Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 28 Nov 2022 09:12 IST

1. అన్నీ రాయాలా? కొన్నే ఎంచుకోవాలా?

9,168 గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గ్రూప్‌-4తో పాటు గ్రూప్‌-2, గ్రూప్‌-3 సర్వీసుల నియామక నోటిఫికేషన్లు డిసెంబర్లో వస్తున్నాయన్న వార్తలు.. ఉద్యోగార్థుల్లో ఉత్సాహం పెంచేశాయి. ఈ సదవకాశాన్ని గరిష్ఠ స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలంటే అభ్యర్థులు ఎలా ముందుకు సాగాలి? ఏమేం గమనించాలి? ఏ మెలకువలు పాటించాలి?  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అయ్యో పాపం.. ఎంత కష్టం!

అసలే నిరుపేద కుటుంబం. భార్యాభర్తలు ఇద్దరూ పనికెళ్తేగానీ పూట గడవని పరిస్థితి. దీనికితోడు లోకం తెలియని ఇద్దరు మానసిక దివ్యాంగుల సంరక్షణ భారం. దివ్యాంగులైన ఆ ఇద్దరికీ ప్రభుత్వపరంగా కనీసం పింఛను సాయమైనా అందకపోవడంతో ఆ కుటుంబ జీవనం అత్యంత భారంగా మారింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ముసునూరు గిరిజన కాలనీకి చెందిన కల్లూరి లక్ష్మీనారాయణ, వెంకటరమణ దంపతుల కుమారుడు అంకమరావు (12) మానసిక దివ్యాంగుడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. బీసీసీఐ గిన్నిస్‌ రికార్డు

బీసీసీఐ మరో ఘనతను ఖాతాలో వేసుకుంది. ఓ టీ20 మ్యాచ్‌కు అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరైన విషయంలో ప్రపంచ రికార్డు నమోదు చేసింది. ఈ ఏడాది మే 29న ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌ను 1,01,566 మంది ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సంఖ్య ఇప్పుడు గిన్నిస్‌ పుస్తకాల్లోకి ఎక్కింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. గిన్నిస్‌ ప్రపంచ రికార్డును కార్యదర్శి జై షా స్వీకరిస్తున్న ఫొటోను బీసీసీఐ ఆదివారం ట్వీట్‌ చేసింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అదే పనిగా టీవీ చూసిన కుమారుడు.. తల్లి ఏం చేసిందంటే?

పిల్లలకు క్రమశిక్షణ అలవర్చేందుకు తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరిస్తుంటారు! అదే పనిగా టీవీ చూస్తోన్న తమ కుమారుడిని సరైన మార్గంలో పెట్టేందుకు చైనాకు చెందిన ఓ జంట మాత్రం ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసింది. రాత్రంతా కూర్చొబెట్టి అతనితో బలవంతంగా టీవీ చూపించడం గమనార్హం. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. చైనాలోని హునాన్‌ ప్రావిన్స్‌లో నివసిస్తోన్న దంపతులకు ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సీఎం సారూ.. మాట తప్పారు

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన హామీలకు.. జరుగుతున్న పరిణామాలకు పొంతనే లేదు. వరద బాధితులను పరామర్శించేందుకు ఈ ఏడాది ఆగస్టు 27న ముఖ్యమంత్రి విలీన మండలాల పర్యటనకు వచ్చారు. వేలేరుపాడు మండలం కన్నాయిగుట్టలో వరద బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. రాష్ట్ర నిధులతోనైనా సెప్టెంబరు నెలాఖరుకల్లా 41.15 కాంటూరు..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. బాలిక బతుకు పోరాటం

రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. అమ్మానాన్నల కష్టాన్ని గుర్తించిన ముగ్గురు పిల్లలు చదువు, ఆటపాటల్లో రాణిస్తున్నారు. చురుకైన పెద్ద కుమార్తె తల్లికి చేదోడుగా ఉండేది. ప్రశాంతంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో ఊహించని కుదుపు. డ్రైవింగ్‌ లైసెన్సు లేని 20 ఏళ్ల యువకులు మద్యం తాగి ద్విచక్ర వాహనం నడుపుతూ వారి పెద్ద కుమార్తెను ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చేరి ఇప్పుడు బతుకు పోరాటం చేస్తోంది. మూసిన కన్ను తెరవకుండా.. కృత్రిమ శ్వాస తీసుకుంటోంది. తమ కలల ప్రతిరూపం ఎప్పుడు స్పృహలోకి వస్తుందా?   పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కాళ్లు మొక్కుతాం.. రోడ్డు వేయించండి సార్‌!

 ‘ఎమ్మెల్యేలు మారారు. ప్రభుత్వాలు మారాయి. మా రోడ్డు మాత్రం బాగు పడలేదు. 30 ఏళ్లుగా అతుకుల బొంత లాంటి రహదారిపై రాకపోకలు సాగించలేక అవస్థలు పడుతున్నాం. మీ కాళ్లు పట్టుకుంటాం... మీరైనా రోడ్డు వేయించండి సారూ! అంటూ తుమ్మగుంట, నడింపల్లి గ్రామస్థులు ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌కు చేతులెత్తి మొక్కారు. ఆదివారం ప్రకాశం జిల్లా కనిగిరి మండలం తుమ్మగుంటలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రాష్ట్రంలో కొత్త విమాన సర్వీసులు!

రాష్ట్రంలో కొత్తగా మూడు విమాన సర్వీసులను అందుబాటులోకి తేవాలని రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌ (ఏపీఏడీసీఎల్‌) నిర్ణయించింది. ఇందులో భాగంగా జరిపిన చర్చల్లో ఆయా మార్గాల్లో సర్వీసులు నడపడానికి ఇండిగో సంస్థ ప్రాథమికంగా అంగీకారం తెలిపింది. సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. రద్దీ ఎలా ఉంటుంది? విమానాలు అందుబాటులో ఉంటాయా? కొత్తగా సమకూర్చుకునేవి ఎప్పటిలోగా వస్తాయి?  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. జయలలితకు వారసులు ఉండుంటే బాగుండేది

జయలలితకు వారసులు ఉండుంటే ఆస్పత్రిలో సహాయంగా ఉండే వారని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్ముగస్వామి వ్యాఖ్యానించారు. తిరుప్పూరు జిల్లా తారాపురంలో జరిగిన కళాశాల స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జయలలిత మృతి గురించి దిల్లీ ఎయిమ్స్‌ తన నివేదికలో ఎలాంటి అనుమానం లేదని తెలిపిందన్నారు. కానీ జయలలిత గుండె సమస్యే ముఖ్యమైనదని, అలాంటప్పుడు ఆంజియో చేసుండాలని, ఎందుకు చేయలేదన్నదే తన అనుమానమని పేర్కొన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. తితిదే 2023 డైరీలు, క్యాలెండర్లు.. కావాలంటే ఇలా చేయండి..

తితిదే ప్రతిష్ఠాత్మకంగా ముద్రించిన 2023వ సంవత్సరం క్యాలెండర్లు, డైరీలు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. తిరుపతి, తిరుమలలోని తితిదే పుస్తక విక్రయ కేంద్రాల్లో వీటిని ఉంచినట్లు తితిదే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయాలతోపాటు నెల్లూరు, రాజమహేంద్రవరం, కాకినాడ, కర్నూలు, నంద్యాల, హనుమకొండలోని తితిదే కల్యాణ మండపాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని