Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 30 Nov 2022 09:34 IST

1. ఇల్లండి... మావల్ల కాదండి

నవరత్నాల్లో భాగంగా మంజూరైన గృహ నిర్మాణాల్లో పురోగతి కనిపించడం లేదు. బిల్లులు మంజూరు చేస్తామన్నా.. లబ్ధిదారులు పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు రావడం లేదని అధికారులే చెబుతుండడం గమనార్హం. ప్రధానంగా వర్షాలు నిర్మాణాలకు ఆటంకం కలిగించాయని పేర్కొంటున్నారు. మరోవైపు నిర్మాణ సామగ్రి కొరత, ఆర్థిక ఇబ్బందులు, లేఔట్లలో మౌలిక వసతులు అరకొరగా ఉండడంతో పనులు చేయలేకపోతున్నామని నిర్మాణదారులు వాపోతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మండమెలిగే.. భక్తులకు పండగే

మేడారం మహాజాతర.. పరిచయం అక్కర్లేని పండుగ. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచింది.. రెండేళ్లకోసారి వైభవంగా జరుగుతుంది. మహాజాతర తర్వాత ఏడాది నిర్వహించే మండమెలిగే పండుగే చిన్నజాతర. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్ల ఆశీస్సులు పొందుతుంటారు. తల్లుల సన్నిధిలో నాలుగు రోజుల పాటు సందడి నెలకొంటుంది. చిన్నజాతర నిర్వహించడానికి పూజారులు, అధికారులు తేదీలు ఖరారు చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు చిన్నజాతర కనులపండువగా జరగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వంకర మెడే.. గుర్తింపైంది!

పుట్టుకతోనే నాకు మెడ వంకర. స్నేహితులే ఉండేవారు కాదు. నాన్న దౌత్యవేత్త. దీంతో ఎన్నో దేశాలు తిరిగాం. నా యాస, రూపు రేఖలు ప్రతిదాన్నీ వెక్కిరించేవారు. దానికితోడు అమ్మ చాలా అందంగా ఉంటుంది. తనతో నన్ను పోల్చి ఇంకా ఏడిపించేవారు. ఫలితంగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయా. చదువయ్యాక ఇంటర్వ్యూకని వెళితే వరుసగా 7 తిరస్కరణలు. ఇక నేను బతికుండటం వృథా అనుకొని కిటికీలోంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మరోసారి రిషభ్‌ పంత్‌ విఫలం.. టీమ్‌ఇండియా స్కోరు 87/3 (21 ఓవర్లు)

మరోసారి భారత్‌ బ్యాటర్‌ రిషభ్ పంత్ (10) విఫలమయ్యాడు. కుదురుకొన్నట్లు అనిపించిన పంత్ అనవసరమైన షాట్‌కు యత్నించి డారిల్ మిచెల్‌ బౌలింగ్‌లో గ్లెన్‌ ఫిలిప్్‌ చేతికి చిక్కాడు. దీంతో 20.3వ ఓవర్‌లో 85 పరుగుల వద్ద భారత్‌ మూడో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం టీమ్‌ఇండియా స్కోరు 21 ఓవర్లకు 87/3. న్యూజిలాండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధిస్తుండటంతో పరుగులు చేయడం కష్టంగా మారింది. ప్రస్తుతం క్రీజ్‌లో సూర్యకుమార్‌ (1*), శ్రేయస్ అయ్యర్ (28*) ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. దారి కాచిన ప్రమాదాలు

అధ్వాన దారులు ప్రమాదాలకే కాదు.. చోరీలకు కారణమవుతున్నాయి. ఈ ఘటన మహానంది పుణ్యక్షేత్రం వద్ద సోమవారం రాత్రి జరిగింది. రహదారి గుంతల మయంగా మారడంతో బస్సు నిదానంగా వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు వాహనంలోకి ఎక్కి అయ్యప్ప మాలధారుల ఇరుముడులు తస్కరించారు. అందులో నగదు ఉంటుందన్న ఆలోచనతో చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పిలుస్తోంది.. పోలీసు కొలువు!

పోలీసు శాఖలో వేలాది ఉద్యోగాల భర్తీకి సోమవారం నోటిఫికేషన్‌ విడుదలవడంతో ఆశావహులు తమ సన్నద్ధతను వేగవంతం చేస్తున్నారు. ఈసారి పోటీ భారీ స్థాయిలో ఉండొచ్చని అంచనా. ఎస్‌.ఐ., కానిస్టేబుల్‌ పోస్టులకు ఒకేసారి భర్తీ నోటిఫికేషన్‌ విడుదల చేయటంతో రెండింటికి   సన్నద్ధమయ్యే వారి సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చు. అత్యధికులు రెండు విభాగాల్లోను పోటీ పడే అవకాశాలున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మేమిల్లు కడితే.. మీరు అంటకడతారా!

జగనన్న కాలనీల్లో సొంతింటి నిర్మాణం చేసుకుంటున్న వారికి అవస్థలు తప్పడం లేదు. ప్రభుత్వం ఇచ్చే నగదు సరిపోక.. అప్పులు తెచ్చుకుని మరీ ఇళ్లు కట్టుకుంటుంటే.. సామగ్రి కొనుగోలు చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తుండటంతో లబోదిబోమంటున్నారు. కష్టపడి నిర్మించుకుంటున్న ఇంటికి సూచించిన సామగ్రి అమర్చుకోవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మాకు నచ్చినవి అమర్చుకుంటామని తేల్చిచెబుతున్నారు. పైగా ప్రభుత్వం ఇచ్చే వాటికంటే.. బయట మార్కెట్‌లో లభించే సామగ్రి ధరలే తక్కువ ఉంటున్నాయని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ముఖ్యమంత్రి గారు.. వరాలు గుర్తుచేసుకోరూ?

ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా ప్రజలకు ఎన్నో హామీలిచ్చారు... అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక వాటన్నింటినీ విస్మరించారు. జిల్లాలో సుదీర్ఘ కాలంపాటు పాదయాత్ర చేసిన సమయంలో తాము అధికారంలోకి రాగానే జిల్లా స్వరూపాన్నే మార్చేస్తానని, పిలిస్తే పలికే కరవును పారదోలతానని హామీలు గుప్పించారు. మదనపల్లెలో బుధవారం ముఖ్యమంత్రి పర్యటించనున్న నేపథ్యంలో ప్రజల సమస్యలు, ప్రతిపక్ష నేత, ముఖ్యమంత్రి హోదాల్లో ఇచ్చిన హామీల అమలు తీరుపై ప్రత్యేక కథనం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. విజయానికి.. 5 సూత్రాలు!

కొన్ని నెలలుగా సాధన.. ప్రిలిమినరీలో ప్రతిభ చాటారు.. కీలకమైన దేహదారుఢ్య పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.. మిగిలింది 8 రోజులే.. గడువు సమీపిస్తున్న కొద్ది అభ్యర్థుల్లో ఒత్తిడి పెరుగుతోంది.. ఇన్నాళ్లు సాధన చేసినా.. తీరా పరీక్ష రోజు ఎలా ప్రదర్శన చేస్తారన్నదే ప్రధానం.. డిసెంబరు 8 నుంచి దేహదారుఢ్య పోటీ పరీక్షలు నిర్వహించనున్నారు. అడ్మిట్‌ కార్డులను సోమవారం నుంచి తీసుకునే వెసులుబాటు కల్పించారు. జిల్లాలో దాదాపు 223 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పోటీ పరీక్షకు అర్హత సాధించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. విద్యారుణం... మరింత సులువు!

విదేశాల్లో చదవాలంటే ఎడ్యుకేషన్‌ లోన్‌ ఎలా తీసుకుంటాం? నచ్చిన కాలేజీకి దరఖాస్తు చేసుకుని, అందుబాటులో ఉన్న బ్యాంకులకు రుణం ఇవ్వాల్సిందిగా వివరాలు అందిస్తాం. అప్పటివరకూ తరగతులకే పరిమితమైన విద్యార్థులకు... ఈ విషయాలపై అంతగా అవగాహన ఉండటం కొంత కష్టమే! పైగా మనకు లభిస్తున్న రుణం అన్నివిధాలా తగినదా కాదా అనేదీ తెలుసుకోవాలి. అందుకే దీన్ని మరింత సులభం చేసేందుకు ‘లోన్‌ బిడ్డింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌’ విద్యార్థుల కోసం అందుబాటులోకి వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని