Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 Aug 2022 11:02 IST

1. ఇల్లు వస్తుందా? రాదా?

గ్రేటర్‌లో రెండు పడక గదుల ఇళ్ల దరఖాస్తుల పరిశీలన అయోమయంగా మారింది. ఔత్సాహికులు 2016లో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఆరేళ్ల తర్వాత దరఖాస్తుదారులకు ఫోన్‌ చేస్తున్నారు. కొందరు సిబ్బంది ఆరు రకాల వివరాలు అడుగుతుండగా, మరికొందరు మీరెక్కడున్నారనే ప్రశ్నతో సరిపెడుతున్నారు. చిరునామా తీసుకుని ఫోన్‌ పెట్టేస్తున్నారు. దాంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన మొదలైంది. తమకు ఇల్లు వచ్చినట్టా, రానట్టా అని తెలుసుకునేందుకు జీహెచ్‌ఎంసీ ఆఫీసులకు పయనమవుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఉచిత బియ్యంలో కిరికిరి!

ఉచిత బియ్యం సరఫరా తీరు కార్డుదారులను అయోమయానికి గురిచేస్తోంది. కూపన్లు అందకపోవడమే దీనికి కారణం. ‘అందరికీ రేషన్‌ అందుతుంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేద’ని అధికారులు చెబుతున్నారు. ‘కూపన్లు వస్తాయంటూ.. అవి రాని వారి పేర్లను వాలంటీర్లు నమోదు చేసుకువెళ్తున్నారు. బియ్యం పంపిణీ ప్రారంభించి వారం దాటినా.. నేటికీ కూపన్లు అందకపోవడంతో కార్డుదారులు గందరగోళానికి గురవుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కార్డు కష్టాలు

3. ఇదీ తీరు... సురక్షితమేనా నీరు?

జలం.. అందరికీ ప్రాణాధారం. అలాంటి మంచినీరే కలుషితమైతే ప్రజలు డయేరియా, కామెర్లు వంటి రోగాల బారినపడే ప్రమాదం ఉంది. ఈ విషయంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ నిర్లక్ష్యం వహిస్తోంది. నగరవాసులు తాగునీరు సరఫరా చేసే పైపులైన్లు మురుగు కాలువల్లో ఉంటున్నాం.. వాల్వులకు లీకులు ఏర్పడుతున్నా మొక్కుబడి చర్యలతో సరిపెడుతున్నారు. క్లోరినేషన్‌ సైతం అరకొరగా చేపడుతుండటంతో తాగునీరే సురక్షితమేనా అనే ప్రశ్న ఉదయిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మళ్లీ ముంపు ముప్పు

గోదావరి  మరోసారి ఉగ్రరూపం దాల్చుతుండడంతో తీరప్రాంతంలోని జనం బెంబేలెత్తిపోతున్నారు. జులైలో వచ్చిన వరదలతో పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, దుమ్ముగూడెం, చర్ల, భద్రాచలం మండలాల్లో 77 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 16 వేల కుటుంబాలకు పైగా ఇందులో తలదాచుకున్నాయి. రూ.130 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా.  కేంద్ర జల సంఘం నివేదికలతో పాటు రెవెన్యూ శాఖ చెబుతున్న వివరాలను పరిశీలిస్తే ఆగస్టులోనే ఎక్కువ సార్లు గరిష్ఠ వరదలు నమోదయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

జడివానతో జనం దడ

5. గంటకు 130 కి.మీ. వేగానికి అంతా సిద్ధం!

రైళ్లు మరింత వేగంగా నడిపేందుకు రంగం సిద్ధమైంది. ముంబయి- చెన్నై రైలు మార్గంలో గుంతకల్లు డివిజన్‌ పరిధిలో ఉన్న వాడి- గుంతకల్లు, గుంతకల్లు- రేణిగుంట మధ్య మొదట రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌, చెన్నై మెయిల్‌ రైళ్లను 130 కి.మీ.ల వేగంతో నడపాలని రైల్వే ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. రైళ్లను వేగంగా నడపడానికి డివిజన్‌ అధికారులు రూ.90 కోట్లు వ్యయం చేసి సంవత్సరం కిందట రెండు సెక్షన్లలో రైల్వేలైన్లను బలోపేతం చేయటం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. శునకమే గంగిరెద్దుగా..

సాధారణంగా గంగిరెద్దు వాళ్లు ఇళ్ల ముందుకు వచ్చి సొన్నాయి వాయించి గంగిరెద్దును ఆడించి భిక్షాటన చేస్తూ బతుకుదెరువు సాగిస్తుంటారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రం వినాయక్‌నగర్‌లో సన్నాయి చప్పుడుకు బయటకు వచ్చిన ఇల్లాలు గంగిరెద్దు స్థానంలో కుక్కను చూసి ఆశ్చర్యపోయారు. అయినా ఆ ఇంటి సభ్యులు తోచిన సాయమందించారు. ఇదేంటని ఆ వ్యక్తిని ప్రశ్నించగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నిలిచిన రాకపోకలు

7. ఎమ్మెల్యేకు సవాల్‌ విసురుతూ గోడపత్రికలు

 వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు సవాల్‌ విసురుతూ వరంగల్‌ అండర్‌బ్రిడ్జి, రైల్వే, కాశీబుగ్గ ప్రాంతాల్లో గోడపత్రికలు వెలిశాయి. ఇటీవల  నరేందర్‌ తన జన్మదినం సందర్భంగా ఎర్రబెల్లి ప్రదీప్‌రావుపై పరోక్షంగా పరుష పదజాలంతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10 లోగా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని, ఓరుగల్లు బిడ్డవైతే సవాల్‌ స్వీకరించాలని ప్రదీప్‌రావు వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ప్రాణాలకు తెగించి పల్లెకు

ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు అడ్డాకుల మండలంలోని పెద్దవాగును దాటేందుకు వర్నె వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన తెగిపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మండల కేంద్రమైన అడ్డాకులకు రావాలంటే కొత్తకోట మీదుగా 20 కిలోమీటర్లకు పైగా అదనంగా తిరిగి రావాల్సి వస్తోంది. మంగళవారం మొహర్రం కోసం హైదరాబాదులో వలస కూలీలుగా ఉపాధి పొందుతున్న మహేష్‌, శేఖర్‌లు కుటుంబ సభ్యులతో గ్రామానికి వచ్చారు. పెద్దవాగుపై తాత్కలిక వంతెన తెగిపోవడంతో.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నిధులు వస్తేనే... రహదారుల బాగు

9. పిన్‌ మరచిపోతే అన్‌లాక్‌ ఎలా?

ఫోన్‌కు లాక్‌ స్క్రీన్‌ సెట్‌ చేసుకోవటం మంచి పద్ధతి. దీంతో ఫోన్‌ ఎవరి చేతికైనా చిక్కితే తెరవటానికి వీలుండదు. మన వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంటుంది. అయితే ఎప్పుడైనా పిన్‌ నంబర్‌, ప్యాటర్న్‌ మరచిపోతే? ఫేస్‌ ఐడీ, టచ్‌ ఐడీ సరిగా పనిచేయకపోతే? ఫోన్‌ను అన్‌లాక్‌ చేయటం సాధ్యం కాదు. అప్పుడెలా? ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ‘ఫైండ్‌ మై డివైస్‌’ ద్వారా దీన్ని పరిష్కరించుకోవచ్చు. ఇది ఫోన్‌ను ట్రాక్‌ చేస్తుంది. రిమోట్‌గా లాక్‌ లేదా అన్‌లాక్‌ చేయటానికి ఉపయోగపడుతుంది కూడా. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. బ్రిటిష్‌ గుండెల్లో తురుమ్‌ ఖాన్‌

ఎవరైనా గొడవకు దిగినా.. పెద్దల్ని ఎదిరించినా ‘‘నువ్వేమైనా తురుమ్‌ ఖాన్‌ అనుకుంటున్నావా’’ అంటూ గద్దిస్తారు. తెగువ ప్రదర్శిస్తున్నారనే అర్థంతో దీన్ని వాడతారు. కాలక్రమంలో తురుమ్‌ఖాన్‌గా పిలుచుకుంటున్న ఆ వీరుడి అసలు పేరు తుర్రేబాజ్‌ ఖాన్‌..!  ఆయన హైదరాబాదీ అని.. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడుతూ వీర మరణం పొందారని తక్కువ మందికి మాత్రమే తెలుసు. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో 1857 సిపాయిల తిరుగుబాటు ఓ కీలకఘట్టం. ఆ  తిరుగుబాటుకు.. నిజాం పాలిత హైదరాబాద్‌కు ముడివేసే ఓ పరాక్రమ వ్యక్తిత్వమే తుర్రేబాజ్‌ ఖాన్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నేను బానిసగా పనిచేయను

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని