Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. మీ అభిమానం.. మరువలేను
‘‘40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. గోదావరి జిల్లాకు కొన్ని వందల సార్లు తిరిగా.. గోదావరి పుష్కరాల్లో ఇక్కడే ఉన్నాను. ఈరోజు మీ స్పందన నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు.. తమ్ముళ్లు ఆవేశంతో ఊగిపోతున్నారు. టీనేజీ పిల్లలు.. టీడీపీ జెండాలు పట్టుకుని తిరుగుతున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా..? జగన్‌మోహన్‌రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేయాలని చూస్తున్నారని’’ తెదేపా అధినేత చంద్రబాబు కొవ్వూరు సభలో ఉద్వేగంగా ప్రసంగించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. మారడోనాతో తండ్రి.. మెస్సీతో తనయుడు
కార్లోస్ మ్యాక్ అలిస్టర్.. అర్జెంటీనా మాజీ ఆటగాడు. దిగ్గజం డీగో మారడోనాతో కలిసి ఆడాడు. అలెక్సిస్ మ్యాక్ అలిస్టర్.. ఆల్‌టైమ్ దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగిన మెస్సీతో కలిసి ఆడుతున్నాడు. ఆ కార్లోస్ ఎవరో కాదు.. అలెక్సిస్ తండ్రి. నాన్న అప్పుడు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించగా.. ఇప్పుడా వారసత్వాన్ని నిలబెడుతూ కొడుకు అదరగొడుతున్నాడు. పోలండ్‌తో పోరులో తొలి గోల్ కొట్టి అర్జెంటీనా నాకౌట్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. క్రెడిట్ స్కోరు.. నివేదికలో తప్పులుంటే...
క్రెడిట్ కార్డు వాడుతుంటాం.. రుణాలకు వాయిదాలు చెల్లిస్తాం. కానీ, ఈ లావాదేవీలన్నీ సరిగ్గా నమోదవుతున్నాయా? చాలామంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. కొత్తగా రుణం తీసుకోవాలని అనుకున్నప్పుడు.. బ్యాంకులు రుణగ్రహీత క్రెడిట్ స్కోరును, నివేదికను పరిశీలిస్తుంటాయి. మీరు క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తున్నప్పటికీ.. నివేదికలో కనిపించకపోవచ్చు. తీసుకోని ఒక అప్పు మీ స్కోరును తగ్గించేయొచ్చు. మరి, ఇలాంటి పొరపాట్లు దొర్లినప్పుడు ఈ నివేదికను ఎలా సరిచేసుకోవాలి? పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. అత్యాచారం కేసులో ప్రజాప్రతినిధి పీఏ..
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో జరిగిన అత్యాచారం కేసులో అధికార పార్టీ ఎమ్మెల్యే పీఏ నిందితుడిగా ఉన్నారు. హనుమకొండ పోలీసుల కథనం ప్రకారం.. ఇతర జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని నగరంలోని ప్రైవేటు వసతి గృహంలో ఉంటూ న్యాయ విద్య చదువుతోంది. తల్లిదండ్రులకు తెలియకుండా ఆమె చరవాణిలో మాట్లాడుతుండగా.. వసతి గృహం నిర్వాహకురాలు గమనించింది. తాను చెప్పినట్లు చేయాలని.. లేకపోతే మీ అమ్మానాన్నకు చెబుతానని బెదిరించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ఒంటికొస్తే.. ఇంటికే!
ఈ చిత్రంలోని మరుగుదొడ్లు కోదాడ నియోజకవర్గం చిలుకూరు మండలం పాలె అన్నారం గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు చెందినవి. ఇక్కడ మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరడంతో పాటు, వాటి నిర్వహణ సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఉపయోగించుకునే పరిస్థితి లేదు. విద్యార్థులు ఆరుబయటకు వెళ్తున్నారు. ఇక్కడ సుమారు 175 మంది విద్యనభ్యసిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల సౌకర్యాలు సక్రమంగా లేవు. ఇటీవల కోర్టు కూడా ఈ విషయం స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ప్లాట్లు చేసి.. రూ. కోట్లు మేసి
ప్రజాప్రతినిధుల పేరును అడ్డం పెట్టుకుంటారు.. అనుచరులుగా చలామణీ అవుతూ ప్రభుత్వ స్థలాలపై కన్నేస్తారు.. పేదలకు అంటగట్టి.. రూ.లక్షల్లో వసూలు చేస్తుంటారు. నగర శివారులోని కుత్బుల్లాపూర్ మండలంలోని కొందరు చోటా మోటా నాయకులు సాగిస్తున్న భూ దందా ఇది. ‘ఈనాడు’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా.. ప్రభుత్వ భూములు ప్లాట్లు చేసి విక్రయిస్తున్న వ్యవహారం వెలుగుచూసింది.నగర శివారులో గాజులరామారంలో సర్వే నం.79లో 461.28 ఎకరాల స్థలం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ‘నల్లత్రాచు’ను తెచ్చారు!
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో పదిహేడేళ్ల క్రితం జరిగిన మన్నం దేవీప్రసాద్ అలియాస్ మన్నం ప్రసాద్ హత్యకేసులో నయీమ్ ముఠాకు చెందిన నిందితుడు మద్దులూరి శేషయ్య అలియాస్ శేషన్నను పోలీసులు విచారణకు తీసుకువచ్చారు. నిందితుడు అనధికారికంగా ఆయుధాలను కలిగి ఉన్నాడన్న సమాచారంతో రెండు నెలల క్రితం గోల్కొండ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అక్కడి పోలీసులు శేషన్నను అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. విచారణ చేపట్టగా నిందితుడు 2005లో సింగరాయకొండలో జరిగిన బ్యాంకు ఉద్యోగి దేవీప్రసాద్ హత్యలో పాల్గొన్నట్లు తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. పిల్లల ఫోన్లపై ఓ కన్నేద్దాం
హైదరాబాద్‌లో బాలికపై అత్యాచార కేసులో పోలీసులకు విస్తుబోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. అఘాయిత్యానికి పాల్పడిన వారిలో ఒకరు రోజూ తండ్రి స్మార్ట్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూసి మిత్రులకు వాటిని చూపించేవాడు. అందులో ఉన్నట్లు చేయాలని తోటి విద్యార్థినిపై దాడికి తెగబడ్డారని తేలింది. ఇటీవల మానసిక వైద్య నిపుణుల వద్దకు వచ్చే కేసుల్లో నెలకు కనీసం 20 మంది అశ్లీల వీడియోలకు బానిసలైన వారే ఉంటున్నారట. నియంత్రణ లేని వనరులు అందుబాటులో ఉండటంతో వీక్షించే సమయం పెరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ముఖ్యమంత్రి హామీ... ఏడాదైనా నెరవేరదేమీ?
భారీ వర్షాలతో వరదొచ్చింది. ఊహించని స్థాయిలో ప్రవాహం పెరిగింది. అన్నమయ్య జలాశయం నుంచి 2.17 లక్షల క్యూసెక్కుల నీటిని బయటకు పంపవచ్చు. పింఛ, అన్నమయ్య జలాశయాల మట్టికట్టలు కొట్టుకుపోవడంతో అపార నష్టం వాటిల్లింది. ఆయా జలాశయాలను రీ డిజైన్ చేయిస్తాం. భవిష్యత్తులో ఇంతకన్నా ఎక్కువ వరదొచ్చినా ఎలాంటి నష్టం జరగకుండా ఆకృతులు మార్పు చేసి నిర్మిస్తాం. - 2021, డిసెంబరు 2న రాజంపేట మండలం పులపుత్తూరు వరద ప్రభావిత గ్రామంలో పర్యటించిన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా చేసిన వాగ్ధానమిది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. అమ్మా.. అనలేడు నాన్నతో ఆడలేడు
అమ్మా! అని ఆనందంతో పరుగెత్తుకు రాలేడు. నాన్నతో గెంతులేస్తూ ఆడలేడు. ఆకలేసినా చెప్పలేడు.. కావాల్సింది అడగలేడు. ఆ తల్లిదండ్రుల వేదన అంతాఇంత కాదు. కుమారుడికి మానసిక వైకల్యం ఉందని తెలిసి కుంగిపోయారు. ఎలాగైనా బాగుచేయించాలని చేసిన ప్రయత్నాలు ఫలితాన్నివ్వలేదు. కుమారుడిని ఇంట్లోనే పెట్టుకుని సపర్యలు చేస్తూ రోజూ మనోవేదనకు గురవుతున్నారు. దివ్యాంగుడైన తమ కుమారుడికి పింఛను రాకపోవడంతో తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
US Visa: వీసా రెన్యువల్‌కు నో మెయిల్.. ఓన్లీ డ్రాప్ బాక్స్!
-
General News
Ap Highcourt: ప్రభుత్వ సలహాదారులను నియమించుకుంటూ పోతే ఎలా?: ఏపీ హైకోర్టు
-
Sports News
IND vs AUS:రవీంద్ర జడేజా ఫిట్‌గా ఉండటం భారత్‌కు చాలాముఖ్యం: ఆకాశ్ చోప్రా
-
General News
Andhra News: అవసరమైతే మరోసారి గవర్నర్‌ను కలుస్తాం: ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ
-
World News
Ukraine Crisis: ‘సైనిక చర్యకు ఏడాది వేళ.. భారీఎత్తున దాడులకు రష్యా ప్లాన్..!’
-
General News
TSSPDCL Jobs: గుడ్‌న్యూస్.. టీఎస్ఎస్పీడీసీఎల్లో 1,601 ఉద్యోగాలకు ప్రకటన