Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. సారూ.. ఓరుగల్లు కోరుతోంది..!
ఓరుగల్లు నగరాభివృద్ధికి అనేక అడుగులు పడాల్సి ఉంది. నగరం రూపురేఖలు మార్చి ప్రజలకు స్మార్ట్ సేవలను చేరువ చేసేందుకు అమలవుతున్న ‘ఆకర్షణీయ పథకం’ (స్మార్ట్ సిటీ) పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. మంగళవారం పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కమలాపూర్‌లో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. జిల్లాకు మంత్రి వస్తున్న సందర్భంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రత్యేక కథనం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. మంత్రులూ.. ఎప్పుడిస్తారు బిల్లులు?
‘ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపట్టిన సచివాలయ భవన నిర్మాణాలు చేపట్టాలంటూ అధికారులు మాపై ఒత్తిడి తెచ్చారు. గుత్తేదారులను బతిమాలి పనులు చేయించాం. పనులు పూర్తయి రెండేళ్లవుతోంది. ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదు. బిల్లులు చెల్లించాలని గుత్తేదారులు మాపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. గ్రామాల్లో తిరగాలంటే ఇబ్బందిగా ఉంది. జిల్లా బాధ్య మంత్రి ఆదిమూలపు సురేష్, ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా ఉన్నారు. ఏం ప్రయోజనం? గత మూడేళ్లుగా పాత ఎస్‌ఎస్‌ఆర్ ధరలే అమలు చేస్తున్నారు’.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. పేదలంటే ఎందుకంత కక్ష?
ప్రతి చిన్న విషయానికి ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించే పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తోందని హైకోర్టు ఘాటుగా స్పందించింది. వైఎస్సార్ గ్రామీణ హౌజింగ్ పథకం కింద ఇళ్లు నిర్మించుకున్న వారికి బిల్లులు చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. రూ.58 వేల బిల్లుల కోసం లబ్ధిదారులైన పేద మహిళలను హైకోర్టును ఆశ్రయించే పరిస్థితి తీసుకొస్తారా అంటూ నిలదీసింది. పేదలంటే ప్రభుత్వానికి ఎందుకంత కక్ష అని ఘాటుగా వ్యాఖ్యానించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. రైతు భరోసా అందించినట్లు తప్పుడు లెక్కలు
రైతు భరోసా కింద రూ.40,500 అందించినట్లు పత్రం ఇచ్చారని, తమ ఖాతాలో మాత్రం డబ్బులు పడలేదని, తనకు సెంటు భూమి కూడా లేదని కర్నూలు జిల్లా ఆదోని మండలం కొత్తూరు గ్రామానికి చెందిన అయ్యప్పరెడ్డి ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. గ్రామంలో సోమవారం నిర్వహించిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి వద్ద గ్రామస్థులు సమస్యలు ఏకరువు పెట్టారు. ఇల్లు నిర్మించుకుని రెండేళ్లు గడుస్తోంది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. సింగరేణిలో 558 ఉద్యోగాలు
సింగరేణిలో 558 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈమేరకు ఫిబ్రవరి మొదటి వారంలోగా నోటిఫికేషన్ జారీ చేస్తామని సంస్థ డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. కొత్తగూడెంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. 277 పోస్టులను నిరుద్యోగ అభ్యర్థులతో.. మిగిలిన 281 పోస్టులను అంతర్గత నియామకాల ద్వారా భర్తీ చేస్తారు. 30 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు; మేనేజ్‌మెంట్ ట్రైనీలు.. మైనింగ్ (79); ఎలక్ట్రికల్, మెకానికల్ (66), సివిల్ (18), ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ (10).. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. కొత్త బడ్జెట్... కోటి ఆశలు!
ఏటా కొత్త బడ్జెట్ రాబోతున్నదనగానే అన్ని వర్గాల్లో ఎన్నెన్నో ఆశలు! అందులో సాకారమయ్యే వాటికన్నా, నెరవేరనివే ఎక్కువ. ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించే ఆర్థిక పద్దు- లోక్‌సభ ఎన్నికలకు ముందు వచ్చే చివరి పూర్తిస్థాయి బడ్జెట్. ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ద్రవ్యోల్బణమూ అదుపులోకి రాలేదు. ఇప్పటికే అధిక రుణభారం మోస్తున్న ప్రభుత్వం- పారిశ్రామిక, వ్యవసాయ రంగాల అవసరాలు తీర్చగలిగే స్థాయిలో కేటాయింపులు చేయగలుగుతుందా అన్నదే కీలక ప్రశ్న! పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఆకాశంలో అద్భుతం.. ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు చూడొచ్చు..
రెండు రోజుల్లో ఆకాశంలో అద్భుతం ఆవిష్కతం కానుంది. వేల సంవత్సరాల కిందట కనిపించిన తోక చుక్క తిరిగి ఆకాశంలో కనువిందు చేయనుంది. గ్రీన్ కొమెట్‌గా పిలిచే ఆ తోక చుక్కను ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు విజయవాడ నగర వాసులు స్పష్టంగా వీక్షించవచ్చు. నగరానికి ఉత్తర దిక్కున ధృవ నక్షత్రం, సప్తర్షి మండలం మధ్యలో చూడవచ్చు. మంచు యుగంలో 50 వేల సంవత్సరాల క్రితం కనిపించిన తోక చుక్క ప్రస్తుతం కనిపించనున్నట్లు అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. సాయానికి సవాలక్ష సాకులు
ప్రమాదవశాత్తుగాని సహజ మరణం వల్లగాని ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు కొన్నాళ్లుగా బీమా పథకాలను అమలుచేస్తున్నాయి. వైకాపా ప్రభుత్వంలో వైఎస్సార్ బీమా పేరుతో ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు. అయితే బాధిత కుటుంబాలకు పరిహారం అందించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. అర్హులైనా ఏవో సాకులు చెప్పి సచివాలయాలు, వెలుగు కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారు. కాళ్లరిగేలా తిరిగినా ఇదిగో..అదిగో అనడమే తప్ప ఎప్పుడిచ్చేది స్పష్టంగా చెప్పేవారు కనిపించడం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. పదపదమంటూ.. పాదం ఆగదంటూ
అడుగడుగునా అభివాదాలు, ఆశీర్వాదాలు.. పల్లెపల్లెనా అభిమానం.. పాదయాత్ర ఆద్యంతం ఉత్సాహంగా.. ఉత్సవంగా.. వడివడిగా.. ఒరవడిగా.. పసుపు ‘దండు’లా శ్రేణులు, అభిమానులు నీడగా.. తోడుగా.. లోకేశ్‌తో అడుగులు కలిపారు. జేజేలు కొట్టారు. గజమాలలతో స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించి హర్షించారు. ‘నిన్ను చూడటానికి వచ్చాను నాన్న..’ అంటూ వృద్ధుల అనురాగం. స్వీయచిత్రం తీసుకోవాలని విద్యార్థుల ఆరాటం. ఎదురేగి.. అన్నకు నుదుట తిలకం దిద్దాలని.. హారతి పళ్లేలతో అక్కచెల్లెమ్మల ఆత్రుత.. సమస్యలు తీర్చేందుకు వస్తున్నారని నిరుద్యోగ యువతలో ఆశ.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. విడత విడతకూ కోత.. పింఛనుదారులకు వ్యధ
పింఛన్లు ఇస్తున్నామని చెబుతూనే ప్రభుత్వం వివిధ రకాల వడపోతలతో విడత విడతకు కోత పెడుతుందంటూ పింఛనుదారులు వాపోతున్నారు. కేవలం విచారణ నిమిత్తమేనని, అందరికీ పింఛన్లు అందజేస్తామని పాలకులు చెబుతున్నా జిల్లావ్యాప్తంగా విచారణచేసి వందలాదిమందిని అనర్హులుగా ప్రకటించడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పింఛను పొందుతున్న వారిలో ఎవరైనా అనర్హులు ఉన్నారా లేదా అన్న దానిపై ప్రభుత్వం ఆరు అంచెల విధానాన్ని అమలు చేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Nani: ఆ దర్శకుడు అందరి ముందు నన్ను అవమానించాడు: నాని
-
Crime News
Crime News : స్టాక్ మార్కెట్ మోసగాడు.. 27 ఏళ్ల తర్వాత చిక్కాడు!
-
Politics News
Cm Kcr: రైతులను అన్నివిధాలా ఆదుకుంటాం.. ఎకరాకు రూ.10వేలు పరిహారం: సీఎం కేసీఆర్
-
Movies News
Samantha: అలాంటి పాత్రలో నటించినందుకు ఆనందంగా ఉంది: సమంత
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
IND vs AUS: సూర్య కుమార్ యాదవ్‌కు రోహిత్ మద్దతు