Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. అల్లిబిల్లి పాయింట్లతో టోకరా.. సంకల్ప సిద్ధి మోసంలో కొత్త కోణం
డిపాజిటర్లకు సకాలంలో డబ్బులు చెల్లించకుండా కేవలం రెఫరల్ పాయింట్లనే చూపిస్తూ సంకల్ప సిద్ధి నిర్వాహకులు టోకరా వేశారు. వీటి కోసం ప్రత్యేకంగా వ్యాలెట్‌ను రూపొందించారు. అందులో ఇవి జమ అయ్యేవి. ఈ పాయింట్లను ఇతరులకు కూడా బదిలీ చేసే వెసులుబాటు కల్పించారు. ఈ కేసులోని నిందితులు సంస్థ వెబ్సైట్లో తమ బంధువుల పేర్లు పెట్టి లాగిన్ ఐడీలు రూపొందించారు. వాటికి ఈ పాయింట్లను క్రెడిట్ చేశారు. ఎక్కువ మందిని చేర్చిన వారికి మొబైల్, ట్యాబ్‌లు ఇవ్వనున్నట్లు ఆశచూపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. నీతి లేని ఓ నాయకుడా..! పలుకులేని పరిపాలకుడా..!
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల ఇబ్బందులపై అనంతపురం జిల్లాకు చెందిన విశ్రాంత ఉద్యోగి బాల ఎర్రిస్వామి రాసిన పాట ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సకాలంలో జీతాలు అందని దుస్థితి.. ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా సీఎం జగన్ ఇచ్చిన హామీలు, పెండింగ్ సమస్యలపై ఆయన పాట రాసి, ఆలపించారు. ‘నీతి లేని ఓ నాయకుడా.. పలుకులేని పరిపాలకుడా’ అంటూ ఉద్యోగుల ఇబ్బందులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ పాట రూపంలో ఏకరువు పెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ఇది గాల్లో ఎగిరే తిమింగలం..
తిమింగలం సముద్రంలో కదా ఉండేది.. గాల్లో ఎగరడం ఏమిటి? అనుకుంటున్నారా! మీ సందేహం ఎంత నిజమో.. ఇదీ అంతే నిజం. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానమిది. పేరు బెలుగా. దుబాయిలోని అల్ మక్తుమ్ విమానాశ్రయం నుంచి థాయిలాండ్‌లోని పట్టాయా ఎయిర్‌పోర్టుకు వెళ్తూ మార్గంమధ్యలో ఇంధనం నింపుకొనేందుకు ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో దిగింది. తిరిగి సోమవారం రాత్రి 7.20 గంటలకు బయల్దేరి వెళ్లింది. తిమింగలం ఆకారంలో ఉండే ఇది అనేక ప్రత్యేకతలు కల్గి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. బీటెక్‌ను దాటి.. బీకాం దూకుడు
రాష్ట్రంలో బీటెక్‌లో చేరిన విద్యార్థుల కంటే బీకాంలో ప్రవేశాలు పొందినవారి సంఖ్యే అధికంగా ఉన్నట్లు తేలింది. తొలిసారిగా బీటెక్ కంటే బీకాందే పైచేయి అయిందని డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్-తెలంగాణ(దోస్త్) వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో గతానికి మించి రికార్డు స్థాయిలో కన్వీనర్ కోటాలో 62వేల మంది, యాజమాన్య కోటాలో సుమారు 20వేల మంది, ప్రైవేట్ వర్సిటీల్లో మరో 10వేల వరకు.. మొత్తంగా 92వేల మంది ప్రవేశాలు పొందారు. అదే సమయంలో ఈ విద్యా సంవత్సరం డిగ్రీలో మొత్తం 2,10,970 మంది చేరగా.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. మాకు లోకం కనిపించదు.. మీకు మా సమస్యలు కనిపించవా?
తమ సమస్యలు పరిష్కరించాలని అంధ విద్యార్థులు 4 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. నగరంలోని 4 (మూడు బాలుర, ఒక బాలిక) అంధ విద్యార్థుల వసతిగృహాల్లో 250 మంది వరకు వివిధ తరగతుల విద్యార్థులు వసతి పొందుతూ.. సమీప ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకుంటున్నారు. తమ వసతిగృహాల్లో సమస్యలతో పాటు, విద్య, ఉద్యోగ విషయాలపై భోజనం తినకుండా ఆందోళన చేస్తున్నా అధికారులెవరూ స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం చర్చలకు పిలిచినప్పటికీ చివరి నిమిషంలో వాయిదా పడ్డాయని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ఇక ఈశాన్యానా చుక్‌చుక్ పరుగులు!
అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం.. ఈశాన్య భారత్‌లోని ఈ రాష్ట్రాలు విస్తీర్ణంలో చిన్నవే అయినా ప్రకృతి అందాలతో పరిమళిస్తాయి..సాంస్కృతిక వైభవంతో అబ్బురపరుస్తాయి. భూభాగంలో అత్యధిక విస్తీర్ణం అడవుల మయం.. ఏడాదిలో అత్యధిక రోజుల వర్షపాతం.. చైనా, బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్, నేపాల్ వంటి పలు దేశాలతో పంచుకునే సరిహద్దులు.. ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతల కలబోతగా కనిపిస్తాయి. ఎత్తైన కొండలు, లోయలతో చుట్టుముట్టి ఉండే ప్రాంతం కావడంతో రోడ్డు ప్రయాణం అంత సురక్షితం కాదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఈ దారుణం.. భయానకం!
మధురవాడ వికలాంగుల కాలనీలో తీవ్ర సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో హత్యానంతరం శరీరాన్ని ముక్కలు చేసి... ఏమాత్రం వాసన రాకుండా పకడ్బందీగా ప్యాకింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దిల్లీలోని శ్రద్ధావాకర్ హత్య కేసును తలపించేలా ఉన్న ఈ ఘటనలో నిందితులు పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచుల్లో కుక్కి భారీ ప్లాస్టిక్ డ్రమ్ములో భద్రపరచినట్లు ఆదివారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. గుప్పు గుప్పు ఎక్కువే... చిక్కేది తక్కువే!!
గత రెండు నెలల కాలంలో అనకాపల్లి జిల్లాలో చిక్కిన గంజాయి నిందితుల జాబితా ఇది.. అయితే 5 కేజీల లోపు సరకు మాత్రమే దొరుకుతోంది. అల్లూరి జిల్లా మన్యం ప్రాంతం నుంచి అనకాపల్లి జిల్లా మైదాన ప్రాంతం మీదుగా ఇతర రాష్ట్రాలకు గంజాయి రవాణా జోరుగా సాగుతోంది. విజిబుల్ పోలీసింగ్ పేరుతో పోలీసులు నిఘా పెంచుతున్నారు. అయినా గంజాయి తరలించే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో గంజాయి ఎక్కడ పండిస్తున్నది?, ఎలా తరలిస్తున్నారనే సమాచారం పోలీసుల వద్ద పక్కాగా ఉండేది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. నాడు-నేడు మారని తీరు!
‘నాడు-నేడు’ రెండో విడత పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు జరిగే పాఠశాలల్లో ప్రత్యామ్నాయంగా తరగతులు నిర్వహించే ఏర్పాట్లు చేయకపోవడంతో శిథిల భవనాలు, వరండాలు, చెట్ల నీడలోనే చిన్నారులకు ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పనుల్లో జాప్యం నెలకొందని విద్యాశాఖాధికారులు చెబుతుండగా.. రాష్ట్ర కార్యాలయం నుంచి రావాల్సిన వస్తువులు, నిధులు రాలేదని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ఆ భవనంపై.. కోట్లాట!
నగరంలోని మినీబైపాసులో ఇటీవల ప్రారంభమైన ఓ భవనం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి అధికార పార్టీలోని ఓ వర్గం అండగా ఉండగా.. భవన ప్రారంభ సమయంలో ఆహ్వానం లేకపోవడంతో గుర్రుగా చూస్తున్న మరో వర్గం ఆ కట్టడం అనుమతులు, నిబంధనలను తుంగలో తొక్కిన వైనంపై దృష్టిసారించింది. అడ్డగోలుగా నిర్మించిన ఈ భవనం వైపు నగరపాలక సంస్థ అధికారులు దృష్టిసారించక పోవడం గమనార్హం. భవన నిర్మాణం మొదలుకొని.. నిబంధల అతిక్రమణ వరకు రూ.కోటి వరకు చేతులు మారినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Pak Cricket: భారత్ మోడల్‌కు తొందరేం లేదు.. ముందు ఆ పని చూడండి.. పాక్‌కు మాజీ ప్లేయర్ సూచన
-
General News
Taraka Ratna: విషమంగానే తారకరత్న ఆరోగ్యం: వైద్యులు
-
Movies News
Yash: రూ. 1500 కోట్ల ప్రాజెక్టు.. హృతిక్ వద్దంటే.. యశ్ అడుగుపెడతారా?
-
India News
Gorakhnath: గోరఖ్‌నాథ్ ఆలయంలో దాడి.. ముర్తజా అబ్బాసీకి మరణశిక్ష
-
Politics News
KTR: రాజ్‌భవన్‌లో రాజకీయ నాయకుల ఫొటోలు సరికాదు: కేటీఆర్
-
Crime News
TS news: ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి.. దిల్లీ ముఠా మోసాలు