Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

1. రూ.3 లక్షల్లో ముచ్చటైన ఇల్లు
ఒక్కో ఇంటిని 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. మొదట బేస్‌మెట్ నిర్మించి ఇనుప చువ్వలతో ప్రేమ్ ఏర్పాటు చేస్తారు. వాటి చూట్టూ సిమెంట్ మిశ్రమంతో తయారు చేసిన 75 ఎంఎం(మూడు అంగుళాల) మందం గల ఏరోకాన్ ప్యానళ్లను అమరుస్తున్నారు. దీనికి టాటా- ఏరోనాటికల్ షీట్ష్(హైదరాబాద్) వారి సాయం తీసుకుంటున్నారు. పైకప్పు రేకుల ద్వారా వేసవిలో వేడిమి నుంచి రక్షణకు పాల్‌సీలింగ్ వేస్తున్నారు. టైల్స్ ఫ్లోరింగ్, లప్పం, నల్లాలు, విద్యుత్తు, రంగులు వేసి ఆకర్షణగా మలుస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. మళ్లీ మోదీయే ప్రధాని
గడచిన తొమ్మిదేళ్లుగా సాధించిన విజయాలే 2024లో మోదీ గెలుపునకు మెట్లని భాజపా పేర్కొంది. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠ ఇనుమడించడం, జాతీయ భద్రత, ఇళ్లు, మరుగుదొడ్ల వంటి సంక్షేమ పథకాలు, పైపులద్వారా మంచినీటి సరఫరా, మౌలిక వసతుల అభివృద్ధి, తయారీ రంగానికి ప్రోత్సాహంవంటి అంశాలే తమ విజయానికి బాటలు వేస్తాయని వెల్లడించింది. 2014 మే 26వ తేదీన అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ఎంజీ గ్లోస్టర్ కొత్త వేరియంట్
ఎంజీ మోటార్ ఇండియా ప్రీమియం ఎస్‌యూవీ మోడల్ గ్లోస్టర్‌లో కొత్త బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌ను విపణిలోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.40.29 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. లెవల్-1 ఏడీఏఎస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ వ్యవస్థ)తో బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌ను తీసుకొచ్చినట్లు ఎంజీ మోటార్ తెలిపింది. 2-లీటర్ డీజిల్ పవర్‌ట్రైన్ ఇంజిన్ కలిగిన ఈ కారులో 30కు పైగా భద్రతా సదుపాయాలు ఉన్నాయని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. రిటైర్‌మెంట్‌పై నిర్ణయానికి ఇది సరైన సమయమే కానీ.. ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో ఐదు టైటిల్స్ గెలిచిన రెండో జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అవతరించింది. ముంబయిని సమం చేస్తూ రికార్డు సృష్టించింది. ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో (IPl 2023) గుజరాత్ టైటాన్స్‌ను చివరి (CSK vs GT) బంతికి ఓడించి మరీ సీఎస్‌కే విజేతగా నిలిచింది. చివరి రెండు బంతులను సిక్స్, ఫోర్‌గా కొట్టిన రవీంద్ర జడేజాను ఎత్తుకుని మరీ ధోనీ (MS Dhoni) సంబరాలు చేసుకున్నాడు. కెప్టెన్ కూల్ నాయకత్వంలో చెన్నై చిరస్మరణీయ విజయంతో కప్‌ను ఎగరేసుకుపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. గుండె ఘోష వినరా?
ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్ తరచూ చేసే ఆర్భాట ప్రకటనలు పేద రోగులకు సాంత్వన చేకూర్చడం లేదు. వైద్యులు, పారామెడికల్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని చెప్పే సీఎం.. ఆసుపత్రుల్లో సౌకర్యాలు సమకూర్చడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. శస్త్రచికిత్సలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలకు అవసరమైన పరికరాలు/యంత్రాల్లో ఒకటి ఉంటే మరొకటి ఉండవు. కన్జుమబుల్స్(వాడి పారవేసేవి) కొనుగోలుకు బడ్జెట్ ఉండడం లేదు. దీంతో ప్రభుత్వాసుపత్రుల్లో పేద రోగులకు కార్పొరేట్ వైద్యం కలగానే మిగులుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. పారిశుద్ధ్య పోస్టు @ రూ.2.50 లక్షలు
వైకాపా ప్రజాప్రతినిధులు కొందరు అవినీతిని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల పొట్టకొట్టి అందినంత దండుకోవాలని చూస్తున్నారు. జీవీఎంసీ ప్రజారోగ్య విభాగంలో 300 మంది కార్మికులను కూలి ప్రాతిపదికన దొడ్డిదారిన నియమించడం దీనికి ఉదాహరణ అని పలువురు చెబుతున్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇతరులకు అమ్ముకుంటున్నారని వాపోతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. సీఎంని చేస్తే 150 ఏళ్లు జీవించే రహస్యం చెబుతా: శరత్‌కుమార్
తనను ముఖ్యమంత్రిని చేస్తే 150 ఏళ్లు జీవించే రహస్యం చెబుతానని ఎస్‌ఎంకే అధ్యక్షుడు శరత్‌కుమార్ అన్నారు. మదురై పళంగానత్తంలో అఖిల భారత సమత్తువ మక్కల్ కట్చి 7వ బహిరంగ సభ సోమవారం జరిగింది. ఇందులో పార్టీ అధ్యక్షుడు శరత్‌కుమార్ పాల్గొని ప్రసంగించారు. మద్యం దేహాన్ని కుంగదీసి మానసిక ఒత్తిడిని కలుగజేస్తుందన్నారు. గంజాయి, గుట్కా తదితర వాటి వాడకాన్ని వేగంగా నియంత్రిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. పేదోడికి గూడు.. ఇంకెప్పుడు?
రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ విషయంలో అడుగు ముందుకు పడడం లేదు. ఇప్పటికే పూర్తయిన దాదాపు 65 వేలకు పైగా ఇళ్లను తక్షణం లబ్ధిదారులకు పంపిణీ చేయమని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కొత్త సచివాలయం ప్రారంభం సమయంలో ఈ ఫైలు మీదే సంతకం చేశారు. అధికారులు మాత్రం ఇప్పటివరకు ఒక్కరికి కూడా వీటిని పంపిణీ చేయలేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. విమానాశ్రయం.. మరింత ఆలస్యం!!
హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా, సాంస్కృతిక రాజధానిగా పేరు పొందిన ఓరుగల్లుకు విమానాశ్రయం కలగానే మిగులుతోంది. ఇదిగో అదిగో అంటూ కాలయాపనే కానీ, విమానాలు ఎగిరేందుకు మోక్షమెప్పుడు కలుగుతుందో తెలియని పరిస్థితి. తాజాగా వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలిసి మరో 253 ఎకరాల భూసేకరణ చేపట్టేందుకు అనుమతివ్వాలని కోరారు. ఇప్పుడున్న భూమికి అదనంగా సేకరణ జరిపితేనే బోయింగ్ లాంటి పెద్ద విమానాలు ఎగిరేందుకు సాధ్యమవుతుందని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ఎస్‌ఈ పోస్టుకు రూ.50 లక్షలు..! ఈఈ పోస్టుకు రూ.30-40 లక్షలు!
కీలక జిల్లా ఎస్‌ఈగా బదిలీ కావాలా? అయితే రూ.50 లక్షలు ఇవ్వాల్సిందే. ఓ సర్కిల్‌లో ఈఈగా అయితే రూ.30-40 లక్షలు. డీఈకి రూ.20-30 లక్షలు, ఏఈకి రూ.5-10 లక్షలు.. ఇవీ రహదారులు, భవనాల శాఖలో బదిలీలకు ఖరారైన రేట్లు అంటూ ఆ శాఖ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. అలా ఇవ్వడానికి సిద్ధమైనవారికి రెండు రోజుల్లోనే బదిలీ ఉత్తర్వులు ఇచ్చేలా రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. పోటీ ఎక్కువగా ఉన్నచోట.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/10/23)
-
Rathika Rose: రతికా రోజ్ ఎలిమినేట్.. బద్దలైన యువ హృదయాలు..
-
Siddu Jonnalagadda: ఆ దర్శకుడికి రావాల్సినంత గుర్తింపు రాలేదనిపించింది: సిద్ధు జొన్నలగడ్డ
-
interesting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
ముగిసిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు.. కనువిందుగా కళాకారుల ప్రదర్శనలు
-
Crime news : మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. బాధితురాలికి నా ఖాకీ చొక్కా ఇచ్చా : ఆటో డ్రైవర్