Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 Dec 2022 09:08 IST

1. కళాశాల విద్య.. అక్రమాల అడ్డా..!

కళాశాల విద్యాశాఖలో పదోన్నతులు, పోస్టుల సృష్టి, బదిలీలు, మామూళ్ల వసూళ్లపైనే దృష్టి సారిస్తున్నారే తప్ప విద్యార్థుల ప్రవేశాలపై దృష్టిపెట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కమిషనరేట్‌లోని ఇద్దరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ దస్త్రం కదలాలన్నా ఎంతో కొంత ఇచ్చుకుంటే తప్ప ముందుకు కదలని దుస్థితి నెలకొంది. ఈ ఇద్దరు అధికారులూ కార్యాలయంలోనే నేరుగా ప్రతి పనికీ ధరలు నిర్ణయిస్తూ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అన్న మంత్రి.. చెల్లెలి పెత్తనం

తమను తిట్టడమే కాక చేయి చేసుకున్నారంటూ పలువురు వర్కర్లు ఫిజియాలజీ ప్రొఫెసర్‌ సుధారాణిపై కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపల్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్‌ సోదరి సుధారాణి కర్నూలు సర్వజన వైద్యశాలలో పనిచేస్తున్నారు. అన్న మంత్రి కావడంతో ఆమెకు అందరూ భయపడతారు. ఆమె రెండు నెలలుగా వైద్యకళాశాల లేడీస్‌ వార్డెన్‌గా ఉన్నారు. పారిశుద్ధ్య పనులు చేసేవారిని రోజూ తన ఇంటికి పంపాలంటూ కేర్‌ టేకర్‌ను ఆమె ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నిరక్షరాస్యులూ.. పట్టభద్ర ఓటర్లే!

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అవకతవకలు వెలుగుచూస్తున్నాయి. వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలని మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు లక్ష్యాలు విధించటంతో.. వాలంటీర్లు చెలరేగిపోయారు. నిరక్షరాస్యులు, 3, 5, 10, ఇంటర్‌ విద్యార్హతలున్నవారినీ పట్టభద్రులేనంటూ దరఖాస్తులు చేసేశారు. ఒకరి పేరుతోనే నాలుగైదు అర్జీలు పెట్టేశారు. ఎన్నికల సంఘం క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే వారందరికీ జాబితాలో చోటు కల్పించేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. గోడ కూలింది.. పరదాయే దిక్కయ్యింది!

కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో దుస్థితి ఇది. 44 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పాఠశాలలో ప్రస్తుతం 106 మంది బాలికలు, 106 మంది బాలురు చదువుతున్నారు. ఆరుగురు ఉపాధ్యాయినులు, ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇటీవల మూత్రశాల గోడ కూలడం,  పైన రేకులను దొంగలు ఎత్తుకెళ్లడంతో ఉపాధ్యాయులు ఆ ప్రాంతంలో పరదాలు కట్టారు. ఆ పరదాల చాటునే నిత్యం బాలికలు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అమ్మానాన్నల్ని చూసేందుకు.. బైక్‌పై జర్మనీ నుంచి భారత్‌కు

జర్మనీ నుంచి భారత్‌కు రావాలంటే సాధారణంగా ఎవరైనా విమానంలో వస్తారు! ముంబయికి చెందిన మేధా రాయ్‌ అనే యువతి మాత్రం అందుకు భిన్నం! ఆమె తన భర్తతో కలిసి.. బైక్‌పై 156 రోజుల్లో ఏకంగా 24 వేల కిలోమీటర్లు ప్రయాణించి ముంబయికి చేరుకుంది. ఇదంతా చేసింది ఏ సాహసయాత్రలో భాగంగానో.. గిన్నిస్‌ రికార్డు సృష్టించేందుకో కాదు.. తన తల్లిదండ్రులను చూసేందుకు. జర్మనీకి చెందిన హాక్‌ విక్టర్‌ 2013లో ముంబయికి వచ్చాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఏపీని కావాలనుకుంటే తమిళనాడులో కలపండి..

మెట్రో కడతామని 2013లో హామీ ఇచ్చిన కేసీఆర్‌ ఎనిమిదిన్నర ఏళ్ల తర్వాత శంకుస్థాపన చేశారని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ విమర్శించారు. తెలంగాణపై సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు సరికాదని, జగన్‌ తన సలహాదారును మార్చుకోవాలని సూచించారు. మద్రాస్‌ ప్రావిన్స్‌ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినందున కావాలంటే ఏపీని తమిళనాడులో కలుపుకోవాలన్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పీఎఫ్‌ క్లెయిమ్‌ల తిరస్కరణలకు చెక్‌

హైదరాబాద్‌కు చెందిన రమేష్‌ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం మానేశారు. పీఎఫ్‌ ఉపసంహరించేందుకు క్లెయిమ్‌ చేసిన ప్రతిసారీ ఏదో ఒక కారణంతో అధికారులు తిరస్కరించారు. ఇలా ఏడాదిలో పదిసార్లు జరిగింది. ఇకపై ఇలా జరగకుండా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) కఠిన చర్యలకు సిద్ధమైంది. క్లెయిమ్‌ను ఒకటికన్నా ఎక్కువ సార్లు తిరస్కరిస్తున్న అధికారులపై దృష్టిపెట్టాలని నిర్ణయించింది. క్లెయిమ్‌ పరిష్కరించకుండా జాప్యం చేయడంతో చందాదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోందని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రయ్‌.. రయ్‌.. రేసుకు సై

నగరంలో మళ్లీ రెండు రోజులపాటు కార్ల రేసింగ్‌ సందడి షురూ కానుంది. శని, ఆదివారాల్లో హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌(ఐఆర్‌ఎల్‌) కార్లు రయ్‌రయ్‌మంటూ దూసుకుపోనున్నాయి. సాగర తీరాన ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్‌ గార్డెన్‌ వైపు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈ పోటీలు శనివారం ఉదయం నుంచే మొదలుకానున్నాయి. నవంబరు 19, 20 తేదీల్లో ఐఆర్‌ఎల్‌ తొలిరౌండ్‌ పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. తగునా.. ఈ గలీజు పని..!

రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన సంబంధిత శాఖ అధికారులు వారు. కానీ కొంతమంది అక్రమార్కులతో చేతులు కలిపి సర్కారు భూమిని పప్పుబెల్లాల్లా పంచకోవడానికి సిద్ధమయ్యారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా, అన్ని శాఖల అనుమతులు లేకుండానే అక్కడ పెట్రోల్‌బంకు నిర్వహణకు అధికారులు అనుమతులిచ్చేశారు. నల్గొండ పట్టణంలోని హైదరాబాద్‌ రహదారి పక్కన వీటీ కాలనీలో సర్వే నెంబర్‌ 1498, 1506లో గల తెలంగాణ ప్రభుత్వ ఆగ్రో ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ప్రయాణికులకు చేరువగా దూర ప్రాంత రైళ్లు

శిర్డీ, జైపుర్‌, హుబ్బళ్లి వంటి పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లాలంటే ఇకపై విజయవాడ, సికింద్రాబాద్‌ వంటి పెద్ద రైల్వేస్టేషన్లకు వెళ్లి ఎక్కాల్సిన ఇబ్బందులు తగ్గనున్నాయి. మచిలీపట్నం, కర్నూలు, మహబూబ్‌నగర్‌, వరంగల్‌ వంటి జిల్లా కేంద్రాల నుంచే ఈ రైళ్ల ప్రయాణం మొదలవనుంది. మొత్తం 10 జత (రాను, పోను)ల దూరప్రాంత రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే బోర్డు ఏడు జోన్ల అధికారులకు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు