Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 30 Sep 2022 09:08 IST

1. ‘ఆదిపురుష్‌’.. రాముడిగా ప్రభాస్‌.. ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు, ముఖ్యంగా ప్రభాస్‌ అభిమానులకు దర్శకుడు ఓంరౌత్ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ప్రభాస్‌ హీరోగా ఆయన తెరకెక్కిస్తోన్న ‘ఆదిపురుష్‌’ (Adipurush) ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని శుక్రవారం ఉదయం షేర్‌ చేశాడు. ఇందులో ప్రభాస్‌ పొడవాటి జుత్తు, చేతికి రుద్రాక్షలు ధరించి రాముడిగా.. ఆకాశానికి విల్లు ఎక్కుపెట్టి పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపించారు. ‘‘మా ఈ అద్భుతమైన ప్రయాణంలో మీరూ భాగం కండి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అమెరికాలో ఏడేళ్లుంటే గ్రీన్‌కార్డు!

అమెరికాలో శాశ్వత నివాసం హోదా కోసం చాలా కాలంగా నిరీక్షిస్తున్న వారికి శుభవార్త. గ్రీన్‌కార్డులకు సంబంధించిన కీలక బిల్లును అమెరికా చట్టసభలో డెమోక్రటిక్‌ పార్టీ సెనేటర్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే డ్రీమర్లు, హెచ్‌-1బీ, దీర్ఘకాల వీసాలపై అమెరికాలో ఉంటున్న భారతీయులకు భారీ ఊరట లభిస్తుంది. కనీసం ఏడేళ్లుగా ఆ దేశంలో నివసిస్తున్న వలసదారులు శాశ్వత నివాస హోదా పొందటానికి అర్హులవుతారు. ఈ బిల్లును సెనేటర్‌ అలెక్స్‌ పాడిల్లా సభలో ప్రవేశపెట్టగా..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కాదంటే.. ఔననిలే!

కళ్లెదుట రూ.కోట్ల విలువైన ఖనిజ నిక్షేపాలు.. అనుమతులు ఇస్తే తవ్వుకుపోవాలని చాలా మంది కాసుక్కూర్చున్నారు. దశాబ్దానికి పైగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. ప్రభుత్వం మారింది.. నాయకుల రంగులూ మారాయి.. ఎట్టకేలకు రాయబేరాలు కొలిక్కివచ్చాయి. అధికారిక ఆశీస్సులు దక్కాయి. ఇంకేముంది.. అనుమతులకు పచ్చజెండా ఊపడంతో తవ్వకాలకు మార్గం సుగమమైంది. అభయారణ్యానికి ఆనుకుని ఉన్న ఈ ప్రాంతం పచ్చదనంతో నిండింది. ఇక్కడ మైనింగ్‌ కార్యకలాపాలు సాగించాలంటే వృక్షాలు తొలగించాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 

4. అది ఫెదరర్‌కే సాధ్యం

ఆటతో కేవలం టెన్నిస్‌ అభిమానులనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను తనకు మద్దతుగా నిలిచేలా ఏకం చేయడం ఫెదరర్‌కే సాధ్యమైందని టీమ్‌ఇండియా ఆటగాడు కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఇటీవల టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన ఫెదరర్‌ గురించి కోహ్లి మాట్లాడిన వీడియోను ఏటీపీ టూర్‌ ట్విటర్‌లో పోస్టు చేసింది. ‘‘హలో.. రోజర్‌. ఈ వీడియోను నీకు పంపించడం నాకు దక్కిన గౌరవం. మాకెన్నో అందమైన జ్ఞాపకాలు, మధురానుభూతులు ఇచ్చిన నీ అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. చెప్పేవి నీతులు.. దోచేవి గుట్టలు!

అధికారులు అవినీతి చేస్తే ఆయన ఏమాత్రం సహించరు.. అక్కడికక్కడే కడిగేస్తారు.. అవినీతిరహిత పాలన అంటూ ప్రసంగిస్తారు. ఇదంతా చూసి ఆయనేదో నిజాయతీపరుడు అనుకుంటే తప్పులో కాలేసినట్లే. అదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు ధర్మవరం నియోజకవర్గ పరిధిలో భూముల్ని ఆక్రమించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో సగానికి పైగా ప్రభుత్వ భూములే ఉన్నట్లు సమాచారం. ధర్మవరం, ముదిగుబ్బ మండలాల్లో ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు పదుల ఎకరాల్లో ప్రభుత్వ భూముల్ని మింగేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 1 నుంచి అమల్లోకి వైఎస్సార్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా

రాష్ట్రంలో అక్టోబరు 1 నుంచి వైఎస్సార్‌ కల్యాణ మస్తు, షాదీ తోఫా పథకాలు అమలులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. వైఎస్సార్‌ కల్యాణమస్తులో ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష, ఎస్సీ, ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.20 లక్షలు, బీసీలకు రూ.50 వేలు, బీసీలో కులాంతర వివాహాలకు రూ.75 వేలు అందజేయనుంది. షాదీ తోఫాలో ముస్లిం, మైనారిటీలకు రూ.లక్ష, దివ్యాంగుల వివాహాలకు రూ.1.50 లక్షలు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. దసరాకు ప్రత్యేక రైళ్లు, అదనపు బోగీలు

దసరా పండగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని జోన్‌ పరిధిలో, జోన్‌ మీదుగా రానుపోను 12 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎనిమిది రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. సికింద్రాబాద్‌-సాంతరాగాఛి-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-షాలిమార్‌-సికింద్రాబాద్‌, నాందేడ్‌-బెర్హంపుర్‌-నాందేడ్‌, త్రివేండ్రం-టాటానగర్‌-త్రివేండ్రం మధ్య ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు పేర్కొంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కథ.. దర్శకత్వం.. ఓ మహిళ

నెల్లూరు నగరంలో సంచలనం సృష్టించిన వైద్యుడి ఇంట్లో దొంగతనం కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. చోరీకి కథ.. దర్శకత్వం మొత్తం ఓ మహిళగా గుర్తించారు. దీంతో పాటు మరో రెండు నేరాలు కూడా చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఈ నెల 11న పొగతోటలోని ఓ వైద్యుడి ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి సుమారు రూ. 60 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సీఎం సారూ.. ఈ సమస్యలు పరిష్కరించరూ..

కృష్ణశిలతో నిర్మితమైన దివ్యధామం.. లక్ష్మీనారసింహులు కొలువుదీరిన భవ్య క్షేత్రం.. సీఎం కేసీఆర్‌ సంకల్పంతో నవ వైకుంఠంగా తీర్చిదిద్దారు. ఎన్ని వసతులు కల్పించినా ఇంకా చిన్నచిన్న సమస్యలతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వీటిపై దృష్టిసారిస్తే మరిన్ని వసతులు మెరుగు కానున్నాయి. శుక్రవారం యాదాద్రి క్షేత్రానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రానున్న నేపథ్యంలో భక్తులకు కల్పించాల్సిన వసతులపై కథనం.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నగరంలో ఒక రాత్రి..

నగరం.. పగలంతా ప్రశాంతంగా ఉంటుంది. చీకటి పడిందంటే చాలు.. కొందరు మత్తులో తేలిపోతున్నారు. రహదారులు, ప్రజలు సంచరించే ప్రాంతాల్లోనే మద్యం తాగుతూ విందులు చేసుకుంటున్నారు.. సిగరెట్లలో గంజాయి పెట్టుకుని గుప్పుగుప్పుమంటూ ఊదడం, మత్తులో తూగుతూ కూడళ్లలోనూ పుట్టిన రోజు వేడుకల పేరుతో కేకులు కోసి హల్‌చల్‌ చేయడం, రోడ్డుపై వెళ్లేవారిని భయపెట్టడం, ఎవరైనా ఇదేంటని అడిగితే దాడికి దిగడం.. ఇవీ ఓరుగల్లు నగరంలో అనేక అడ్డాల్లో కనిపించిన దృశ్యాలు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని