Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... 

Updated : 06 Feb 2023 09:13 IST

1. రోడ్డు అడిగితే రాళ్ల దాడి

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని వైకాపాలో వర్గపోరు మరోమారు బహిర్గతమైంది. దాచేపల్లి మండలం పొందుగల పంచాయతీ శ్రీనివాసపురంలో శనివారం రాత్రి జరిగిన గడప గడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. చివరగా ఓ ఇంటి వద్దకు వెళ్లిన ఎమ్మెల్యేను వీధిలో మిగిలిన రోడ్డు వేయాలని వైకాపా నేత ఒకరు కోరారు. త్వరలో రోడ్డు వేయిస్తానంటూ ఎమ్మెల్యే వెళ్లిపోయారు. అనంతరం స్థానికులు, పార్టీ శ్రేణులు, పోలీసులు భోజనాలకు ఉపక్రమించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆర్‌బీఐ రెపో రేటు 0.25% పెంచొచ్చు

దేశీయంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం శాంతిస్తుండటం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రామాణిక వడ్డీ రేట్లపై మధ్యస్థ వైఖరి ప్రదర్శిసుండటంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్ల మేర పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 6 నుంచి ప్రారంభమయ్యే ఆర్‌బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను బుధవారం ప్రకటిస్తారు. గత డిసెంబరు పరపతి సమీక్షలో ఆర్‌బీఐ 35 బేసిస్‌ పాయింట్ల మేర రెపో రేటును పెంచి 6.25 శాతానికి చేర్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. విదేశాల్లో ఉన్న భారతీయులకు అక్కడే అమెరికా వీసా

పర్యాటకం, వ్యాపారాల నిమిత్తం వివిధ దేశాలను సందర్శిస్తూ బీ1, బీ2 వీసాలపై అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు దిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయం తీపి కబురు అందించింది. విదేశాల్లో ఉన్న భారతీయులు వారు పర్యటనలో ఉన్న దేశంలోని అమెరికా కాన్సులేట్‌ లేదా రాయబార కార్యాలయాల్లోనే వీసా అపాయింట్‌మెంట్‌ను పొందొచ్చని, దాని కోసం భారత్‌లోని కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని తెలిపింది. ఉదాహరణకు థాయ్‌లాండ్‌లో నివసిస్తున్న భారతీయులు బీ1, బీ2 వీసాపై అమెరికాకు వెళ్లాలనుకుంటే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఇద్దరి ప్రాణాలు కాపాడిన మెటా

ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు, మెటా(ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ) మధ్య ఒప్పందం.. వారం వ్యవధిలోనే ఇద్దరి ప్రాణాలను కాపాడేలా చేసింది. అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ మాత్రలు చూపిస్తూ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పెట్టింది. ఆ అమ్మాయి ఉంటున్న ప్రదేశానికి పోలీసులు కేవలం 15 నిమిషాల్లో చేరుకొని ఆమెను కాపాడారు. మరో ఘటనలో గాజియాబాద్‌కి చెందిన ఓ వ్యక్తి జనవరి 31న సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకోవడానికి సిద్ధమై.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అందుకుంటారా.. సివిల్స్‌ సవాల్‌!

అభ్యర్థుల పరిణతికీ, విస్తృత విషయ పరిజ్ఞానానికీ సవాలు విసురుతుంది సివిల్స్‌. దేశంలోనే అత్యున్నతమైన ఈ సర్వీసులకు ఎంపికవ్వాలని ఎందరో విద్యార్థులు కలలు కంటుంటారు. లక్ష్య సాధనకు తదేక దీక్షతో సంసిద్ధమవుతుంటారు. ఇప్పుడీ సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎస్‌ఈ) 2023 నోటిఫికేషన్‌ వచ్చేసింది! యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా 21 సివిల్‌ సర్వీసులకు చెందిన 1105 ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. వీటికి పోటీ పడాలంటే .. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులూ అర్హులే! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఈ వ్యసనం మీకూ ఉందా?

ఈ రోజుల్లో ఎవరిని చూసినా మొబైల్‌లోనే లీనమైపోతున్నారు. వ్యక్తిగత పనులనీ, ఆఫీస్ బాధ్యతలనీ, టైంపాస్‌ కోసమనీ.. అంతర్జాలంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాతో పాటు ఎన్నో వెబ్‌సైట్స్‌ని ఆశ్రయిస్తుంటాం. అందులో మనకు ఉపయోగపడే సమాచారమే కాదు.. మనకు అవసరం లేని వార్తలు, అవాస్తవమైన విషయాలూ మన కంట పడుతుంటాయి. వాటిని పట్టించుకోకుండా వదిలేస్తామా అంటే.. వాటి గురించే మరింత లోతుగా అన్వేషిస్తుంటాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. యాత్రకు సర్వం సిద్ధం

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సోమవారం మేడారంలో సమ్మక్క సారలమ్మ సన్నిధి నుంచి ప్రారంభించనున్న   ‘హాథ్‌సే హాథ్‌ జోడో’ తొలిదశ యాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటి రోజు మేడారం నుంచి రామప్ప వరకు దాదాపు 52 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. రేవంత్‌రెడ్డి.. హైదరాబాద్‌ నుంచి పార్టీ ముఖ్య నేతలతో కలిసి వాహనాల్లో ములుగు గట్టమ్మ, సాయిబాబా ఆలయాలకు చేరుకుంటారు. ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి మేడారం వస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అవసరమైతేనే అదనపు స్టేషన్లు

మెట్రో మొదటిదశలో స్టేషన్ల నిర్మాణ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రెండోదశ ప్రాజెక్ట్‌ డిజైన్లలో కీలక మార్పులు చేస్తున్నారు. తొలిదశలో సగటున కిలోమీటర్‌కు ఒక మెట్రోస్టేషన్‌ ఉండేలా నిర్మించారు. నిజానికి సగం స్టేషన్లకు ప్రయాణికుల ఆదరణ అంతంతమాత్రమే. కాలనీలు, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వీటిని నిర్మించారు. అయితే ఈసారి భవిష్యత్తులో ప్రయాణికుల డిమాండ్‌ ఆధారంగా అదనంగా స్టేషన్లను నిర్మించుకునేలా డిజైన్‌ చేసుకుంటే నిర్మాణ వ్యయం, నిర్వహణ ఇబ్బందులు తప్పుతాయని హెచ్‌ఎంఆర్‌ఎల్‌ భావిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఎన్నెన్నో ఆశలు.. కురిసేనా వరాలు

రాష్ట్ర పద్దుపైనే ఉమ్మడి జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. శాసనసభ ఎన్నికల ముందు చివరి బడ్జెట్‌ కావడంతో ఆర్థిక మంత్రి కురిపించే వరాలపైనే అందరి దృష్టీ పడింది. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం, పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి, కొత్త పథకాలతో సంక్షేమం పరుగులు పెట్టాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులకు మరింత దన్నుగా నిలవడంతో పాటు గత హామీలు అమలయ్యేలా కేటాయింపులుండాలని కోరుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇక సీనియర్ల వంతు

ప్రపంచకప్‌ ఎలా గెలవాలో అండర్‌-19 అమ్మాయిలు చూపించారు. ఇప్పుడు భారత సీనియర్ల వంతు వచ్చింది. మహిళల టీ20 ప్రపంచకప్‌కు సమయం ఆసన్నమైంది. ఇంకో నాలుగు రోజుల్లో ఈ మెగా టోర్నీ ఆరంభంకానుంది. అండర్‌-19 ప్రపంచకప్‌ జరిగిన దక్షిణాఫ్రికా వేదికగానే షురూ కాబోతున్న ఈ టోర్నీలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలో భారత్‌ కప్పు వేటకు సిద్ధమైంది. మరి ఈ టోర్నీ వివరాలేంటో చూద్దామా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు