Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 13 Aug 2022 09:15 IST

1. కరెంటు.. నెలకో రేటు?

విద్యుత్‌ వినియోగానికి యూనిట్‌వారీగా విధించే ఛార్జీలు నెల నెలా మారే అవకాశముందా? కొత్త నియమావళిపై ఉత్తర్వులు జారీ అయితే కొద్దిరోజుల్లోనే ఈ విధానం అమలులోకి రానుంది. ఖర్చులను బట్టి ప్రజల నుంచి ఛార్జీలను వసూలు చేసుకునే స్వేచ్ఛను పూర్తిగా ‘విద్యుత్‌ పంపిణీ సంస్థ’(డిస్కం)లకే కట్టబెడుతూ కేంద్ర విద్యుత్‌ చట్ట నియమావళికి సవరణలను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కరెంటు కొనుగోలు, ఇతర ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త విధానంతో నెలనెలా ఛార్జీలు పెరిగే అవకాశమే ఎక్కువగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పంద్రాగస్టుకు పాత దుస్తులేనా!

కరోనా విపత్కర పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే విద్యాసంస్థలు పూర్తి స్థాయిలో కోలుకుంటున్నాయి. దాదాపు రెండేళ్ల పాటు ప్రత్యక్ష తరగతులు లేకపోవడంతో విద్యార్థులకు ఏకరూప దుస్తుల(యూనిఫాంల) అవసరం రాలేదు. ఈ ఏడాది జూన్‌ 13న పాఠశాలలు ప్రారంభం కాగా దాదాపు రెండు నెలలవుతున్నా ఇప్పటికీ విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులు ఇప్పటికీ అందలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* గాంధీజీకి లోలాకులు ఇచ్చి..కాళ్లకు నమస్కరించా!

3. డబ్బుల కోసమే కిడ్నాప్‌..!

జిల్లా కేంద్రంలో సంచలనం రేపిన వైద్యుడు గూడేన సోమేశ్వరరావు కిడ్నాప్‌ కేసులో చిక్కుముడులు వీడుతున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న పరమేశ్‌ తెలిపిన వివరాల ఆధారంగా మరో ఇద్దరు అనుమానితులను శ్రీకాకుళం నగరంలోనే పట్టుకున్నట్లు సమాచారం. వారిని ప్రస్తుతం పోలీసుస్టేషన్‌లో ఉంచి విచారిస్తున్నట్లు తెలిసింది. నగరానికి చెందిన ఇద్దరు, విశాఖపట్నానికి చెందిన ఇద్దరు యువకులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. ముగ్గురు తెలిపిన వివరాలతో విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నిత్యం నరకం.. ఒళ్లు హూనం..!

ఈ చిత్రాల్లో రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో చూడండి..  కంకిపాడు మండలం కుందేరు నుంచి ఇందుపల్లి వరకు సుమారు 12 కి.మీలు ఆర్‌ అండ్‌ బి రహదారిలో ప్రయాణమంటే  జనాలు వణికిపోతున్నారు. చాలా మంది వాహనచోదకులు మృత్యువాత పడిన సంఘటనలు గతంలో ఉన్నాయి. ప్రభుత్వం జులై 15వ తేదీలోగా రాష్ట్రంలోని రోడ్లపై గుంతలు లేకుండా చేస్తామని ప్రకటించింది. కానీ ఒక్క గుంత కూడా పూడ్చలేదు. కుందేరు, మానికొండ, తరిగొప్పల, మారేడుపాక, ఇందుపల్లి ఇలా 5 గ్రామాలు ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మడుగుల్లో అడుగులెలా జగనన్నా!

5. అవును..వాళ్లిద్దరు విడిపోతున్నారు!!

అనుమానం పెనుభూతమవుతోంది.. మనస్పర్థలు మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి.. చిన్నపాటి ఘర్షణలు ప్రాణాలు తీస్తున్నాయి.. పెళ్లయిన నెలల్లోనే భార్యాభర్తలు దూరమవుతున్న ఘటనలు ఉమ్మడి జిల్లాలో ఇటీవల ఎక్కువవుతున్నాయి. మూడేళ్ల బంధానికి కొన్నిరోజుల్లోనే స్వస్తి పలుకుతున్న యువతీయువకులు తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అన్యోన్య బంధాలను కొనసాగించలేక ఓడిపోతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. చేతులెత్తి మొక్కినా కనికరించ లేదు

 ‘తన భర్త మృతి చెందగా సకాలంలో మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వకపోవడంతో బీమా వర్తించదని అంటున్నారు. నాకు ఏ ఆధారం లేదు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని చేతులెత్తి మొక్కి అడిగినా సచివాలయ ఉద్యోగులు కనికరించలేదు’ అని గుమ్ములూరు గ్రామానికి చెందిన బొమ్మి కరుణ వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్‌ నరసింహరాజు వద్ద తన గోడు చెప్పుకొని కన్నీటి పర్యంతమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మిస్‌ ఇండియా యూఎస్‌ఏ రన్‌రప్‌గా సంజన

7.తెలదొరలను తరిమిన తెర్నేకల్‌

1857 సిపాయిల తిరుగుబాటుకు ముందే తెల్లదొరలను తెర్నేకల్‌ వాసులు తరిమికొట్టారు. 130 ఏళ్ల కిందట 1801లో బ్రిటిష్‌ వారిని ఎదురించిన కారణంగా గ్రామానికి చెందిన ముత్తుకూరు గౌడప్ప, కరణం శంకరయ్య, గ్రామ రెడ్డి అంకిరెడ్డిలను ఊరి వాకిలికి ఉరితీశారు.తెర్నేకల్‌ వాసులు బ్రిటిష్‌ సేనలను తరిమికొట్టిన ఘటన బ్రిటిష్‌ వైస్రాయి విలియం థాక్రేకు కోపం తెప్పించింది. వెంటనే ఆదోని నుంచి 1,000 మంది సైనికులను గ్రామానికి పంపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ముక్కంటి మునక

కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. నీరు కరకట్టకు చేరుతోంది. గత కృష్ణా పుష్కరాల సందర్భంగా కాసరనేనివారిపాలెం పరిధిలో నది ఒడ్డున నిర్మించిన శివాలయం గత మూడేళ్లలో తొమ్మిది పర్యాయాలు ముంపునకు గురైందని గ్రామస్థులు చెబుతున్నారు. గత 50 ఏళ్లలో వరుసగా వరదలు రావడం ఇదే మొదటిసారంటున్నారు. ప్రస్తుతానికి పంటలకు నష్టం లేదని వ్యవసాయశాఖాధికారులు చెబుతున్నారు. ప్రవాహంలో టన్నుల కొద్దీ వ్యర్థాలు అంచుకు చేరుతున్నాయి. వీటిలో నావలు కూడా కదల్లేని పరిస్థితి నెలకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

భూములు అమ్మేస్తాం!

9.  పర్యాటక హోటళ్లు కిటకిట!

వరుస సెలవులతో నగరానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. దీంతో హోటళ్లలో గదులు ఖాళీ లేవు. దీంతో పలువురు సర్వీసు అపార్టుమెంట్లను అద్దెకు తీసుకుంటున్నారు. అరకు, అనంతగిరి, టైడా, లంబసింగి పర్యాటక ప్రాంతాలకు వచ్చే వారి సంఖ్య ఇటీవల అనూహ్యంగా పెరిగింది. పర్యాటకులు ఎక్కువగా అనంతగిరి హరితా హిల్‌ రిసార్టు, టైడాలోని జంగిల్‌ బెల్స్‌, అరకులోని వ్యాలీ రిసార్టు, లంబసింగిలో బసకు ఆరా తీస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రుణగ్రహీతలను వేధించొద్దు

రుణ వసూలులో రికవరీ ఏజెంట్లు చేస్తున్న దారుణాలను అరికట్టేందుకు ఆర్‌బీఐ మరిన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. శుక్రవారం విడుదల చేసిన తాజా నోటిఫికేషన్‌లో ‘షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ)’ ఈ నిబంధనలను తమ రుణ రికవరీ ఏజెంట్లు కచ్చితంగా పాటించేలా చూడాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల లోపే రుణ రికవరీ ఏజెంట్లు, రుణగ్రహీతలకు ఫోన్‌ చేయాలని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పాటలు వింటూ.. హీటర్‌ పట్టుకుని..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని