Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

1. నీటి కోసం నిత్యం పరుగులే
కాకినాడలోని పర్లోపేట, సంజయ్‌నగర్, దుమ్ములపేట ప్రాంతాల్లో నగరపాలక సంస్థ కుళాయిల ద్వారా పంపిణీ చేస్తున్న తాగునీరు కొద్దిరోజులుగా రంగుమారి దుర్వాసన వస్తోంది. దీనిపై ఇటీవల స్థానికులు నిరసన తెలిపారు. దీంతో అధికారులు ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నారు. సుమారు 12 వేల కుటుంబాలు ఉండే ప్రాంతాలకు ట్యాంకర్లతో అరకొర సరఫరా చేస్తుండటం జనం ట్యాంకర్ల వద్ద బారులుదీరుతున్నారు. రెండు రోజులకు ఒకసారి పంపిణీ చేస్తుండటంతో ఈ కష్టాలు తప్పడం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. గ్రూప్-1 ప్రిలిమినరీకి.. 15 నిమిషాల ముందే గేట్ల మూసివేత
రాష్ట్రంలో 503 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి ఈ నెల 11న నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తామని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. ఉదయం 10.15 గంటల తర్వాత అభ్యర్థులను ఎవరినీ అనుమతించబోమని తెలిపింది. ఈ మేరకు అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ పలు సూచనలు చేసింది. ‘‘ఓఎంఆర్ పత్రంలో ఎవరైనా తప్పులు చేస్తే, దానికి బదులుగా కొత్తది ఇవ్వబోం. ఓఎంఆర్ పత్రంలో వ్యక్తిగత వివరాలు, సమాధానాలను బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్‌తో సక్రమంగా బబ్లింగ్ చేయాలి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. శోభనం గదిలోకి పంపితే.. శవాలుగా మిగిలారు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలో దారుణం జరిగింది. 22 ఏళ్ల ప్రతాప్ యాదవ్‌కు 20 ఏళ్ల పుష్పతో మే 30న (మంగళవారం) పెద్దలు ఘనంగా పెళ్లి చేశారు. కొత్తజీవితంపై ఎన్నో ఆశలతో ఉన్న ఈ నవ యువజంటను ఆ రోజు రాత్రి శోభనం గదిలోకి పంపారు. మరుసటిరోజు ఉదయాన్నే గది తలుపులు తెరిచి చూడగా ఇద్దరూ విగతజీవులుగా మంచంపై పడున్నారు. ఇద్దరి కుటుంబాలు ఘొల్లుమన్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ ప్రశాంత్‌వర్మ మాట్లాడుతూ.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. 3 నెలల క్రితమే హెచ్చరించిన రైల్వే ఉన్నతాధికారి
రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థలో తీవ్రస్థాయి లోపాలు ఉన్నట్లు ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మూడు నెలల క్రితమే హెచ్చరించిన సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. ‘ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు’ కారణంగానే ఒడిశాలో ప్రమాదం జరిగిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రాథమికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో- ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ వైఫల్యాన్ని ఆ ఉన్నతాధికారి గతంలోనే ఎత్తిచూపిన విషయం చర్చనీయాంశమవుతోంది. నైరుతి రైల్వే జోన్ ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ తన ఉన్నతాధికారులకు ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఓ లేఖ రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. మోదీజీ.. రైల్వే రక్షణ మీద దృష్టేది?
ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. కొత్త రైళ్ల ప్రారంభంపై ఆసక్తి చూపే ప్రధాని రైల్వే రక్షణపై దృష్టి సారించడంలేదని ఆక్షేపించారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉన్నత స్థాయి నుంచి కింది వరకూ అన్ని ఉద్యోగాల్లోనూ జవాబుదారీతనాన్ని నెలకొల్పాలని వరుస ట్వీట్లలో సూచించారు. రైల్వేలో మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, చివరికి ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా భర్తీ కావలసిన ఉన్నత స్థాయి అధికారుల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. హీరో విడా వీ1 ప్రో ధర రూ.6000 పెంపు
విద్యుత్ స్కూటర్ మోడల్ విడా వీ1 ప్రో ధరను దాదాపు రూ.6000 పెంచుతున్నట్లు హీరో మోటోకార్ప్ ప్రకటించింది. జూన్ 1 నుంచి విద్యుత్ ద్విచక్రవాహనాలపై ఇచ్చే రాయితీలను ప్రభుత్వం తగ్గించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఫేమ్-2 రాయితీ, పోర్టబుల్ ఛార్జర్ కలుపుకుని విడా వీ1 ప్రో స్కూటర్ రూ.1,45,900కు లభించనుంది. పాత ధరతో పోలిస్తే ఇది దాదాపు రూ.6000 అధికం. ధరల పెంపు వార్తలను కంపెనీ డీలర్ ఒకరు ధ్రువీకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. రూ.10 కోసం పొడిచేశారు..
పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్సు ఎదురుగా ఆదివారం ఆటోడ్రైవర్‌పై ఓ వ్యక్తి కత్తితో దాడిచేసిన ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు.. కోటదుర్గ ఆలయ కూడలి వద్ద నలుగురు యువకులు కాంప్లెక్సుకు వెళ్లాలని పాలకొండకు చెందిన శ్రీనివాసరావు ఆటో ఎక్కారు. రూ.10 చొప్పున చెల్లిస్తామని ముందు బేరం కుదుర్చుకున్నారు. దిగే సమయంలో తక్కువ తీసుకోవాలని చోదకుడితో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో ఓ యువకుడు తన జేబులో ఉన్న కత్తితో శ్రీనివాసరావు పొట్టపై పొడిచేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ఆర్మీలో బీటెక్.. ఆపై ఉద్యోగం!
ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూపు విద్యార్థులు ఉచితంగా బీటెక్ చదువుకుని, లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలో చేరే అవకాశం వచ్చింది. ఇందుకు ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ దారి చూపుతుంది. జేఈఈ మెయిన్ స్కోరు ప్రకారం దరఖాస్తులు షార్ట్‌లిస్ట్ చేసి, రెండు దశల్లో వివిధ పరీక్షలు నిర్వహించి కోర్సులోకి తీసుకుంటారు. ఎంపికైనవారికి బీటెక్ కోర్సు, లెఫ్టినెంట్ కొలువులకు ఉచిత శిక్షణ ఐదేళ్లు కొనసాగుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. విలువ పెంచు.. వీలైనంత గుంజు!
అసలే భూముల కొనుగోలు అంతంత మాత్రం. రాజధాని మార్పు వ్యవహారం, మూడు రాజధానుల అంశాలు తెరమీదకు వచ్చి క్రయవిక్రయాలు చాలా తగ్గాయి. అయినా.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంచాలని ప్రభుత్వం లక్ష్యాలు పెట్టింది. దీంతో లక్ష్యసాధనకు అధికారులు సతమతం అవుతున్నారు. మరోవైపు భూముల మార్కెట్ విలువలు పెంచేశారు. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ నగరాన్ని, పట్టణ ప్రాంతాలల్లో కొన్ని మినహాయించారు. కేవలం గ్రామీణంపైనే భారం మోపుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. తుది జాబితాలోనూ తప్పులే..!
ఉపాధ్యాయ బదిలీల తుది సీనియారిటీ జాబితాలోనూ అనేక తప్పులు దొర్లాయి. ప్రొవిజనల్ జాబితాలో వచ్చిన తప్పులే తిరిగి కొందరి విషయంలో పునరావృతమయ్యాయి. ఆదివారం తుది జాబితా వెల్లడించారు. దానిని చూసి ఉపాధ్యాయులు కంగుతిన్నారు. ఎనిమిదేళ్లు నిండినట్లు ప్రొవిజనల్ జాబితాలో వచ్చినవారికి స్టేషన్ పాయింట్లు 24 రావాల్సి ఉండగా సీనియారిటీ జాబితాలో అలా మార్కులు రాలేదు. కొందరికి తగ్గాయి. పదోన్నతులకు నాట్ విల్లింగ్ ఇచ్చినా పదోన్నతి తీసుకున్నట్లు చూపడం.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: సెల్‌ఫోన్ పోయిందని.. యువకుడి ఆత్మహత్య
-
S Jaishankar: జీ20 సారథ్యం ఆషామాషీ కాదు.. పెను సవాళ్లను ఎదుర్కొన్నాం: జైశంకర్
-
అవకాశం దొరికిన ప్రతిసారీ బ్రిజ్ భూషణ్ వేధింపులకు పాల్పడ్డాడు: దిల్లీ పోలీసులు
-
Vivek Agnihotri: నా సినిమాకు వ్యతిరేకంగా డబ్బులు పంచుతున్నారు: వివేక్ అగ్నిహోత్రి తీవ్ర ఆరోపణలు
-
Russia: పశ్చిమ దేశాలు నేరుగా రష్యాతో యుద్ధంలో ఉన్నాయి: సెర్గీ లవ్రోవ్
-
Motkupalli: జగన్.. నీ విధానాలు చూసి జనం నవ్వుకుంటున్నారు: మోత్కుపల్లి