Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. వందే వినాయకీ!
లోక కల్యాణార్థం అనేక పురుష దేవుళ్లు స్త్రీరూపం దాల్చినట్లు పురాణాల్లో కనిపిస్తుంది. వినాయకుడు కూడా సుయుక్ష అనే రాక్షసిని సంహరించేందుకు మహిళా రూపంలో అవతరించాడనే ప్రచారం ఒకటి ఉంది. అలానే, పరమేశ్వరుడు అంధకాసురుడిని వధించే సమయంలో ఆ అసురుడి రక్తబిందువులు దేవతలపై పడి, ఆయా పురుష దేవతల నుంచి స్త్రీ రూపాలు ఉద్భవించాయనీ, అలా వినాయకుడి నుంచి వినాయకి అవతరించిందనీ మరో కథనం చెబుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. హామీలే.. ఏమీలే..!
ఆధ్యాత్మిక, శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశవిదేశాల్లో కీర్తి గడించిన జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టిసారించట్లేదన్న విమర్శలున్నాయి. స్వర్ణముఖి నదిపై కూలిన వంతెనలు శాశ్వత ప్రాతిపదికన నిర్మాణం మొదలు తిరుమల, తిరుపతి ప్రజల దాహార్తి తీర్చేందుకు నిర్మిస్తున్న జీఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టు వరకు ఒక్క అడుగు ముందుకు పడని దుస్థితి నెలకొంది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. జగన్ పటారం.. చెరువు లొటారం!
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోని 68 చెరువులకు నీరిచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 19న ప్రారంభించబోతుండటంపై పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. 68 చెరువులకు సంబంధించి కొన్నిచోట్ల ఇంకా పైపులైన్లు వేయకుండానే ప్రాజెక్టును ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుండటంపై రైతులు విస్తుపోతున్నారు. కొన్ని చెరువుల వద్ద పనుల జాడే లేకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. చిన్నారిపై దాడి చేసినవి ఈ చిరుతలు కాదు.. అందుకే వాటిని విడిచిపెట్టేశాం: డీఎఫ్‌వో వెల్లడి
తిరుమల నడకదారిలో గతనెల చిరుత దాడిలో మృతిచెందిన బాలిక డీఎన్‌ఏ రిపోర్టును ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ సంస్థ విడుదల చేసినట్లు తిరుపతి డీఎఫ్‌వో సతీష్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ నివేదిక ప్రకారం దాడి చేయలేదని తెలియడంతో రెండు చిరుతలను విడిచిపెట్టామన్నారు. చిన్నారిపై దాడి అనంతరం తితిదే, అటవీశాఖ నాలుగు చిరుతలను బోనులో బంధించాయి.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. మిడ్‌మానేరుపై రోడ్ కం రైలు వంతెన!
హైదరాబాద్ నుంచి కరీంనగర్‌ను కలిపేలా మనోహరాబాద్-కొత్తపల్లి రైలుమార్గంలో మిడ్‌మానేరుపై రోడ్ కం రైలు వంతెన నిర్మాణం జరిగేలా చూడాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఆలోచనని రైల్వేశాఖ దృష్టికి తీసుకెళ్లింది. ఇటీవలే గజ్వేల్ నుంచి సిద్దిపేట వరకు నిర్మాణం పూర్తయిన ఈ లైన్‌పై అడపాదడపా గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. మరోవైపు సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు భూసేకరణ పూర్తి కావడంతో నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ఎంసెట్ బైపీసీ చివరి విడత కౌన్సెలింగ్ ప్రారంభం
ఎంసెట్ బైపీసీ విద్యార్థులు బీ ఫార్మసీ, ఫార్మా డి తదితర కోర్సుల్లో చేరేందుకు చివరి విడత కౌన్సెలింగ్ ఆదివారం ప్రారంభమైంది. తొలి విడత కౌన్సెలింగ్ కన్వీనర్ కోటాలో రెండు కోర్సుల్లో కలిపి 9,362 సీట్లు అందుబాటులో ఉండగా.. వాటిలో 9,168 భర్తీ అయ్యాయి. 194 సీట్లు మిగిలిపోయాయి. అయితే సీట్లు పొందిన వారు రిపోర్టింగ్ చేయకపోవడంతోపాటు కాకతీయ వర్సిటీ, జేఎన్‌టీయూహెచ్ మరికొన్ని కళాశాలల్లో సీట్లకు అనుమతి ఇచ్చింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ప్రజాస్వామ్య మూలనిధి.. చరిత్రలో మైలురాయి
వర్తులాకారంలో, నిలువెత్తు రాతి స్తంభాలతో, గంభీరంగా, హుందాగా కనపడే మన పార్లమెంటు భవనానిది 96 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర. వలసవాద పాలనను, రెండో ప్రపంచ యుద్ధాన్ని, స్వాతంత్య్రం సిద్ధించిన ఘటనను, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన క్షణాలను.. తదనంతరం ఎన్నో ఘట్టాలను ఈ భవనం మౌనసాక్షిలా వీక్షించింది. రాజ్యాంగం పురుడుపోసుకోవడం నుంచి ఎన్నో శాసనాలను చూసిన భవనమిది. ఇందులో కొన్ని చరిత్రాత్మకమైనవి, మరికొన్ని వివాదాస్పదమైనవి.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. నేనొస్తే.. హెచ్-1బీ లాటరీ విధానాన్ని తొలగిస్తా: వివేక్ రామస్వామి
అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ నేత, భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి హెచ్-1బీ వీసాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వస్తే.. ఈ వీసాల జారీలో లాటరీ విధానానికి స్వస్తి పలికి ప్రతిభ ఆధారిత విధానాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుత విధానంలో వీసాలు స్పాన్సర్ చేసే కంపెనీకే ఎక్కువ లబ్ధి కలుగుతోందని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. విద్యార్థిని కిడ్నాప్, గ్యాంగ్‌రేప్.. ఫొటోలు తీసి బెదిరింపులు
పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఓ కళాశాల విద్యార్థినిని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి, అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ తర్వాత మొబైల్‌తో ఆమె ఫొటోలు తీసి.. ఎవరితోనూ చెప్పొద్దని బెదిరించారు. బాధితురాలు పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం.. మందిర్ బజార్ ప్రాంతంలో గురువారం ఉదయం ఈ నేరం జరిగింది. బ్యాంకుకు వెళ్లిన యువతిని కిడ్నాప్ చేసిన దుండగులు సికందర్‌పుర్ జంక్షనులో ఎవరూ లేని ఓ ఇంట్లోకి తీసుకువెళ్లి దారుణానికి పాల్పడ్డారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. బద్వేలు వైకాపాలో తిరుగుబావుటా
బద్వేలు నియోజకవర్గ వైకాపా నేతలు పలువురు తిరుగుబావుటా ఎగురవేశారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డితో కలిసి పని చేసే ప్రసక్తేలేదని తేల్చారు. వందలాదిగా సమావేశమైన అసమ్మతి నేతలకు ఎమ్మెల్సీకి స్వయాన బామ్మర్ది, కాశినాయన మండల వైకాపా కన్వీనర్ విశ్వనాథరెడ్డి, సోదరుడు, కాశినాయన జడ్పీటీసీ సభ్యుడు సత్యనారాయణరెడ్డి నేతృత్వం వహించడం విశేషం.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
PM Modi: మహబూబ్‌నగర్ చేరుకున్న ప్రధాని మోదీ
-
PM Modi: చీపురు పట్టి.. చెత్తను ఎత్తి.. ప్రధాని మోదీ శ్రమదానం!
-
Team India: అప్పుడు యువీ.. మరి ఇప్పుడు
-
Chandrababu: చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ కర్ణాటకలో భారీ బైక్ ర్యాలీ
-
Indigo: హైదరాబాద్ నుంచి బయల్దేరిన విమానంలో ప్రయాణికుడి వింత ప్రవర్తన.. ఏం చేశాడంటే?
-
దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళ మృతి