Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు వచ్చేశాయ్..
దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ (JEE Main) సెషన్-1 పరీక్షల ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (NTA) విడుదల చేసింది. ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాల(JEE Main Results)ను అందుబాటులో ఉంచారు. అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. భారత్‌పై విజయం.. యాషెస్ కంటే గొప్పది!
భారత్‌లో టెస్టు సిరీస్ విజయం యాషెస్ గెలుపు కంటే గొప్పదని స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ సహా ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు అన్నారు. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ గురువారం ప్రారంభంకానుంది. ‘‘సిరీస్ సంగతి అటుంచితే భారత్‌లో టెస్టు మ్యాచ్ గెలవడమే కష్టం. ఒకవేళ ఆ పని చేయగలిగితే చాలా గొప్ప విషయమే. భారత్‌లో టెస్టు సిరీస్ గెలిస్తే యాషెస్ విజయం కంటే గొప్పదని భావిస్తున్నా’’ అని స్మిత్ తెలిపాడు. ‘‘గత యాషెస్ సిరీస్‌లో భాగమవడం అద్భుతంగా అనిపించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. అందుకే అమ్మాయిలకు గుండు.. అబ్బాయిలకు పొడవైన జుట్టు..!
మనసుకు నచ్చిన వాడు.. మంచి మనసున్న వాడు.. భర్తగా రావాలని ప్రతి అమ్మాయీ కోరుకుంటుంది. ఈ క్రమంలోనే పండగలప్పుడు ఉపవాసం ఉండడం, ప్రత్యేక పూజలు చేయడం, నోములు-వ్రతాలు చేయడం.. వంటివి కొంతమందికి అలవాటే! ఇక కాబోయే వాడికి నచ్చాలని అందం, కేశ సౌందర్యంపై ప్రత్యేక దృష్టి పెడుతుంటారు. అయితే ఆ తెగలో మాత్రం తమకు యోగ్యుడైన వరుడు భర్తగా రావాలని.. పెళ్లికి ముందే అతివలు గుండు చేయించుకుంటారట! పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. అప్పులు... రూ.4.86 లక్షల కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది తీసుకునే కొత్త రుణాలతో కలిపి మొత్తం అప్పులు రూ.4,86,302.61 కోట్లకు చేరతాయని బడ్జెట్‌లో వెల్లడించింది. ‘ద్రవ్య బాధ్యత బడ్జెట్ నిర్వహణ’(ఎఫ్‌ఆర్‌బీఎం) పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న రుణాలను బడ్జెట్‌లో చూపుతుంది. ఇవి (2022-23)లో రూ.3,22,993 కోట్లుంటే 2023-24లో రూ.35 వేల కోట్లు అదనంగా పెరిగి రూ.3,57,059 కోట్లకు చేరనున్నాయి. ఇవి కాక వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలకు పూచీకత్తు ఇచ్చినవి బడ్జెట్ వెలుపల అదనంగా ఉంటాయి. వాటితో కలిపితే మొత్తం రూ.4.86 లక్షల కోట్లకు చేరతాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ఐదేళ్లలో 42% పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
గత ఐదేళ్లలో ఎల్‌పీజీ సిలిండర్ ధర 42% పెరగ్గా, ప్రభుత్వం ప్రజలకు అందించే సబ్సిడీ మొత్తం 92% తగ్గింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియంశాఖ సహాయమంత్రి రామేశ్వర్ పలు వివరాలతో సమాధానమిచ్చారు. 2018 జనవరి 1 నాడు 14.2 కేజీల గృహావసర ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.741 ఉండగా, 2023 ఫిబ్రవరి 1 నాటికి అది రూ.1,053 (42.10%)కి చేరినట్లు కేంద్రమంత్రి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. కుమార్తె మృతదేహంతో ఇంటింటికీ తిరిగిన తల్లి
అంత్యక్రియలకు సాయం చేయాలని కోరుతూ ఓ మహిళ తన కుమార్తె మృతదేహాన్ని ఒళ్లో పెట్టుకొని రెండు రోజుల పాటు ఇంటింటికీ తిరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మహిళకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్ల క్రితం ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. భర్త చికిత్స చేయించకపోగా.. ఆమెను దూరం పెట్టాడు. పౌష్టికాహారం లేక కుమార్తె ఆరోగ్యమూ క్షీణించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. వాట్సప్ నంబరుకు ఆర్డరిస్తే.. రైళ్లలో నచ్చిన ఆహారం
రైళ్లలో ప్రయాణికులు తమకు నచ్చిన ఆహార పదార్థాలు.. నచ్చిన హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి ఆర్డరిచ్చే సౌకర్యం త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకోసం వాట్సప్ నంబరును ప్రవేశపెడుతున్నారు. ఐఆర్‌సీటీసీ ఇప్పటికే ఇ-కేటరింగ్ పేరుతో కొన్ని ఎంపిక చేసిన రైళ్లలో వాట్సప్ నంబరు 8750001323 ద్వారా ఆహారం అందజేస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా www.catering.irctc.co.in వెబ్‌సైట్, ‘ఫుడ్ ఆన్ ట్రాక్’ పేరిట యాప్‌ను అభివృద్ధి చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ఈ దేశాల్లో నిత్యం భూప్రళయాలే
భూకంపాలు రావడానికి కారణం భూ ఫలకాల కదలికలే. కొన్ని చోట్ల వీటి కదలికలు భారీ భూకంపాలు రావడానికి కారణమవుతుంటాయి. అలాంటి సున్నిత ప్రాంతాల్లో ఉన్న దేశాల్లో సంవత్సరానికి కొన్ని వందల భూకంపాలు వస్తున్నప్పటికీ.. వాటి తీవ్రత తక్కువ కావడంతో పెద్దగా నష్టం వాటిల్లదు. అలా భూప్రకంపనలు చోటుచేసుకునే తొలి ఐదు దేశాలు ఇవే.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ఐటీలో నియమకాలు.. పరిమితంగానే
సమీప- మధ్య కాలంలో దేశీయ ఐటీ సేవల పరిశ్రమ రంగ వృద్ధి నెమ్మదించవచ్చని రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా వేసింది. అమెరికా, ఐరోపా లాంటి కీలక విపణుల్లో స్థూల ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో ఐటీ కోసం వెచ్చించడం తగ్గే అవకాశం ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. 2021-22లో అధిక నియామకాలను చేపట్టడంతో.. సమీపకాలంలో ఐటీ సేవల కంపెనీల నియామకాలూ పరిమితంగానే ఉండొచ్చని వివరించింది. గత ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే గిరాకీ కూడా తగ్గుముఖం పట్టొచ్చని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. విదేశాల్లో స్కాలర్‌షిప్పులు ఎలా?
విదేశాల్లో క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్‌లో పీజీ చేయాలనుకోవడం మంచి ఆలోచన. ఇటీవలికాలంలో చాలా విదేశీ యూనివర్సిటీల్లో స్కాలర్‌షిప్‌ల సంఖ్య గణనీయంగా తగ్గింది. మనదేశం నుంచి విదేశాల్లో పీజీ చేస్తున్నవారిలో దాదాపు 90 శాతం మందికి పైగా స్కాలర్‌షిప్‌లు లేకుండానే అడ్మిషన్‌లు పొందుతున్నారు. అక్కడికి వెళ్ళిన తరువాత రెండో సెమిస్టర్ నుంచి ఏదో ఒకరకమైన ఆర్థిక సహాయాన్ని పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Kola Guruvulu: కోలా గురువులుకు మళ్లీ నిరాశే
-
Ap-top-news News
Botsa Satyanarayana: నాకు 2 మార్కులే ఇస్తామన్నారుగా: మంత్రి బొత్స
-
Crime News
Acid Attack: ప్రియుడితో వెళ్లిపోయిందని.. కోర్టులోనే భార్యపై యాసిడ్ దాడి!
-
Politics News
kotamreddy giridhar reddy: తెదేపాలోకి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి
-
World News
Tourist Visa: పర్యాటక వీసాతోనూ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు
-
Politics News
హిమంతను రాహుల్ సరిగా డీల్ చేయలేదు