Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 19 Sep 2023 10:01 IST

1. ఉదయాన్నే ఫోన్‌ చూస్తున్నారా...

ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ కూడా అందరి పనులూ ఫోనులతోనే. అయితే, ఈ వాడకం మితిమీరితే ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఒత్తిడి పెంచవచ్చు: ఉదయం పూట తమ ఫోన్‌లో నోటిఫికేషన్‌లు, ఈ-మెయిల్‌లు, సోషల్‌ మీడియా అప్‌డేట్‌లలో వచ్చే సందేశాల వల్ల అనవసర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీ మనసులో ప్రతికూలతలు పెరిగి రోజంతా ఆ ప్రభావం కనిపించొచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కేబినెట్‌ కీలక నిర్ణయం.. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్రం ఆమోదం!

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు (Womens Reservation Bill) కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీలో ఈ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ ట్వీట్‌ చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నటుడు విజయ్‌ ఆంటోనీ కుమార్తె ఆత్మహత్య

నటుడు, ‘బిచ్చగాడు’ ఫేమ్‌ విజయ్‌ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె లారా (16) ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని నివాసంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఉదయాన్నే ఇంట్లో వాళ్ళు చూసేసరికి ఆమె ఉరేసుకుని కనిపించగా.. వెంటనే హాస్పిటల్​కు తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. జ్యుడీషియల్‌ రిమాండ్‌ ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్‌లో చంద్రబాబు కోరిన విషయం తెలిసిందే. చట్టవిరుద్ధంగా అరెస్ట్‌ చేశారంటూ చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పెళ్లి కాలేదంటే.. అంతే ఇక!

రాముడు, శివుడు, కృష్ణుడు.. అందరినీ సతీసమేతంగా పూజిస్తాం. మన సంస్కృతిలో ఏ కార్యక్రమాలైనా.. ఆలుమగలు కలిసి నిర్వర్తించాలనే నియమం ఉంది. జీవితంలో పెళ్లికి అంత ప్రాముఖ్యముంది. ధర్మానుచరణలో ఒకరికొకరు తోడూనీడగా ఉండాలనేదే అంతరార్థం. వైవాహిక జీవిత ఆవశ్యకతను చాటుతూ డెన్మార్క్‌లో ఒక చిత్రమైన ఆచారం ఉంది. పాతికేళ్లు నిండినా.. ఇంకా పెళ్లి కాలేదంటే..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నిబంధనలకు విరుద్ధంగా తిరుమల శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించిన కొడాలి నాని

6. చిన్నశేష వాహనంపై విహరించిన మలయప్పస్వామి

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం చిన్నశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి విహరించారు. వాహన సేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. చిన్నశేష వాహనం పైనుంచి స్వామి వారు భక్తులకు అభయ ప్రదానం చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రాజ్‌ఘాట్‌లో నారా లోకేశ్‌ సహా తెదేపా నేతల మౌనదీక్ష

దిల్లీలో మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్‌లో తెదేపా నేతలు నివాళులర్పించారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో ఆ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు, పలువురు ముఖ్యనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నల్లబ్యాడ్జీలు ధరించి తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ అక్కడే మౌనదీక్ష చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆసీస్‌తో వన్డే సిరీస్.. టీమ్‌ఇండియాలోకి రవిచంద్రన్ అశ్విన్

 ప్రపంచకప్‌ ముంగిట ఆసియా కప్‌ను దక్కించుకుని ఫుల్‌ జోష్‌లో ఉన్న టీమ్‌ఇండియా (Team India) మరో సిరీస్‌తో అభిమానులను అలరించనుంది. సెప్టెంబరు 22 నుంచి భారత్‌, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య మూడు వన్డేల సిరీస్‌ జరగనుంది. ఈ సిరీస్‌ కోసం అజిత్ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ టీమ్‌ఇండియా జట్టును ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భూమికి బై.. బై.. ఆదిత్య ఎల్‌-1లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం

సూర్యుడి(Sun) రహస్యాలను శోధించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO) చేపట్టిన తొలి మిషన్‌ ఆదిత్య ఎల్‌-1(Aditya L1) ప్రయోగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇస్త్రో శాస్త్రవేత్తలు ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహ కక్ష్యను పెంచి సూర్యుడి దిశగా ట్రాన్స్‌-లగ్రేంజియన్‌ పాయింట్‌-1(Trans-Lagrangian Point 1) దిశలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కొత్త పార్లమెంట్ భవనం.. విశేషాలివే!

చట్టసభలు అంటే ప్రజాస్వామ్య దేవాలయాలు. ప్రజల వాణిని వినిపించే వేదికలు. ఆ భవన నిర్మాణ రూపాలు స్మరణకు వచ్చినంతనే దేశం పట్ల గౌరవాన్ని ఇనుమడింపజేసే కట్టడాలు. అలాంటి చట్టసభల చరిత్రలో భారత్‌లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. పార్లమెంటు సమావేశాలు ఇక శాశ్వతంగా కొత్తగా నిర్మించిన భవనం (Parliament New Building)లోనే జరగనున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని