Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ (70) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వసంతకుమార్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పూళ్ల గ్రామం. ఉంగుటూరు నుంచి కాంగ్రెస్ తరఫున 2004, 2009 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. రహస్య పాలనపై రచ్చరచ్చ!
రహస్య పాలన ఎంత ప్రమాదకరమో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజలకు శనివారం స్పష్టంగా అవగతమైంది. ఇలాంటి పరిపాలన ఎంత గందరగోళానికి దారి తీస్తుందో తెలిసి వచ్చింది. చివరకు ప్రభుత్వమూ కంగారు పడాల్సి వచ్చింది. నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ఊరు చుట్టి వస్తుందని సామెత. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై సామాజిక మాధ్యమాల్లో వ్యాపించిన ఫేక్ జీవో ఇలాంటి పరిస్థితులనే సృష్టించింది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ఎక్కువ పరిహారం ఇప్పించొచ్చు
ప్రమాద బీమా పరిహార సొమ్మును బాధిత కుటుంబ సభ్యులు కోరిన దానికంటే ఎక్కువ ఇప్పించే అధికారం తమకు ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. పెంచకూడదనే నిషేధం ఏమి లేదంది. బాధిత కుటుంబ సభ్యులు అప్పీలు దాఖలు చేయకపోయినా సొమ్మును పెంచేందుకు కోర్టుకు అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేసింది. ప్రమాదంలో యజమానిని కోల్పోయిన ఓ కుటుంబానికి అండగా నిలిచింది. మృతుడి కుటుంబ సభ్యులకు రూ.1.79 లక్షల పరిహారం ఇవ్వాలని మోటారు వాహనాల ప్రమాద బీమా ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. పులివెందుల... ఎందుకిలా?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో తరచూ జరిగే నేరాలు కలకలం రేపుతున్నాయి. జిల్లాలో ఇతర ప్రాంతాల కంటే ఇక్కడ ఎక్కువగా జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏడాదిన్నర కాలంగా పలు హత్యలు జరగ్గా వీటిల్లో రెండు రాజకీయాలకు సంబంధించినవి కావడం గమనార్హం. మరికొన్ని వివాహేతర, భూతగాదాలకు సంబంధించినవిగా నమోదయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. డబుల్ ఇళ్లు.. ఎదురుచూపులు ఇంకెన్నేళ్లు
రాజధాని పరిధిలో దాదాపు 63 వేల రెండు పడక గదుల ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకోగా లక్షలాది మంది దరఖాస్తుదారులు గృహయోగం కోసం ఎదురుచూస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాకపోవడంతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో పూర్తయిన గృహాలు అసాంఘిక శక్తులకు నిలయాలుగా మారుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. చందాతో కారు షికారు
కారు సొంతం కావాలంటే ఇకపై కొనాల్సిన పనిలేదు.. చందాదారుగా చేరి నచ్చిన కారులో షికారు చేయవచ్చు అంటున్నాయి ఆటోమొబైల్ కంపెనీలు. నచ్చిన కొత్త కారు కొనేందుకు తగిన ఆర్థిక వెసులుబాటు లేక.. నిర్ణయాలను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తుంటారు. ఇలాంటివారు ఇకపై చందాకట్టి కారును ఇంటికి నడపుకుంటూ వెళ్లవచ్చు అని చెబుతున్నారు. కొవిడ్‌కు ముందు సర్వీస్ ప్రొవైడర్లు మొదలెట్టిన సబ్‌స్క్రిప్షన్ విధానం.. కొత్త సంవత్సరంలో మార్కెట్లోకి బాగా విస్తరించే అవకాశం ఉందని ఆటోమొబైల్ నిపుణులు అంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. తమ్ముడి అండ.. సోదరుల దందా!
రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఓ వైకాపా నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోదరులను ముందు పెట్టి అవినీతి వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ప్రతి భూవివాదంలోకి తలదూర్చి సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. అమాయకులైన యజమానుల్ని బెదిరించి చౌకగా భూములు కొట్టేస్తున్నారు. ప్రకృతి సంపదను దోచేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అవకాశం దొరికిన ప్రతి చోట, ప్రతి సందర్భంలో అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడుతూ రూ.కోట్లలో సంపాదించారనే విషయాన్ని నియోజకవర్గమంతా మొత్తం కోడై కూస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. కేపీ అయితే ఏంటి?
‘పార్టీ కోసం రూ.5 కోట్లు ఖర్చు చేశాను..! 15 ఎకరాలు అమ్ముకున్నాను..! అక్కడ కడపలో వైఎస్ జగన్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన వెంటనే ఇక్కడ నేను రాజీనామా చేశాను..! అలాంటిది నన్నే ఇసుక తోలనీయకుండా అడ్డుకుంటారా..? వాడెవడు కేపీ.. రేపు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేవాడు.. అసలు సీఎంను అనాలి. ఇసుక కాంట్రాక్టు కేపీకి ఇచ్చి తప్పు చేశారు.. ఎస్‌ఐగారు.. ఏమంటారు.. ఇసుక తోలమంటారా.. లేదా..? ఇంకో పది ట్రాక్టర్లు తోలతాం.. ఎవరు అడ్డుకుంటారో చూస్తాం.. అసలు ఈ రీచ్.. జేపీకి ఉందా.. ఉంటే చెప్పమనండి..!’ పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ‘నామినేషన్ ముసుగు’లో ఏం జరగనుందో?!
విశాఖ నగరంలో మార్చిలో జి-20 సన్నాహక సదస్సులు... కీలక సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టబోయే అభివృద్ధి పనులను చేజిక్కించుకునేందుకు కొందరు కన్నువేశారు. తమదైన రీతిలో సమాలోచనలు సాగిస్తున్నారు. నగర సుందరీకరణకు దాదాపు రూ.75 కోట్లలో పనులు చేపట్టనున్నట్లు ఇటీవల అధికారులు ప్రకటించారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనల రూపకల్పనలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. దేవుడి భూమైనా.. శ్మశానమైనా.. కబ్జానే
ఇది తణుకు జాతీయ రహదారి సమీపంలోని కేశవస్వామి ఆలయ భూమి. సర్వే నంబర్ 134లో ఉన్న 15.68 ఎకరాల భూమిలో గతేడాది కూడా పంట వేశారు. నాలుగు నెలల తర్వాత పొలాలు మెరక చేసి ఎగ్జిబిషన్ పెట్టేశారు. దేవాదాయశాఖ భూములను సాగు చేసుకోవాలి. రూపు మార్చి వ్యాపార అవసరాలకు వినియోగించడం నిబంధనల అతిక్రమణే కాదు నేరం. నామమాత్రపు కౌలు చెల్లించే భూమికి ఎగ్జిబిషన్ పెట్టి రూ.లక్షల్లో వసూలు చేశారు. కౌలుకు ఇచ్చే నగదు ఆలయానికి జమ చేసి ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే ఆదాయం జేబుల్లో వేసుకున్నారని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Rahul Gandhi: మధ్యప్రదేశ్‌లోనూ కర్ణాటక ఫలితాలే.. 150 స్థానాలు గెలుస్తామన్న రాహుల్ గాంధీ!
-
Movies News
2018 movie ott release date: ఓటీటీలో 2018 మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Sports News
IPL Final: ఫైనల్ మ్యాచ్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ.. నేడూ వరుణుడు ఆటంకం కలిగిస్తాడా?
-
General News
Niranjan reddy: దశాబ్ది ఉత్సవాలు.. చారిత్రక జ్ఞాపకంగా మిగిలిపోవాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి
-
Sports News
CSK vs GT: వర్షం కారణంగా నా పదేళ్ల కుమారుడికి ధోనీని చూపించలేకపోయా!
-
General News
Koppula Eshwar: హజ్ యాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు.. జూన్ 5 నుంచి చార్టర్డ్ విమానాలు: మంత్రి కొప్పుల