Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

1. దీర్ఘకాలిక కొవిడ్‌తో క్యాన్సర్‌ను మించి ఇబ్బందులు
దీర్ఘకాల కొవిడ్ బాధితుల ఆరోగ్యంలో చాలా మార్పులు వస్తున్నాయని, ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది. ఈ మేరకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ కేర్ రీసెర్చ్ (ఎన్‌ఐహెచ్‌ఆర్) జర్నల్‌లో కథనం ప్రచురితమైంది. అధ్యయనంలో భాగంగా దీర్ఘకాలం కొవిడ్‌తో బాధపడిన 3,750 మంది రోగులపై యూనివర్సిటీ కాలేజ్ లండన్(యూసీఎల్), యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్‌కి చెందిన వైద్యులు పరిశోధనలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. పల్నాట సెప‘రేటు’
మద్యం వల్ల మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి.. తాగుడు వ్యసనం కాపురాల్లో చిచ్చురేపుతోంది.. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తాం. దీనివల్ల లక్షలాది కుటుంబాల్లో వెల కట్టలేని సంతోషం నింపుతాం.. ప్రభుత్వమే మద్యం దుకాణాలు తెరిచి విక్రయాలు చేస్తోంది. వైకాపా నేతల ఆధ్వర్యంలో గ్రామగ్రామాన బెల్టు దుకాణాలు తెరిచి అనధికారికంగా విక్రయాలు చేస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలకు వచ్చే మద్యాన్ని దారి మళ్లించి నేరుగా పల్లెల్లోని బెల్టుషాపులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. దయచేసి వినండి.. దొంగలతో జాగ్రత్త!
ఇలాంటి సంఘటనలు రైళ్లలో నిత్యకృత్యంగా మారాయి. వేసవిలో రైళ్లలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. పిల్లలకు సెలవులు కావడంతో పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. సుదూర ప్రాంతాలకు విహార యాత్రలకు వెళ్లే వారూ రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారు. దూర ప్రాంతాలకు ప్రయాణించే వారే లక్ష్యంగా దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏటా వీటి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది జీఆర్పీ ఉన్నతాధికారులు దొంగతనాల నియంత్రణకు నడుం బిగించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ఖమ్మంపై కమలం గురి
శాసనసభ ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ.. పార్టీ బలోపేతమే లక్ష్యంగా కాషాయ దళం అడుగులు వేస్తోంది. మహాజన్ సంపర్క్ అభియాన్ పేరిట భాజపా అగ్రనేతలు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఈనెల 15న ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నారు. అమిత్‌షా తొలిసారి ఖమ్మం వస్తుండటంతో ఆపార్టీ ఉభయ జిల్లాల నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. రెండో కాన్పులో అమ్మాయి పుడితే రూ.6వేలు
అమ్మాయిలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘మిషన్ శక్తి’ కింద కొత్త పథకానికి రూపకల్పన చేసింది. రెండోసారి గర్భం దాల్చినప్పుడు ఆడపిల్ల పుడితే అర్హులైన వారికి రూ.ఆరు వేలు ఆర్థిక సాయంగా అందజేయనుంది. 2022 ఏప్రిల్ నుంచే దీన్ని వర్తింపజేస్తారు. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన (పీఎంవీవై) కింద తొలి కాన్పులో ఆడ లేదా మగ బిడ్డ పుట్టినప్పటికీ మూడు దశల్లో రూ.5వేలు చెల్లిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ఈ-ఆటోల తరలింపు ఎలా?.. తల పట్టుకున్న అధికారులు
సీఎం జగన్ ఈ-ఆటోలను ప్రారంభించిన వెంటనే ఆయా పట్టణాలకు తీసుకెళ్లిపోవాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు తొలుతే ఆదేశాలు జారీ చేయడంతో పురపాలక సంస్థలు, నగర పంచాయతీల కమిషనర్లు, సిబ్బంది సుమారు వెయ్యి మందికి పైగా గురువారం ఉదయమే తాడేపల్లికి చేరుకున్నారు. తాడేపల్లి నుంచి 60-80 కి.మీ.కంటే ఎక్కువ దూరం వెళ్లాల్సిన వాహనాలను శుక్రవారం ట్రాలీల్లో పంపుతామని అధికారులు మొదట చెప్పడంతో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన సిబ్బంది తిరుగు ప్రయాణమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. సప్లిమెంటరీలో ఫెయిల్ అయినా మళ్లీ తరగతులకు వెళ్లొచ్చు
పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలతోపాటు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు మళ్లీ చదువుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విద్యార్థులు పాఠశాల, కళాశాలలకు వెళ్లి చదువుకోవచ్చని, అయితే, అన్ని సబ్జెక్టులూ చదవాల్సి ఉంటుందని వెల్లడించారు. సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైతే కంపార్ట్‌మెంటల్ అని ఇస్తుండగా.. మళ్లీ బడికి వెళ్లి మొత్తం సబ్జెక్టులు చదివితే రెగ్యులర్‌గా ఉత్తీర్ణులైనట్లు పరిగణిస్తారని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. కాంగ్రెస్ గూటికి పొంగులేటి?
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ పయనంపై స్పష్టత వచ్చినట్లు కనిపిస్తోంది. ఖమ్మంలో శుక్రవారం ఉదయం అల్పాహార విందు భేటీకి హాజరుకావాలని మండలాల వారీగా ముఖ్య నాయకులకు సమాచారం చేరవేశారు. ఈ సందర్భంగా ఏ పార్టీలో చేరాలన్న నిర్ణయాన్ని వెల్లడిస్తారని తెలిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఆయన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో ముఖ్యనాయకులు, అనుచరుల్లో అత్యధిక మంది కాంగ్రెస్‌లో చేరాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. వచ్చే విద్యా సంవత్సరంలో 88 సెలవులు
నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 12 నుంచి బడులు తెరుచుకోనుండగా.. పాఠశాల విద్యాశాఖ 2023-24 అకడమిక్ కేలండర్‌ను గురువారం విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలలు 229 రోజులు పని చేయనుండగా అన్ని రకాలు కలిపి 88 సెలవులు ఉన్నాయి. ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. తిరుమల గగనతలంలో విమానాలు
తిరుమల శ్రీవారి ఆలయ సమీపం నుంచి గురువారం ఉదయం 7.45, 8.00, 8.22 గంటలకు వరుసగా 3 విమానాలు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియడం లేదు. ఈ ఘటనపై తితిదే భద్రతాధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఆగమశాస్త్రం ప్రకారం తిరుమల పైనుంచి విమానాలు వెళ్లకూడదు. దీనిపై గతంలో తితిదే కేంద్ర పౌర విమానయానశాఖ దృష్టికి తీసుకెళ్లింది. అయితే.. ఆ నిబంధన అమలు చేయడం వీలుకాదని అప్పట్లో ఆ శాఖ తెలిపినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
Vizag: సిగరెట్ కోసం స్నేహితుడినే హతమార్చారు!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/09/2023)