Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 27 May 2023 09:37 IST

1. బ్యాంకు ఖాతాలో రూ.456 ఉన్నాయా?

మీ బ్యాంకు ఖాతాలో రూ.456 ఉన్నాయా? ఎందుకు అనుకుంటున్నారా? చాలామంది ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై) పాలసీలు తీసుకున్నారు. ఇప్పుడు ఈ బీమా పాలసీలకు ప్రీమియం చెల్లించే తరుణం వచ్చింది. బ్యాంకులు నేరుగా మీ ఖాతా నుంచి ఈ ప్రీమియాన్ని డెబిట్‌ చేసుకుంటాయి. ఈ నెల 31లోగా ఎప్పుడైనా సరే ప్రీమియాన్ని వసూలు చేస్తామని బ్యాంకులు ఇప్పటికే ఖాతాదారులకు సందేశాలు పంపిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నేడు తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ కాలపట్టిక ఖరారు

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి శనివారం కౌన్సెలింగ్‌ కాలపట్టిక(టైం టేబుల్‌) ఖరారు కానుంది. ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ సమావేశం శనివారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరగనుంది. ఆ సందర్భంగా ఛైర్మన్‌ లింబాద్రి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌, ఇతర సభ్యులు కౌన్సెలింగ్‌ తేదీలను ఖరారు చేస్తారు. డిగ్రీలో ప్రవేశాలకు ‘దోస్త్‌’ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొద్ది రోజుల క్రితమే ప్రారంభం కాగా.. జూన్‌ 16వ తేదీన తొలి విడత సీట్లను కేటాయిస్తారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నల్గొండకు వరుస కడుతున్న ఐటీ సంస్థలు

నీలగిరిలో ఐటీ హబ్‌కు ప్రారంభానికి ముందే విశేష స్పందన వస్తోంది. నల్గొండ నుంచే తమ సేవలు అందిస్తామని ఐటీ సంస్థలు వరుస కడుతున్నాయి. అందులో దిగ్గజా కంపెనీలు నీలగిరి బాటపడుతున్నాయి. దేశ, విదేశాలకు సంబంధించిన 16 కంపెనీలు ఇప్పటికే ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నాయి. తాజాగా మరో ఆరు ఐటీ సంస్థలు ఎంవోయూపై సంతకాలు చేసినట్లు అధికార వర్గాలు వెల్లాడించాయి. శుక్రవారం కెబీకే బిజినెస్‌ ప్రైవైటు సంస్థ అరుణ్‌కుమార్‌ జక్కి కూడా నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో సమావేశమయ్యారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పేరుకుపోయిన అవినీతి

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం కేసీఆర్‌ కిట్లు అందిస్తుంటే.. పలువురు జీహెచ్‌ఎంసీ సిబ్బంది సంబంధిత ధ్రువపత్రాలివ్వడంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పుట్టిన తేదీ సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు కనీసం రూ.2వేలు ఇవ్వాల్సిందేనంటూ దళారులతో బేరాలు సాగిస్తున్నారు. దళారుల్లేని దరఖాస్తులు, ముఖ్యంగా నగరంలోని వేర్వేరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులకు సంబంధించినవి 50శాతం మేర తిరస్కరణకు గురవుతున్నాయంటే దుస్థితిని అర్థం చేసుకోవచ్చు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కాఫీ ఘుమఘుమ..ప్రభుత్వ ప్రోత్సాహం మమ

అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మన్యం కాఫీపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. స్థానికంగా ప్రాసెసింగ్‌ చేసి నాణ్యమైన కాఫీ పొడి తయారు చేసి లాభాలు అందించేలా గిరిజన సహకార సంస్థ (జీసీసీ), సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) చేస్తున్న ప్రయత్నాలకు సర్కారు నుంచి ప్రోత్సాహం కరవవుతోంది. రూ. 5 కోట్ల వ్యయంతో ఐటీడీఏ గూడెంకొత్తవీధి, జి.మాడుగుల మండలాల్లో చేపట్టిన ఎకో పల్పింగ్‌ యూనిట్ల నిర్మాణాల నిధులు పక్కదారి పట్టించడంతో అవి మధ్యలోనే నిలిచిపోయాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సరిపోదు.. ఇంకా పెంచండి!!

ప్రభుత్వం జూన్‌ ఒకటో తేదీ నుంచి భూముల మార్కెట్‌ విలువ పెంచనుంది. ఇందుకు సంబంధించిన కసరత్తును సబ్‌ రిజిస్ట్రార్లు పూర్తి చేయగా... ఉన్నతాధికారులు సమీక్షించి... ధరలు ఇంకా పెంచాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఆయా ప్రాంతాల్లో మార్కెట్‌ విలువల పెంపుపై ఇప్పటికే సంయుక్త కలెక్టరు నుంచి ప్రాథమిక అనుమతి తీసుకోగా... కొన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో మరింత పెంచనున్నారు. ఫలితంగా భూముల విలువ పెరగనుంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సాఫ్ట్‌వేర్‌ టూ ఐఏఎస్‌

రూ.లక్షల్లో ప్యాకేజీ.. ఏసీలో ఉద్యోగం.. వారాంతంలో రెండ్రోజులు సెలవు.. నిర్దేశించిన పని వేళలు.. ఇంకేం కావాలి చెప్పండి.. దీనికంటే విలాసవంతమైన జీవితం ఉంటుందా..? ఇవేవీ వద్దనుకుని.. సమాజసేవే ముద్దనుకుని.. ముందడుగు వేస్తోంది యువత.. ఇంజినీరింగ్‌ విద్యార్హతతో సాఫ్ట్‌వేర్‌ కొలువులు వరించినా.. వదిలి.. పట్టుబట్టి మరీ సివిల్స్‌లో అడుగెడుతున్నారు.. స్థిరమైన గమ్యం.. కచ్చితమైన మార్గం.. రాజీలేని ధోరణితో విజయ కేతనం ఎగరవేస్తున్నారు.. ప్రజాసేవే పరమావధిగా భావిస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చల్లగా తాగి..ఆస్తమానం బాధపడొద్దు

ఎండ వేడి నుంచి ఉపశమనానికి చాలా మంది ఎక్కడ పడితే అక్కడ ఐస్‌వాటర్‌ లేదంటే ఐస్‌ కలిపిన పానీయాలు తీసుకునేందుకు ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా రోడ్డు పక్కన శుభ్రత లేని ఐస్‌ కలిపిన పానీయాల వల్ల  ఉపశమనం మాటెలా ఉన్నా.. రోగాలు కొని  తెచ్చుకున్నట్లేనని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. నిమ్మరసం, చెరుకురసం ఇతర ఫ్రూట్‌జ్యూస్‌ల్లో చల్లదనానికి ఐస్‌ చేర్చుతారు. అపరిశుభ్రమైన ఐస్‌ ఉపయోగిస్తే వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ఐస్‌ కోసం ఎలాంటి నీరు ఉపయోగిస్తున్నారనేది కూడా కీలకమే.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కట్టడిలేదు.. కట్టాల్సిందే

కొత్త విద్యా సంవత్సరం కొద్దిరోజుల్లో మొదలుకానుంది. విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు చూసి బెంబేలెత్తుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థలు బాదుడు ప్రారంభించాయి. గతేడాది కంటే 10 నుంచి 20 శాతం అదనంగా పెంచేశారు. ముంబయి, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో ఫీజులు పెంచుతున్నామంటూ యాజమాన్యాలు ప్రకటించగా.. దిల్లీలో మాత్రం హైకోర్టు ఆదేశాల మేరకు పాఠశాలలు నడుచుకోనున్నాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సైబర్‌ నేరగాళ్ల 2000 ఎత్తులు

సైబర్‌ నేరగాళ్లు ఎంత అప్‌డేట్‌గా ఉంటున్నారంటే మొన్న క్రిప్టో కరెన్సీ.. నిన్న జాబ్‌ఫ్రాడ్‌.. నేడు రెండువేల నోటు ఏవైనా తమకు అనుకూలంగా మలచుకుంటూ బురిడీ కొట్టిస్తున్నారు. పెద్దనోటును బ్యాంకుల్లో మార్చుకోవాలంటూ ఆర్బీఐ ప్రకటనతో బీరువాల్లో మూలుగుతున్న కట్టలపాములు బయటకు వస్తున్నాయి. గుట్టుగా మార్పిడి చేద్దామనుకునేవారు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నారు. అదనుకోసం ఎదురుచూస్తున్న మోసగాళ్లు దీన్ని సొమ్ము చేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు