Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 01 Feb 2023 09:09 IST

1. ఆశల ఓరుగల్లు.. కురిసేనా వరాల జల్లు!

వచ్చే ఏడాది పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఈ తరుణంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై అన్ని వర్గాల ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు.. నిధుల విడుదలపై ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విభజన హామీలతో పాటు తర్వాత కాలంలో కేంద్రం మంజూరు చేసిన పలు ప్రాజెక్టులకు ఈసారైనా నిధులు దండిగా ఇవ్వాలని కోరుతున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మనఫోన్‌ ఓఎస్‌.. ఎలా ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి? 

ప్రస్తుతానికి దీని గురించి ఎలాంటి సమాచారం లేదు. మొబైల్‌ఫోన్లలో ఉన్న ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను తొలగించి కొత్తదాన్ని ఇన్‌స్టాల్‌ చేసుకోవటం చాలా రిస్క్‌తో కూడుకున్న పని. కాబట్టి టెక్‌ ఔత్సాహికులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవటం మంచిది. ఇప్పటికైతే కొత్త, మున్ముందు వచ్చే పరికరాలకే భార్‌ఓఎస్‌ పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పాత పరికరాలకు అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. పైగా కఠినమైన గోప్యత, భద్రత అవసరమైన ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేవారికే దీన్ని అందిస్తున్నారు. అయితే త్వరలోనే అందరికీ అందుబాటులోకి రావొచ్చు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సాక్షిగా జగన్‌ పేరున్న విచారణ షెడ్యూల్‌ ఇవ్వండి

కోడి కత్తి దాడి కేసులో బాధితుడు, సాక్షిగా ఉన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరుతో కూడిన విచారణ షెడ్యూల్‌ను తదుపరి విచారణలోపు తాజాగా దాఖలు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)ను విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టు ఆదేశించినట్లు నిందితుడి తరఫు న్యాయవాది   ఎ.సలీమ్‌ తెలిపారు. ‘మొదటి సాక్షి విచారణ అనంతరం హాజరయ్యే సాక్షుల జాబితా వివరాలను మెమో రూపంలో సమర్పించాలని గతంలో కోర్టు ఆదేశించినా దర్యాప్తు సంస్థ దాఖలు చేయలేదు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఈసారైౖనా రైౖలుకూత వినిపించేనా...?

కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌పై ఉభయ జిల్లాల ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఏటా బడ్జెట్‌కు ముందు జిల్లా వాసుల ఆకాంక్షలతో కేంద్రం ముందుకు చాంతాడంత ప్రతిపాదనలు వెళుతున్నా అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. ఈసారైనా ఆశల రైలు ఆగుతుందా లేదా అన్నది ఇవాళ్టి రైల్వే బడ్జెట్‌తో తేలిపోనుంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఏళ్ల తరబడి రైల్వే ప్రాజెక్టులకు మోక్షం దక్కడం లేదు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అది మంచిది కాదమ్మా!

‘స్ట్రిక్ట్‌ డైట్‌లో ఉంది’ వేడుకల సమయంలో ఈ మాట ఎన్నిసార్లు వినుంటాం? సన్నగా, నాజూగ్గా ఉండాలనుకునే ఈ తరం అమ్మాయిలు ఎక్కువమంది అనుసరించే పద్ధతే ఇది! కానీ ఈ తీరంత మంచిది కాదంటున్నారు నిపుణులు. వీలైనంత త్వరగా బరువు తగ్గేయాలని ఆలోచిస్తుంటారు చాలామంది. దీనికోసం క్రాష్‌ డైట్‌లు, విపరీతమైన వ్యాయామాలు చేసేస్తుంటారు. అమ్మాయిల దృష్టి అయితే పూర్తిగా తిండి తగ్గించడంపైనే!  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. బ్యాంక్‌ మేనేజర్‌ ఉద్యోగం వదిలేసి ఆర్టీసీ డ్రైవర్‌గా..

శీతల్‌ శిందే.. 2014 నుంచి పుణెలోని యాక్సిస్‌ బ్యాంక్‌ మేనేజరుగా నాలుగేళ్లు విధులు నిర్వహించిన ఈమె బస్‌ డ్రైవరుగా మారేందుకు ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. మంచి జీతం.. ఏసీ గదిలో విధులు.. అయినా శీతల్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఏడాదిన్నర శిక్షణ పూర్తి కావచ్చింది. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఆర్‌టీసీలో చేరానని ఆమె చెబుతున్నారు. మహారాష్ట్ర ఆర్‌టీసీలో మహిళా కండక్టర్లు ఇప్పటికే ఉన్నప్పటికీ, 2019 మార్చిలో మహిళా డ్రైవర్ల భర్తీ ప్రక్రియను ప్రారంభించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘ఎమ్మెల్యేనే ప్రశ్నిస్తావా.. నీ కొడుకు ఉద్యోగం ఉండదు’

ఎమ్మెల్యేను ప్రశ్నించిన ఓ మహిళపై వైకాపా నాయకులు మండిపడ్డారు. ఆమె కొడుకు ఉద్యోగం తీయించేస్తామని బెదిరించారు. ఈ ఘటన దేవరపల్లి మండలం త్యాజంపూడిలో మంగళవారం జరిగింది. గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గ్రామంలో పర్యటిస్తున్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా గతేడాది సెప్టెంబర్‌ 21న గ్రామంలో 15 గుడిసెలు కూల్చేయడంపై స్థానికురాలు తమర్సి వరలక్ష్మి ఎమ్మెల్యేను ప్రశ్నించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నిత్యం రూ.8 లక్షలు.. నెలకు రూ.2.40 కోట్లు

ఉమ్మడి జిల్లాలో 70కిపైగా గ్యాస్‌ ఏజెన్సీలు ఉన్నాయి. ప్రతి నెలా 6.90 లక్షల సిలిండర్ల (వాయుబండల) వినియోగం జరుగుతోంది. 14.2 కిలోల సిలిండరు ధర రూ.1,055.24. కేంద్ర పన్ను రూ.26.38, రాష్ట్ర పన్ను రూ.26.38 కలిపి మొత్తం రూ.1,108.00 తీసుకోవాల్సి ఉంది. ఏజెన్సీల పరిధిలో పని చేస్తున్న సిబ్బంది ఇంటింటికి చేరవేస్తున్నారు. ఒక్కో వ్యక్తి 30-40 సిలిండర్ల వరకు సరఫరా చేస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మీరూ..స్టీరింగ్‌ తిప్పేయండి

శిక్షణ పొందాలనుకునే వారు సమీపంలోని ఆర్టీసీ అధికారులను సంప్రదించాలి. చిన్నతరహా వాహనాలు నడిపేందుకు రవాణాశాఖ ఇచ్చిన లైసెన్స్‌ ఉండాలి. భారీ అయితే ఎల్‌ఎల్‌ఆర్‌ తప్పనిసరి. కొత్తగా కావాలంటే దరఖాస్తు సైతం చేసుకోవచ్చు. పూర్తి వివరాలు, సంబంధిత పత్రాలు అందిస్తే ప్రవేశం కల్పిస్తారు. 40 రోజుల పాటు మెలకువలు నేర్పిస్తారు. ఒక్కో అభ్యర్థీ రూ.23,600 చెల్లించాలి. ప్రక్రియ పూర్తయిన తరువాత ధ్రువపత్రం అందిస్తారు. ఆర్టీసీ ఆమోద ముద్ర ఉండడంతో దీనికి ఎంతో విలువ ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అలా చేస్తే ఇబ్బందులు తప్పవు

తస్మాత్‌ జాగ్రత్త.. డ్రైవింగ్‌ లైసెన్సు సస్పెన్షన్‌లో ఉన్నా సరే.. బండి బయటకు తీస్తున్నారా.. క్రిమినల్‌ కేసుల్లో ఇరుక్కున్నట్లే. డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారుల లైసెన్సును 3-6 నెలలపాటు ఆర్టీఏ అధికారులు రద్దు చేస్తున్న సంగతి తెలిసిందే. లైసెన్సు సస్పెన్షన్‌లో ఉన్నా సరే చాలామంది డ్రైవింగ్‌ చేస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే ఇలాంటి వారు క్రిమినల్‌ కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉందని ఆర్టీఏ అధికారులు హెచ్చరిస్తున్నారు. గతేడాది హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ పరిధిలో దాదాపు 11 వేల లైసెన్సుల వరకు రద్దు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు