Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండు
నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో అరెస్టైన చంద్రబాబుకు న్యాయస్థానం విధించిన జ్యుడీషియల్ రిమాండు శుక్రవారంతో ముగియనుంది. దీంతో తదుపరి ఆదేశాల కోసం ఆయన్ను విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఎదుట వీడియో కాన్ఫరెన్స్ విధానంలో నేడు హాజరు పరచనున్నారు. మరోవైపు చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజే తీర్పు వెలువడనుంది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. అప్పులు చేసి మరీ.. ఆస్తులు కొంటున్నారు!
దేశంలో కుటుంబాల నికర ఆర్థిక పొదుపు 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 55 శాతం క్షీణించినట్లు ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. ఇది స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 5.1 శాతానికి సమానమని వెల్లడించింది. మరోవైపు కుటుంబాల రుణ భారం 2020-21 నుంచి రెండింతలు పెరిగి రూ.15.6 లక్షల కోట్లకు చేరినట్లు పేర్కొంది. ఇందులో బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకున్నట్లు విశ్లేషించింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. టీఆర్‌టీ సిలబస్‌లో స్వల్ప మార్పు
జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా పాఠశాల విద్య కోసం కేంద్ర విద్యాశాఖ రూపొందించిన కొత్త కరిక్యులమ్‌ను ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్ టీ)లో చేర్చారు. అంటే దానిపై కూడా ప్రశ్నలు అడగనున్నారు. నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్-2023 (ఎన్‌సీఎఫ్‌ఎస్‌ఈ) పేరిట తయారు చేసిన నివేదికను ఆగస్టు 23న కేంద్రం విడుదల చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. అర్ధరాత్రి నగరంలో కుండపోత
హైదరాబాద్‌లో గురువారం అర్ధరాత్రి భారీ వర్షం పడింది. సోమాజిగూడ, ఖైరతాబాద్, నాంపల్లి, మెహిదీపట్నం, అత్తాపూర్, అమీర్‌పేట, అబిడ్స్, నారాయణగూడ ప్రాంతాల్లో కుండపోతగా కురిసింది. దాదాపు 45 నిమిషాలపాటు ఏకధాటిగా కురిసింది. వినాయక నిమజ్జనాలకు వచ్చిన వాహనాలు వానలో చిక్కుకున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. వాళ్లెందుకు బౌలింగ్ చేయరంటే!
సచిన్, సెహ్వాగ్, గంగూలీ, యువరాజ్.. ఇలా ఒకప్పుడు భారత్‌కు మంచి పార్ట్‌టైమ్ బౌలర్లు ఉండేవాళ్లు. బంతితో జట్టుకు ఎంతో ఉపయోగపడేవాళ్లు. కానీ ప్రస్తుత జట్టులో బ్యాటర్లెవరూ బౌలింగ్ చేయట్లేదు. ఫీల్డింగ్ నిబంధనల్లో మార్పే ఇందుకు కారణమని అంటున్నాడు టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్. బ్యాటర్లు ఎందుకు బౌలింగ్ చేయట్లేదన్న ప్రశ్నకు అతడు బదులిచ్చాడు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. అప్పు ‘ముప్పు’
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు నిరంతరం సవాళ్లతోనే సాగుతున్నాయి. అప్పుల నుంచి బయట పడేందుకు మరిన్ని అప్పులు చేయాల్సి వస్తోంది. వడ్డీలు చెల్లించేందుకు రుణాలు సమీకరించాల్సి వస్తోంది. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సుల (చేబదుళ్లు) పరిమితి దాటిపోతుండటంతో ఆ మొత్తాలు చెల్లించి బయటపడేందుకు కూడా ఆర్థిక శాఖ అధికారులు నానాతిప్పలు పడుతున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. కొట్టినా ఇష్టమే.. ప్రశ్నిస్తే సహించలేమంతే
అక్రమార్కులపై చర్యలుండవు. అవినీతి ఆరోపణల్ని అస్సలు పట్టించుకోరు. భూ కబ్జాలకు పాల్పడటం, దురాక్రమించటం ఆ పార్టీలో అసలు నేరాలే కావు. అదే అవినీతిపై ప్రశ్నిస్తే.. తమ వాళ్లు చేసే తప్పులను ఎత్తి చూపితే మాత్రం సహించలేరు. అటువంటి వారిని ఏకంగా పార్టీ నుంచే పంపించేస్తారు. ఈ విచిత్ర రాజకీయం వైకాపా నాయకులు, శ్రేణుల్లో ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. సగటు పౌరులు ముక్కున వేలేసుకుని విస్తుపోయేలా చేస్తోంది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. రాజన్నకు కాసుల శ్రావణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామికి శ్రావణ మాసం కాసుల వర్షం కురిపించింది. ఆలయంలోని వివిధ విభాగాల ద్వారా స్వామివారికి రూ.8.63 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది భక్తులు ఎక్కువగా రావడంతో ఆదాయం కూడా పెరిగింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. విక్రమ్, ప్రజ్ఞాన్‌లకు మేలుకొలుపు!
జాబిల్లిపై పరిశోధనల కోసం ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-3 ప్రయోగాన్ని దిగ్విజయంగా చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఉత్కంఠభరిత సవాలుకు సన్నద్ధమవుతోంది. తమకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తిచేసి చందమామ ఒడిలో నిద్రాణ స్థితిలోకి వెళ్లిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను తిరిగి క్రియాశీలంగా మార్చేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించనున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. భయపెడుతున్న రష్యా- ఉత్తర కొరియా బంధం
రష్యా, ఉత్తర కొరియా అధ్యక్షుల మధ్య ఇటీవల జరిగిన సమావేశం, ఆ రెండు దేశాల మధ్య కుదిరే సహకారంపై దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ప్రపంచ నేతలను హెచ్చరించారు. ఆ రెండు దేశాల మధ్య సంబంధం ఉక్రెయిన్ శాంతి భద్రతలనే కాకుండా దక్షిణ కొరియాను భయపెడుతోందన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గ్రానైట్‌పై విద్యుత్తు పిడుగు
‘బాపట్ల జిల్లా మార్టూరులో 400, బల్లికురవలో 200, సంతమాగులూరులో 90, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 120, ప్రకాశం జిల్లాలో 800 వరకు గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి.’ -
‘అన్ని మండలాల్లోనూ కరవు’
జిల్లావ్యాప్తంగా తీవ్ర దుర్భిక్షం నెలకొందని, తక్షణం అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. స్థానిక సుందరయ్య భవన్లో గురువారం సీపీఎం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/12/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.