Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 17 Aug 2022 11:05 IST

1. కృష్ణ పదార్థం ఎక్కడ?

ఎవరూ, ఎప్పుడూ దాన్ని చూడలేదు. కేవలం ఊహలకే పరిమితం. అయినా విశ్వంలోని పదార్థంలో 85 శాతం అదేనన్నది శాస్త్రవేత్తల అంచనా! ఇంతకీ అదేంటో తెలుసా? కృష్ణ పదార్థం (డార్క్‌ మ్యాటర్‌)! ఇదేంటన్నది కచ్చితంగా నిర్వచించలేకపోవచ్చు, వర్ణించలేకపోవచ్చు. కానీ శాస్త్రవేత్తలు దీన్ని శోధించటం మాత్రం ఆపలేదు. అతిపెద్ద, అధునాతన జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ సైతం దీన్ని గుర్తించే పనిలో పడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* సాగర జలాల్లో మహాన్వేషణ!

2. ప్రేమను వద్దన్నాడని.. తండ్రిని జైలుకు పంపిన తనయ

తన ప్రేమను కాదన్నాడని ఓ బాలిక తండ్రిపైనే అత్యాచార ఆరోపణలు చేసింది. ఈ కేసులో అయిదున్నర సంవత్సరాలపాటు జైలు జీవితం అనుభవించాక నిర్దోషిగా విడుదలయ్యాడు ఆ తండ్రి. ఈ ఘటన మహారాష్ట్ర అంధేరీలోని డీఎన్‌ నగర్‌ పోలీస్‌స్టేషను పరిధిలో జరిగింది. అసలేమైందంటే.. కుమార్తె ప్రియుడి వెంట తిరగడం ఆ తండ్రికి నచ్చలేదు. హెచ్చరించాడు.. ఆమె బేఖాతరు చేసింది. కోపంతో తండ్రి  కొట్టాడు. దీంతో కక్ష పెంచుకున్న బాలిక తనపై తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని 2017లో పాఠశాల టీచరుకు తప్పుడు సమాచారం ఇచ్చింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. బాబ్బాబు.. ఎమ్మెల్యే ఎదుట సమస్యలు చెప్పకండి!

‘బాబ్బాబు.. ఎమ్మెల్యే గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొనేందుకు గ్రామాలకు వస్తున్నారు.. ఏవైనా సమస్యలు ఉంటే నాకు చెప్పండి.. నేను పరిష్కరిస్తా. ఎమ్మెల్యే ముందు చెప్పొద్దు’ అంటూ చెన్నేకొత్తపల్లి మండలంలో అధికార పార్టీ నాయకుడు ఒకరు గడప గడపకు వెళ్లి ప్రజలను బతిమాలుతున్న విషయం వెలుగు చూసింది. మండలంలోని ఓ గ్రామంలో త్వరలోనే ఎమ్మెల్యే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్నట్లు సమాచారం.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఊరి సమస్యలు తీరిస్తే గానీ.. మరుభూమికి దారివ్వం

4. కాలేజీలో చేరకుంటే ఫీజు వెనక్కి!

ఒక కాలేజీలో అడ్మిషన్‌ తీసుకుని, ఫీజు చెల్లించి... అనుకోని కారణాలతో వేరే చోట చేరాల్సి వచ్చినప్పుడు సాధారణంగా విద్యార్థులు ముందు కళాశాలలో చెల్లించిన ఫీజులను కోల్పోవాల్సి వస్తుంది. అయితే 2022-23 విద్యాసంవత్సరంలో చేరే విద్యార్థులు ఇలా నష్టపోకుండా యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌) ఓ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌ 31వ తేదీ వరకూ విద్యార్థులు తమ అడ్మిషన్‌ను రద్దు చేసుకున్నా, వేరే క్యాంపస్‌కు మారాల్సి వచ్చినా ఎటువంటి రుసుములూ వసూలు చేయకుండా వారు చెల్లించిన మొత్తం ఫీజును కళాశాలలు తిరిగి వెనక్కి ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వచ్చే వారంలో జగన్‌ కుంభకోణం బయటపెడతా!: నారా లోకేశ్‌

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి సంబంధించిన ఓ పెద్ద కుంభకోణం వచ్చే వారంలో బయటపెడతానని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రకటించారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల కంటే తరలిపోయినవే ఎక్కువ అని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. ‘‘జగన్‌మోహన్‌ రెడ్డివి పదో తరగతి పాస్‌, డిగ్రీ ఫెయిల్‌ తెలివి తేటలు. ఆయనకు అవగాహన తక్కువ. ఇంటికెళ్లే పరిస్థితి వచ్చేసింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* అయ్యవారు.. హాజరుతో బేజారు

6. పోలీసుల బాధ్యత.. ఇంటికి భద్రత

లాక్డ్‌హౌస్‌ మానిటరింగ్‌ సిస్టం (ఎల్‌హెచ్‌ఎంఎస్‌) యాప్‌ను చరవాణిలో ఇన్‌స్టాల్‌ చేసుకుని పోలీసులకు సమాచారమిస్తే మీరు ఎక్కడున్నా సరే.. మీ ఇంటి భద్రత అరచేతిలో ఉంటుంది. ప్రజలు తమ విలువైన సొత్తును కాపాడుకునేందుకు పోలీసు శాఖ అమలు చేస్తున్న ఈ యాప్‌ను వినియోగించుకుంటే భరోసా లభిస్తుంది. ఈ యాప్‌ ద్వారా ప్రజల ఆస్తులు, సొత్తుకు రక్షణ కల్పించడంతో పాటు దొంగల ఆగడాలను అరికట్టే అవకాశం ఉంటుంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మా ఊరొస్తారా.. కాచుకోండి!

ఈ ఏడాది 7 నెలల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా సైబర్‌నేరాలపై సుమారు 9,300 కేసులు నమోదైతే 5,000 వరకూ గ్రేటర్‌ పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్స్‌లోనివే కావటం పరిస్థితికి అద్దంపడుతోంది. సైబర్‌ నేరస్థులు చెలరేగుతున్నారు. పట్టుకొనేందుకు వెళ్లిన పోలీసులపై దాడులకూ తెగబడుతున్నారు. తాజాగా బిహార్‌ నవాడా జిల్లాలో సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులపై తుపాకులతో కాల్పులు జరపటం కలకలం రేకెత్తించింది. సకాలంగా నవాడా జిల్లా పోలీసులు రావటంతో పెను ప్రమాదం తప్పినట్టు సమాచారం.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఆటోలో విద్యార్థిని అంతిమ ప్రయాణం

8. చిట్టీల పేరిట ముంచారని.. నదిలో ముంచబోయారు!

చిట్టీలు కట్టించుకొని తిరిగి చెల్లించకుండా ఎగవేతకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధితులు చిట్టీల నిర్వాహకుడి కుమారుడిని కృష్ణా నదిలో ముంచేందుకు ప్రయత్నించిన ఉదంతమిది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరుకు చెందిన చిట్టీల నిర్వాహకుడు పుట్టా వెంకటేశ్వరరావు కొన్నాళ్లుగా అదృశ్యమై.. సోమవారం కుటుంబంతో సహా ఊళ్లోకి వచ్చారు. ఈ విషయం తెలిసిన బాధితుల్లో పలువురు ఆయన ఇంటిని చుట్టుముట్టారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. తెలుసుకోండి...ఎంచుకోండి

ఈఏపీసెట్‌ పూర్తై విద్యార్థులకు ర్యాంకులు కేటాయించారు. విద్యార్థులు ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిమిత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పరీక్ష ఫలితాలు రావడంతో ఆప్షన్ల ఎంపికతో పాటు కౌన్సెలింగ్‌కు సమయం ఆసన్నమైంది. ఏఐసీటీఈ ఆదేశాలతో వచ్చే నెల నుంచి కళాశాలలు ప్రారంభం కావాలి. ఈ నేపథ్యంలో ఏ బ్రాంచి తీసుకోవాలి.. ఏ కళాశాలను ఎంపిక చేసుకోవాలన్న ప్రశ్న అటు విద్యార్థుల్లో, ఇటు తల్లిదండ్రుల్లో నెలకొంది. ఈ సమయం వారికి చాలా కీలకమైనది. ఎలాంటి విద్యాసంస్థ, బ్రాంచి ఎంపిక చేసుకోవాలనే అంశాలను దృష్టిలో ఉంచుకోవాలన్న అంశంపై ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న కథనమిది..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఈ పిల్లల పౌడర్‌ను ఉంచాలా? వద్దా?

10. హైదరాబాద్‌లో 8 శాతం పెరిగిన ఇళ్ల ధరలు

 దేశవ్యాప్తంగా ప్రధాన ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు సగటున 5 శాతం పెరిగాయి. దిల్లీ రాజధాని ప్రాంతంలో గరిష్ఠంగా 10 శాతం ధరలు పెరగ్గా...హైదరాబాద్‌లో 8 శాతం వార్షిక వృద్ధి ఇళ్ల ధరల్లో కన్పించింది.  క్రెడాయ్‌, రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ కొలియర్స్‌ ఇండియా, డాటా విశ్లేషణ సంస్థ లీసెస్‌ ఫోరస్‌  ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికానికి సంబంధించి దేశంలోని 8 నగరాలకు సంబంధించి హౌస్‌ ప్రైస్‌ ట్రాకర్‌ రిపోర్ట్‌ 2022ను తాజాగా విడుదల చేశాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని