Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 02 Jun 2023 09:08 IST

1. మధుమేహం ఉన్నా టర్మ్‌ పాలసీ

మధుమేహంతో బాధపడుతున్న వారికోసం ప్రత్యేకంగా టర్మ్‌ బీమా పాలసీని బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆవిష్కరించింది. ముందస్తు మధుమేహంగల వారూ, టైప్‌-2 మధుమేహంతో బాధపడుతున్న వారూ ఈ పాలసీని ఎంచుకోవచ్చు. ‘బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ డయాబెటిక్‌ టర్మ్‌ ప్లాన్‌ సబ్‌ 8 హెచ్‌బీఏ1సీ’ ని 30-60 ఏళ్ల వారు తీసుకునేందుకు వీలుంది. 5-25 ఏళ్ల వ్యవధికి పాలసీని ఎంచుకోవచ్చు. కనీసం రూ.25 లక్షల నుంచి ఎంత మొత్తానికైనా పాలసీని తీసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మెట్రోమాయం.. మానని గాయం..!

యనకు ఎనికేపాడులో ఓ ఇంటి స్థలం ఉంది. కుటుంబ అవసరాల కోసం అమ్మకానికి పెట్టారు. మెట్రోకు భూసేకరణ చేస్తున్నారనీ.. దానికి తీసుకుంటారని ప్రచారం జరగడంతో కొనడానికి ఎవరూ ముందుకురాలేదు. 2016లో ప్రాథమిక సర్వేలో ఆయన నివాస స్థలం 445 గజాలు సేకరిస్తున్నట్లు రెవెన్యూ శాఖ ప్రకటించింది. 2017లో తుది నోటిఫికేషన్‌ ఇచ్చింది. 2016లో అక్కడ గజం.. సుమారు 1.5 లక్షలు పలికింది. భూసేకరణలో రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం పరిహారం అందుతుందని భావించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అనుకున్నట్లే.. పెంచేశారు!!

ప్రభుత్వం ప్రత్యేక సవరణ (స్పెషల్‌ రివిజన్‌) పేరుతో పెంచిన భూముల మార్కెట్‌ విలువలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఆయా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో దాదాపు 30 శాతం నివాస, వాణిజ్య ప్రాంతాల్లో విలువలు పెంచారు. కొన్నిచోట్ల పెంపు చాలా ఎక్కువగా ఉంది. తాజా పెంపు స్థిరాస్తి రంగంపై ప్రభావం చూపుతుందని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. విలువలు పెరిగినప్పటికీ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఆ వివరాలు కనిపించడం లేదు. పాతవే కనిపిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రైలెక్కాలన్నా అవస్థలే..!

టెక్కలి రైల్వేస్టేషన్‌కు చేరుకోవాలంటే ఓ ప్రయాస. అక్కడినుంచి ప్రయాణం చేయాలంటే మరింత అవస్థ. రైలు కోసం వేచి చూడాలంటే కనీస మౌలిక సదుపాయాల్లేని దురావస్థ. వెరసి రైలు నిలయంలో ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. రైల్వేస్టేషన్‌లో ప్రధానంగా ప్రయాణికులు వేచి ఉండేందుకు నిలువ నీడ లేదు. ప్లాట్‌ఫాం ఎత్తు తక్కువ కావడంతో రైలు ఎక్కేందుకు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళలకు  ఇబ్బందులు తప్పలేదు. కనీసం తాగునీటి సౌకర్యం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆ పోస్టులు ఇక ఉండవ్‌

కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) ఖాళీలు భర్తీ కానున్నాయి. ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని 33 విద్యాలయాలకు 123 మంది అధ్యాపకులు రానున్నారు. అర్హులైన వారు ఈ నెల అయిదో తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. అయితే హేతుబద్ధీకరణ, అతిథి బోధకుల తొలగింపు వంటి చర్యలతో నిరుద్యోగ అభ్యర్థినులకు కొంత నష్టం చేకూరుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఓస్‌ అదెంత.. ఆక్రమించేయ్‌.. ఇల్లు నిర్మించేయ్‌

జిల్లా కేంద్రం పార్వతీపురంలో కీలక ప్రజాప్రతినిధి అండదండలు, ప్రోత్సాహంతో ఆయన అనుచరులు ప్రభుత్వ చెరువులపై కన్నేశారు. పూర్వం నుంచి పట్టణం, శివారు పంచాయతీల పరిధిలో ఉన్న సుమారు 40కి పైగా చెరువులు, గెడ్డలను వారు మింగేస్తుండ టంతో  రూపురేఖలు కోల్పోతున్నాయి. రెవెన్యూ రికార్డుల్లో చెరువులుగా ఉన్నప్పటికీ వాటి సమీపంలోని జిరాయితీ సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అధికారులిచ్చిన నోటీసులను ఆక్రమణదారులు ఖాతరు చేయడం లేదు. పైగా  నిర్మాణాలు కొనసాగించడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. డబ్బులు ఊరికే రావు.. ఇవీ అడగండి బాబూ..

పెట్రోల్‌ కొట్టించేందుకు వెళ్తే రూ.110కిపైగా తీయాల్సిందే. డీజిల్‌ వేయిస్తే రూ.100 నోటు ఇచ్చేయాల్సిందే. కేవలం ఇంధనం కోసమే ఇంత ధర కాదండోయ్‌.. వినియోగదారులకు మరికొన్ని సదుపాయాలూ ఉన్నాయండోయ్‌.. బంకుల వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా గాలి కొట్టడం, తాగునీరు, మరుగుదొడ్లు, నాణ్యత పరిశీలన.. తదితర సదుపాయాలు కల్పించాలి. ఇవేవీ లేకపోతే సంబంధిత వ్యక్తులపై తూనికలు- కొలతల శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు. మరి మీరివి సద్వినియోగం చేసుకుంటున్నారా? ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అబ్బే.. అదేమీ పెద్ద విషయం కాదు

తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి వైకాపా సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి పిలుపొచ్చింది. దీంతో ఆయన గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాను ఆశించినట్టు భరోసా లభించిందా లేదా అనే విషయాలు స్పష్టత లేకున్నాయి. అయితే సమావేశం మాత్రం సానుకూలంగా సాగినట్టు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో స్థానం కోల్పోయినప్పటి నుంచి చోటుచేసుకుంటున్న ఘటనలతో బాలినేని తీవ్ర నైరాశ్యానికి లోనయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బంగారాన్ని సముద్రంలో విసిరేసిన స్మగ్లర్లు.. గాలించి 11 కేజీలు వెలికితీశారు!

తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది. స్మగ్లర్లు రెండు పడవల్లో శ్రీలంక నుంచి భారత్‌కు సముద్ర మార్గంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా మే 30వ తేదీన ఒక్కసారిగా అధికారులు ప్రత్యక్షమయ్యారు. దీంతో ఓ పడవలోని స్మగ్లర్లు తమవద్ద ఉన్న 11 కేజీల బంగారాన్ని రామనాథపురం జిల్లాలోని మండపం చేపల రేవువద్ద సముద్రంలో విసిరేశారు. అయితే భారత కోస్టుగార్డులు, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌, కస్టమ్స్‌ సిబ్బంది కలిసి 2 రోజులపాటు సముద్రంలో గాలించి ఆ పసిడిని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆలస్యమైతే బయట అమ్ముకోండి

ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన చెరకు నుంచి తయారుచేసిన బెల్లం కొంటామని తిరుమల తిరుపతి దేవస్థానం చెప్పడంతో భారీగా నిల్వ చేశామని, తీరా ఇప్పుడు జాప్యం చేస్తున్నారని విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన రైతులు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. బొబ్బిలి మండల పరిషత్‌ కార్యాలయం వద్ద గురువారం నిర్వహించిన రైతు భరోసా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రైతులు అట్లాడ మాధవరావు, తిరుపతిరావు, వేణు, మజ్జి శ్రీనివాసరావు తదితరులు మంత్రిని కలిసి సమస్య వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని