Updated : 23 Sep 2022 09:05 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. నాటి మాటలు... నీటిపై రాతలు!

ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి పలుమార్లు జిల్లా పర్యటనకు వచ్చారు.. పాదయాత్రతో పాటు ఎన్నికల ప్రచారం సందర్భంగా తాను ముఖ్యమంత్రి అయితే జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని హామీలు ఇచ్చారు.. ఆ మాటలు నమ్మి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాలకు 13 చోట్ల వైకాపాను గెలిపించారు.. సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టి సుమారు 39 నెలలవుతున్నా అత్యధిక హామీలు నెరవేర్చలేదనే చర్చ ప్రజల్లో జరుగుతోంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అధిక వడ్డీ... కాస్త జాగ్రత్త...

ఒకప్పడు స్థిరంగా ఆదాయం రావాలంటే బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపైనే ఎక్కువగా ఆధారపడేవారు. ఆధునిక కాలంలో ఎన్నో ప్రత్యామ్నాయ పెట్టుబడి పథకాలు వచ్చాయి. ముఖ్యంగా ఫిన్‌టెక్‌ సంస్థల రాకతో.. పెట్టుబడుల తీరు మారిపోయింది. ఆకర్షణీయంగా కొత్త పథకాలను ఆవిష్కరిస్తూ, అధిక వడ్డీనిస్తూ ఇవి అందరినీ ఆకర్షించడం ప్రారంభించాయి. మరి వీటిలో మదుపు ఎంత మేరకు సురక్షితం? డిపాజిట్‌ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి చూద్దామా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక్కడు!

మనసుంటే మార్గముంటుంది. తపన ఉంటే అడ్డంకులెదురైనా లక్ష్యం దిశగా పరుగు సాగించొచ్చు. చదువు మధ్యలో ఆగినా... మళ్లీ పుస్తకాలు పట్టి... ఎన్‌సీసీలో చేరి... నావికాదళం నిర్వహించిన పోటీల్లో సత్తా చాటిన పేదింటి బిడ్డ విజయగాథ ఇది. కేరళలోని కొచ్చిన్‌ నేవల్‌ బేస్‌ నుంచి నావికాదళ నౌకలో గురువారం వివిధ దేశాలకు పయనమయ్యాడు. 2013లో స్వగ్రామంలో పదో తరగతి పూర్తి చేసిన విజయ్‌కుమార్‌ ఆ తర్వాత విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో మెకానికల్‌ విభాగంలో డిప్లొమా చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఎందుకీ గోప్యత? హెచ్‌సీఏ తీరుపై సర్వత్రా విమర్శలు

ఉప్పల్‌ స్టేడియం.. దేశంలోనే ఉత్తమ క్రికెట్‌ మైదానాల్లో ఒకటి. ఇక్కడ మ్యాచ్‌లు జరిగినపుడల్లా స్టేడియంపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు కురుస్తుంటాయి. ఇక హైదరాబాదీల క్రికెట్‌ అభిమానం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ధోని, కోహ్లి, రోహిత్‌ లాంటి స్టార్‌ ఆటగాళ్లు ఉప్పల్‌ స్టేడియం గురించి, ఇక్కడి అభిమానుల క్రికెట్‌ ప్రేమ గురించి గొప్పగా మాట్లాడిన సందర్భాలున్నాయి. అయితే దేశంలోని మిగతా స్టేడియాలతో పోలిస్తే ఇక్కడ జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లు తక్కువ. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. 88 ఏళ్ల ఉత్సవం... భక్తజన రంజితం

దసరా ఉత్సవాలంటే ఎవరికైనా కోల్‌కతా గుర్తుకు వస్తుంది. కాళికా అమ్మవారికి అక్కడ జరిగే వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. గోదావరి తీరంలో దేవీచౌక్‌ ఉత్సవాలకూ అంతే ప్రత్యేకత. ముఖ్యంగా దసరా ఉత్సవాల్లో ఇక్కడ నాటకాలకు ప్రాముఖ్యత ఉంది. కళాకారులకు ప్రోత్సాహం అందిస్తూ పది రోజుల సంబరాల్లో ప్రసిద్ధి చెందిన కళాకారుల నాటక ప్రదర్శనలు నిర్వహిస్తారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన బత్తుల మునియ్య, బత్తుల కామరాజు కోల్‌కతాకు వ్యాపార నిమిత్తం వెళ్లేవారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఏమిటీ పీఎఫ్‌ఐ?

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)... గురువారం దేశవ్యాప్తంగా మారుమోగిన పేరిది. కారణం- జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తొలిసారి ఏకకాలంలో 15 రాష్ట్రాల్లో ఈ సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడమే! ఇంతకూ ఏమిటీ పీఎఫ్‌ఐ? ఎవరు వీరంతా? దీని లక్ష్యమేంటి? చరిత్రేంటి?దక్షిణభారతంలోని మూడు ముస్లిం సంస్థలు కలసి 2007లో పీఎఫ్‌ఐగా ఆవిర్భవించాయి. ఈ సంస్థ ఏర్పాటుకు ఓ నేపథ్యం ఉంది. వివాదాస్పద స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూమెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమి) సంస్థపై ప్రభుత్వం నిషేధం విధించాక... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. దస్త్రమేదైనా.. అడ్డంగా మార్చేస్తాం...!

పలాస తహసీల్దారు కార్యాలయ అధికారుల చేతివాటం ప్రదర్శించారు.   రూ.కోట్ల విలువ చేసే భూ రికార్డుల్లో అక్రమంగా ఇతరుల పేర్లు నమోదు చేసేశారు. ఏకంగా ఫెయిర్‌ అడంగల్‌ పుస్తకంలో ఇతరుల పేర్లతో దారుణాలకు పాల్పడ్డారు. ఈ విషయం బయటకు రాకుండా ప్రయత్నించినా, చివరకు వెలుగులోకి రావడంతో బయటపడే మార్గాలు వెతుక్కొంటున్నట్లు సమాచారం.. ఈ వ్యవహారం ఇటీవలే జరిగినట్లు స్పష్టమవుతోంది. దర్జాగా దస్త్రాల్లో ఇతరుల పేర్లు నమోదు చేశారంటే  ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. 12వేలకు మించితే తిరుమలకు అనుమతి లేదు: తితిదే

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు తరలివస్తారనే ఆలోచనతో తితిదే నిఘా, భద్రతా విభాగం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. తిరుమలకు వెళ్లే అన్ని వాహనాలు 12వేలు దాటిన తరువాత అనుమతించకూడదని నిర్ణయించింది. వాహనాలను తిరుపతిలోని పార్కింగ్‌ ప్రాంతాల్లో నిలిపి ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు వెళ్లాలని సూచించింది. ఏటా గరుడ వాహన సేవ రోజు ఉదయం నుంచి మరుసటి రోజు వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలను అనుమతించరు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కామెంట్‌ చేస్తే కటకటాలే!

చేతిలో ఫోన్‌ ఉంది కదా అని సామాజిక మాధ్యమాల్లో చిన్న వ్యాఖ్య పెట్టారా? ఎవరో పెట్టిన పోస్టు మీకు నచ్చలేదన్న కారణంతో కాస్త కఠినంగా వ్యతిరేకించారా? పోలీసు కేసుల్లో ఇరుక్కునట్లే! ఇప్పటి వరకు సామాజిక మాధ్యమాల్లో మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెట్టిన వారిపైనే కేసులు పెడుతూ వచ్చిన పోలీసులు ఇప్పుడు పోస్టుల కింద కామెంట్లు పెడుతున్న వారినీ వెంటాడుతున్నారు. ఐటీ చట్టంతోపాటు ఐపీసీ కింద కూడా కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆ ఘోరానికి నాలుగేళ్లు..

మావోయిస్టుల దుశ్చర్యలో ఇద్దరు ప్రజా ప్రతినిధులు ప్రాణాలు కోల్పోయిన ఘటన జరిగి నాలుగేళ్లు పూర్తవుతోంది. గిరిజన ప్రాంత అభివృద్ధికి బాటలు వేస్తున్న ఇద్దరు గిరిజన ప్రజాప్రతినిధులు 2018 సెప్టెంబర్‌ 23న మావోల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. తెలుగుదేశం పార్టీకే కాదు... ఏకంగా గిరిజన ప్రాంతానికే ఇద్దరు సమర్థులైన నాయకులను కోల్పోయిన రోజది. అరకులోయ నియోజకవర్గంలో గిరిజనుల పక్షపాతిగా, వారి పక్షాన ప్రభుత్వానికి అప్పటివరకు గొంతును వినిపించిన కీలక నాయకులు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts