Updated : 16 Aug 2022 09:05 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ఇదండీ రోడ్డు పనుల తీరు!

తల్లాడ-దేవరపల్లి 516డి జాతీయ రహదారి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు ప్రశ్నార్థకంగా మారాయి. పనులు జరుగుతుండగానే ఎక్కడికక్కడ అంచులు దిగబడటంతోపాటు ప్రధాన మార్గంపై గోతులు పడుతున్నాయి.  ఇప్పటికే  ఇటుగా ప్రయాణం నరక ప్రాయంగా మారింది. కొంత బాగుంటే మరికొంత దారుణంగా ఉంటోంది.  మొత్తం 12 మీటర్ల వెడల్పున ఉంటే అందులో 10 మీటర్ల మేర తారు రోడ్డు. ఇరువైపులా మీటరు చొప్పున అంచులు నిర్మించాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వరదొచ్చింది.. ఊడ్చేసింది

2. జగనన్న గోరుముద్దకు ధరాఘాతం

పిల్లలకు మేనమామలా ఉంటానని పదేపదే చెబుతున్న సీఎం జగన్‌.. వారు తినే మధ్యాహ్న భోజనం ఛార్జీలను మాత్రం పెంచడం లేదు. మెనూ మార్పు చేసినట్లు గొప్పగా చెబుతున్నా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఛార్జీల పెంపునకు మాత్రం చొరవ చూపడం లేదు. జగనన్న గోరుముద్దగా పథకం పేరు మార్చిన ప్రభుత్వం.. చుక్కలను తాకుతున్న ధరలకు అనుణంగా భోజనం ఛార్జీలు పెంచడంపై దృష్టి సారించడం లేదు. భోజనం నాణ్యంగా ఉండాలి.. తనిఖీలు నిర్వహించాలని ఆదేశిస్తున్న అధికారులు ఛార్జీలు పెంచకపోతే నాణ్యత ఎలా వస్తుందో ఆలోచించడం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. యాప్‌ హాజరుపై అంతర్గత పోరు

ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల యాప్‌ ఆధారిత హాజరుపై ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల మధ్య అంతర్గత పోరు కొనసాగుతోంది. యాప్‌ ఆధారిత హాజరును ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో), ఇతర ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాల సూచనలతో చాలా మంది యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోలేదు. మంగళవారం నుంచి యాప్‌లో హాజరు వేయాల్సిందేనని, దీన్నే ప్రామాణికంగా తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. ఇది పాఠశాల విద్యలో ఉపాధ్యాయులు, అధికారుల మధ్య అంతర్గత పోరుకు దారి తీసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* కొత్తవి వస్తాయని.. పాతవి పారేసుకుంటారా!

4. కేంద్రంలో 4300 ఎస్‌ఐ కొలువులు

కేంద్ర సాయుధ బలగాలతోపాటు దిల్లీ పోలీస్‌ విభాగంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ) పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ప్రకటన విడుదలచేసింది. పాతికేళ్లలోపు వయసున్న గ్రాడ్యుయేట్లు వీటికి పోటీ పడొచ్చు. రాతపరీక్ష, పీఈటీ, పర్సనాలిటీ టెస్టు, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా నియామకాలుంటాయి. విజయవంతంగా శిక్షణ ముగించుకుని, విధుల్లో చేరినవారు మొదటి నెల నుంచే సుమారు రూ.60 వేల వేతనం పొందవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భవిష్యత్‌ ప్రమాదాన్ని కళ్లకు కట్టిన ‘నింజా’

రహస్య ఆపరేషన్‌తో అల్‌ఖైదా అధినేత అయమన్‌ అల్‌ జవహరీని అంతమొందించడం ద్వారా అమెరికా.. ఇటీవల ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇది అఫ్గానిస్థాన్‌లో తాలిబన్‌ ప్రభుత్వానికి, అగ్రరాజ్యానికి మధ్య అపనమ్మకాన్ని మరింత పెంచింది. అయితే ప్రమాదకరమైన మరో అంశాన్నీ వెలుగులోకి తెచ్చింది. అంతర్జాతీయ ఆయుధాల అభివృద్ధిలో చోటుచేసుకుంటున్న వేగాన్ని ఇది కళ్లకు కట్టింది. అల్‌ జవహరీని హతమార్చడానికి ఉపయోగించిన హెల్‌ఫైర్‌ ఆర్‌9ఎక్స్‌ ‘నింజా’ క్షిపణి సామర్థ్యాన్ని విశ్లేషిస్తున్న నిపుణులు ఈ అంశంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఉపాధి ఉత్తమాటేనా..!

రాష్ట్రంలో ఎక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసినా స్థానికులకే 75శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హామీ స్థానిక సెజ్‌లో అమలుకు నోచుకోవడం లేదు. పరిశ్రమలకు భూములిచ్చిన నిర్వాసితులతో పాటు స్థానికులకు ఉపాధి ఎండమావే అయింది. అచ్యుతాపురం సెజ్‌లో 90 ఎకరాల స్థలంలో కొత్తగా నిర్మాణ పనులు పూర్తిచేసుకున్న ఏటీజీ టైర్ల కంపెనీలో కూడా ఈ హామీ అమలు కాలేదు. ఈ కంపెనీ ద్వారా రెండు వేలమందికి ప్రత్యేకంగా ఉపాధి కల్పిస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మమ్మల్ని వేధించకన్నా.. నీ చెల్లిగా వేడుకుంటున్నా!

7. 18 ఏళ్లలో 70 దేశాలు చుట్టింది

శిబు వయసు 33 ఏళ్లు. ఇప్పటికే ఎన్ని దేశాలు తిరిగొచ్చిందో చూశారుగా. ‘అబ్బో.. బాగా డబ్బున్న కుటుంబం అయ్యుంటుంది’ అంటారా? అస్సలు కాదండీ! ‘మరెలా...’ అంటే.. ఉద్యోగాలు చేస్తూ, చదువుకుంటూ. క్లాస్‌రూమ్‌లో తపస్సు చేయడంకన్నా, బయట ప్రపంచం చూడ్డం మిన్ననుకుంది. అందుకోసం కొత్తదారులు వెతికింది. అదెలా అంటే.. 15 ఏళ్ల వయసు నుంచి శిబు బెనడిక్టిస్‌ ఈ పర్యటనలు మొదలుపెట్టింది. అప్పటికి స్కూలు చదువు మాత్రమే పూర్తైంది. శిబు అమ్మానాన్నల వృత్తిరీత్యా అమెరికా, కోస్టారికాల్లో పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నెత్తుటి మరక

కమ్యూనిస్టు కోటలో మళ్లీ నెత్తురు పారింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ రాజకీయ హత్య గ్రామంలో కలకలం రేపింది. తెరాస నాయకుడు తమ్మినేని కృష్ణయ్య(62) సోమవారం దారుణహత్యకు గురవ్వడంతో ఖమ్మం గ్రామీణం మండలం తెల్దారుపల్లి ఉలిక్కిపడింది. ఊరూవాడా స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో మునిగి తేలుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కృష్ణయ్య తన సతీమణి మంగతాయితో కలిసి సోమవారం గ్రామంలో పలుచోట్ల పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న కొద్దిగంటల్లోనే అతి కిరాతకంగా హత్యకు గురయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మహిళపై క్రూర అత్యాచారం

9. రాములోరి భూమిలో భారీ ఆక్రమణకు ప్రయత్నం

 భద్రాచలం రాముడి భూముల్లో ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. ఇటీవల ఇక్కడి భూమిలో ఓ వ్యక్తి ఏకంగా పక్కా భవనం నిర్మించుకున్న విషయం వెలుగుచూసింది. రెండు రోజుల కిందట కొందరు గిరిజనులు పాకలు నిర్మించుకొని ఆ స్థలాన్ని తమకు కేటాయించాలని కోరారు. తాజాగా సోమవారం తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతాల వాసులు వందల మంది భూ ఆక్రమణకు ప్రయత్నించడం సంచలనమైంది. వివరాలు.. భద్రాచలం రామాలయానికి 900 ఎకరాల భూమి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. చెన్నైతో ఇన్నింగ్స్‌ ముగిసినట్లే!

చెన్నై సూపర్‌ కింగ్స్‌తో స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా బంధానికి తెరపడినట్లే కనిపిస్తోంది. చాలా రోజులుగా చెన్నై యాజమాన్యంతో అతడు ఎలాంటి సంబంధాలు కొనసాగించకపోవడమే ఇందుకు కారణం. గత ఐపీఎల్‌ సీజన్లో చెన్నై కెప్టెన్‌గా ఎంపికైన జడ్డూ కొన్ని మ్యాచ్‌ల తర్వాత సారథ్యాన్ని కోల్పోయాడు. అతడి ఆటపై ప్రభావం పడుతుందనే కారణంతో చెన్నై యాజమాన్యం జడేజాను కెప్టెన్సీ నుంచి తప్పించి మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనికి పగ్గాలు అందించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కుదురుగా ఉండలేకపోతున్నా!

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని