Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. అన్నయ్యా.. అక్కా చెల్లెమ్మలకు ఆసరా ఎన్నడు?
మహిళా సంఘాలు 2019 ఏప్రిల్ 11వ తేదీకి ముందు బ్యాంకుల ద్వారా పొందిన రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేసేందుకు వైఎస్‌ఆర్ ఆసరా పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద మహిళల రుణాల మాఫీకి మెప్మా అధికారులు బయోమెట్రిక్‌లో సంతకాల నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కడం కోసం అక్క, చెల్లెమ్మలు ఎదురుచూస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. చిన్నవే.. పాటిస్తే ఖర్చు తగ్గించుకోవచ్చు!
శిరీష వాళ్ల ఇంట్లో ఉండేది ఇద్దరే.. అయినా, ఇంటి ఖర్చు మాత్రం నలుగురున్న కుటుంబానికి సరిపడేలా ఉంటుంది.. అదేంటని వాళ్లమ్మ గారు అడిగితే 'నిజమే.. ఖర్చులు పెరిగిపోతున్నాయి.. కానీ ఎక్కడ తగ్గించాలో అర్థం కావట్లేదం'టుంది. ఒక్క శిరీష విషయంలోనే కాదు.. కొత్తగా పెళ్త్లెన వాళ్లందరికీ ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. ఖర్చులు ఎక్కువవుతుంటాయి. వృథా మాత్రం ఎక్కడ జరుగుతుందో అర్థం కాదు. కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల తెలియకుండానే ఇలా జరుగుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. అంబులెన్సులు సిద్ధం... డ్రైవర్లు లేరు!
ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ (104) కింద కొత్త అంబులెన్సుల కొనుగోలు, నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు తొలి నుంచీ విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే అమలులో ఉన్న ‘104’ పథకాన్ని విస్తరిస్తూ.. ఐదో విడత టెండరులో కొత్తగా 260 అంబులెన్సులు కొనుగోలు చేసింది. ఇవి గత నెల మొదటి వారంలోనే మంగళగిరిలోని వైద్య, ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయానికి వచ్చాయి. వీటిని సంక్రాంతి నాటికే సిద్ధం చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటివరకూ నిర్వహణకు సర్వీస్ ప్రొవైడర్ సంస్థనే ఎంపిక చేయలేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. మధుమేహానికి ముందే!
మధుమేహం పెద్ద సమస్య. మనదేశంలో సుమారు 7.5 కోట్ల మంది దీంతో బాధ పడుతున్నారని అంచనా. దీని చికిత్స కోసం ప్రతి సంవత్సరం ఒకొకరు దాదాపు 9వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సమస్య తీవ్రమై.. రక్తనాళాలు, గుండె, కిడ్నీల వంటి కీలక అవయవాలు విఫలమై ఏటా 6.5 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. అధిక బరువు (శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి 23 కన్నా ఎక్కువ).. వయసు (నలబై ఏళ్లు దాటినవారికి).. సన్నిహిత కుటుంబ సభ్యుల్లో మధుమేహం ఉండటం.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. వ్యవసాయ మేనేజ్‌మెంట్ డిగ్రీకి క్రేజ్..
వ్యవసాయ కోర్సులు పూర్తిచేసినవారికి సాఫ్ట్‌వేర్ కొలువులకు దీటుగా ఆకర్షణీయ ప్యాకేజీలతో ఉద్యోగాలొస్తున్నాయి. రాజేంద్రనగర్‌లోని ‘జాతీయ వ్యవసాయ విస్తరణ, నిర్వహణ సంస్థ’ (మేనేజ్)లో ‘పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్’(పీజీడీఎం) కోర్సు పూర్తిచేసిన 2021-23 బ్యాచ్‌లోని మొత్తం 66 మందికి ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు లభించాయి. దేశంలోనే ప్రముఖ కంపెనీలు రిక్రూట్‌మెంట్‌లో పాల్గొని వీరికి ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగాలిచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ప్రజల ఆరోగ్యానికి శాపాలు
ధనార్జనే లక్ష్యంగా కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రతీ వస్తువు కల్తీ చేస్తున్నారు. చివరకు చిన్నారుల నుంచి పెద్దల వరకు నిత్యం వినియోగించే పాలనూ వదలడంలేదు. కనిగిరి, దర్శి నియోజకవర్గాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈ అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. పశుపోషణ వ్యయప్రయాసలతో కూడుకున్నది. కంటిపాపల్లా మూగజీవాలను సంరక్షించుకోవడంతోపాటు నిత్యం వాటి మేతకు గ్రాసం, తవుడు, వివిధ పోషక పదార్థాలు వినియోగించాల్సి ఉంటుంది. సేకరించిన పాలకు లీటరు రూ.60 వరకు ధర పలుకుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఆ రంగులేంటి... మోదీ బొమ్మ లేదేంటి?
‘ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయవద్దని హైకోర్టు ఆదేశించినా వినరు. కేంద్రం నుంచి వచ్చే నిధులను వినియోగిస్తూ ప్రధాని మోదీ ఫొటో పెట్టరు. కనీసం కేంద్ర ఆరోగ్యమిషన్ లోగోను కూడా భవనంపై ప్రదర్శించరు. ఇదేమి చోద్యం...’ అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ అధికారులపై మండిపడ్డారు. విజయవాడ భవానీపురం హెచ్‌బీ కాలనీలోని పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సోమవారం పరిశీలించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. అలా అయితేనే ఐపీఎల్‌లో ఆడతారు
గాయాల బెడద లేకుంటేనే కీలక ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడతారని భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ‘‘పని భారం ఎక్కువ కాకుండా చూసుకోవడం ఆటలో భాగం. ఈ నేపథ్యంలోనే కోహ్లి, విరాట్, రాహుల్‌లకు వివిధ సిరీస్‌లకు విశ్రాంతినిచ్చాం. పని భారం, గాయాలను పర్యవేక్షించుకోవడం భిన్నమైన అంశాలు. కానీ రెండింటికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నాం. కీలక ఆటగాళ్లకు గాయాల బెడద ఉంటే ఐపీఎల్‌లో ఆడరు. జాతీయ క్రికెట్ అకాడమీ, బీసీసీఐ వైద్య బృందంతో కలిసి స్టార్ ఆటగాళ్ల గాయాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఏడుగురి మృతి
అమెరికాలోని మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియాలోని హాఫ్‌మూన్ బే ప్రాంతంలో రెండుచోట్ల దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. మరికొంతమందికి గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. సమస్య చెప్పండి.. దుర్భాషలొద్దు
‘‘సాధారణంగా మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో నాపై వచ్చే విమర్శల్ని నేనెప్పుడూ పట్టించుకోను. ప్రతి ఒక్కరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంది. వాళ్లకు అనిపించింది వాళ్లు మాట్లాడుకుంటున్నారులే మనకెందుకులే అనుకుంటా. దానిపై మాట్లాడాలని కూడా అనుకోను. కానీ, అలా మౌనంగా ఉండటమే మొదటి నుంచీ నేను చేస్తున్న తప్పేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడా విమర్శలు నా కుటుంబాన్ని కూడా బాధ పెడుతున్నాయి. ఇది సరికాదు’’ అంది నాయిక రష్మిక. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virender Sehwag : అప్పుడు దాన్ని తప్పనిసరి చేసిఉంటే.. చాలా మంది దిగ్గజాలు ఫెయిలై ఉండేవాళ్లు : సెహ్వాగ్
-
Crime News
TSPSC: రాజశేఖర్ ఇంట్లో మరికొన్ని ప్రశ్నపత్రాలు.. నాలుగో రోజు విచారణలో కీలక ఆధారాలు
-
General News
Ap Special Status: ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి తేల్చి చెప్పిన కేంద్రం
-
Movies News
rangamarthanda review: రివ్యూ: రంగమార్తాండ
-
Sports News
Sachin - Sehwag: ముల్తాన్ టెస్టులో సిక్స్ కొడతానంటే.. సచిన్ అలా అనేశాడు: సెహ్వాగ్
-
World News
Medvedev: క్షిపణి రావొచ్చు.. ఆకాశాన్ని గమనిస్తూ ఉండండి: ఐసీసీకి మెద్వదేవ్ వార్నింగ్