యం గెలుచుకున్నాడు. 2018 లోనూ కాంస్యం సాధించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కాల్వ గండం.. బడి మూసివేత

పాలకుర్తి మండలంలోని బామ్లానాయక్‌తండాలోని ప్రభుత్వ పాఠశాల మూతపడింది.. తండాకు పక్క నుంచి ఎస్సారెస్పీ డీ83 కాలువ వెళ్తోంది.. దీని వెంట రోడ్డు ద్వారా పిల్లలు బడికి వెళ్లాలి.. కాల్వపై నిర్మించిన వంతెన ప్రమాదకంగా ఉండటంతో ఆ గ్రామంలో పిల్లలను బడికి పంపడానికి ఆసక్తి చూపడం లేదు. ప్రైవేటు బడి, కన్నాల ప్రాథమిక పాఠశాలలకు పంపుతున్నారు. పిల్లలు లేని బడిని పంచాయతీ కార్యాలయంగా వినియోగించుకుంటున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

6. ఎన్ని దసరాలు వెళుతున్నా..!

ఇంద్రకీలాద్రిపై కొండరాళ్లు జారిపడకుండా ఉండేందుకు చేపట్టే పనుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2021 దసరా వేడుకలకు ముందే శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. కానీ.. 2022 దసరా వేడుకలు సైతం వచ్చే నెలలో ఆరంభం కానున్నా ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించినా ఇంతవరకు అధికారులు అమలు చేయలేకపోయారు. కేవలం నాలుగైదు నెలల్లో పూర్తిచేయాల్సిన పనులను కనీసం ఈ వర్షాకాలానికి ముందైనా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రూ.57.25 కోట్లు ఏమయ్యాయి..?

కవుతవరం - నిడుమోలు - ఐలూరు(కేఎన్‌ఐ) రహదారి విస్తరణ, అభివృద్ధి ప్రహసనంగా మారింది. పనులు ప్రారంభించి 16 నెలలు దాటినా ఎలాంటి పురోగతి లేకపోవటంతో ప్రయాణికులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. పామర్రు, గుడివాడ నియోజకవర్గాల పరిధిలోని మొవ్వ, పమిడిముక్కల, తోట్లవల్లూరు, పామర్రు, గుడ్లవల్లేరు మండలాలను కలుపుతూ వెళ్తున్న ఈ రహదారి దాదాపు 15.5 కిలో మీటర్ల వరకు విస్తరించి ఉంది. పరిసర మండలాలకు చెందిన వేలాది మంది ప్రజలకు కూడా ఇది ఎంతో ఉపయోగకరం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

విదేశీ విద్యకు ఎన్ని కష్టాలో!

8. రామతీర్థాన్ని గాలికొదిలేశారు!

లక్షలాది మంది ప్రజల దాహార్తిని తీరుస్తూ, ఒంగోలు వరప్రసాదినిగా పేరొందిన రామతీర్థం జలాశయం... అధికారులు, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా అనాథలా మిగిలింది. కొద్దిపాటి విద్యుత్తు బిల్లులు చెల్లించక... ఏళ్లుగా సరఫరా నిలిచిపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత పెద్ద ప్రాజెక్టు వద్ద కాపలా సిబ్బంది ఒక్కరూ లేకపోవడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వెండితెరపై చిన్నారి శ్రీదేవి వెలుగులు

చిన్న వయస్సులోనే వెండి తెరపై ఆరంగేట్రం చేసింది బేతంచెర్ల పట్టణానికి చెందిన శ్రీదేవి. మరోవైపు బుల్లి తెరపై నటిస్తూ ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇప్పటి వరకు 10 చిత్రాలు, 15 టీవీ సీరియళ్లలో తన నటనతో పలువురిని మెప్పించింది. బుడిబుడి నడకలు, తడబడుతున్న మాటల వయస్సులోనే తన ప్రతిభతో మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఇటీవల ఈటీవీలో ప్రారంభమైన యమలీల, ఆ తర్వాత సీరియల్లోనూ నటిస్తూ ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తోన్న చిన్నారి బేతంచెర్ల పట్టణానికి చెందిన శ్రీహరి గౌడ్, లక్ష్మి దంపతుల కుమార్తె. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆదివాసీ వేడుకలకు సీఎం రానట్లే!

ఈ నెల తొమ్మిదో తేదీన జరగాల్సిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాడేరు పర్యటన ఎడతెరిపి లేని వర్షం కారణంగా రద్దయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయాన్ని యంత్రాంగం అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. ప్రపంచ ఆదివాసీ వేడుకలను జిల్లా కేంద్రం పాడేరులో నిర్వహిస్తున్న నేపథ్యంలో సీఎంను ఆహ్వానించారు. ఆయన సానుకూలంగా స్పందించడంతో ఆ దిశగా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఈ యుద్ధంలో.. ఆమెదే గెలుపు!

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని