Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. ఆ అధికారికి ఎన్నికళలో..
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) విధివిధానాలకు లోబడి జిల్లా నుంచి బదిలీ అయిన ఓ అధికారిని తిరిగి జిల్లాలోనే మరింత ప్రాధాన్యం కలిగిన పోస్టులో కూర్చోబెట్టడం చర్చనీయాంశమవుతోంది. ప్రభుత్వంలోని ఉన్నతాధికారుల స్థాయిలో వ్యూహాత్మకంగా తెరవెనక చక్రం తిప్పింది ఎవరు? అనేది ప్రాధాన్యాంశంగా మారుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. లైఫ్ జాకెట్ లేకుండానే 15 కి.మీ. ఈత
ఉత్తరాఖండ్‌కు చెందిన తండ్రి, ఇద్దరు కుమారులు 15 కిలోమీటర్లు ఈత కొట్టి తమ పేరిట ఉన్న రికార్డును వారే బద్దలు కొట్టారు. లైఫ్ జాకెట్ ధరించకుండానే వారు స్విమ్మింగ్ చేయడం విశేషం. సాహస క్రీడలను ఇష్టపడేవారి కోసం ఏటా తెహ్రీ డ్యామ్‌లో ప్రత్యేక స్విమ్మింగ్ పోటీలను నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే తెహ్రీ జిల్లా మోత్నా గ్రామానికి చెందిన త్రిలోక్ సింగ్ రావత్(50), ఆయన కుమారులు రిషభ్ రావత్(20), పరస్వీర్ రావత్(17) ఈ పోటీల్లో పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. కుభీరు ఉత్సవాలకు 119 ఏళ్లు!
దేశ స్వాంతంత్య్రం కోసం పోరాడుతున్న ఉద్యమ కాలమది. భారతీయులు ఐక్యం కాకూడదనే కుట్రలతో ఆంగ్ల పాలకులు ఎక్కడికక్కడ ఆంక్షలు ఉండేవి. అదే సమయంలో భారతీయులను ఏకతాటికి తీసుకొచ్చి పోరాటాన్ని ఉద్ధృతం చేసేందుకు జాతీయ నాయకులు కృషి చేస్తున్నారు. అప్పట్లో తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతంలోని 16జిల్లాలు నిజాం నవాబు పాలనలో ఉండేవి.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ఎన్నికలే ఎజెండాగా.. నేడు వైకాపా విస్తృతస్థాయి సమావేశం
ఎన్నికలకు సిద్ధమవడమే ఎజెండాగా వైకాపా విస్తృతస్థాయి సమావేశాన్ని మంగళవారం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల బాధ్యులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షులు, జగనన్న గృహ సారథుల సమన్వయకర్తలతో ఈ భేటీ నిర్వహించనున్నారు. రాబోయే ఎన్నికలకు కార్యాచరణను ప్రకటించనున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. దమ్ముంది.. కానీ కలిసి రావాలి!
దక్షిణాఫ్రికా.. ప్రపంచకప్.. దురదృష్టం.. ఈ మూడూ విడదీయలేని పదాలు. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అదరగొట్టి మంచి అంచనాలతో ప్రపంచకప్‌లో అడుగు పెట్టే ఆ జట్టు.. అక్కడ మాత్రం సత్తా చాటలేకపోతుంటుంది. కొన్నిసార్లు చేజేతులా ఓటమి కొనితెచ్చుకుంటుంది. కొన్నిసార్లు దురదృష్టం వెంటాడుతుంది. ఎలాగైనా సరే.. మధ్యలో ఆ జట్టు ప్రయాణం ఆగిపోవడం మామూలే! ఈసారి ఆ జట్టుపై మరీ అంచనాలేమీ లేవు. అండర్‌డాగ్‌లా కప్పులో అడుగు పెడుతున్న సఫారీ జట్టు ఈసారి ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. పండ్లు ఎలా తింటున్నారు?
ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరానికి కావాల్సిన విటమిన్లు, పోషకాలు అందిస్తాయి.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.. ఇలా చాలా కారణాలతో పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటాం. ఆ ప్రయోజనాలు అందాలంటే సరైన పద్ధతిలో తినాలి కదా మరి?పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఈ కోర్సులపైనా.. ఓ కన్నేయండి!
టెక్నాలజీ ఎంత కొత్తగా మారుతున్నా టాప్‌లో మాత్రం కొన్నే ఉంటాయి. వాటిలో వచ్చే మార్పులను అందిపుచ్చుకోవడంలోనే మన కెరియర్ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఐటీలో రాణించాలనుకునే విద్యార్థులు నిత్యనూతనంగా అభివృద్ధి చెందుతున్న ఇటువంటి టెక్ కోర్సులను పరిశీలించవచ్చు. మేటి అవకాశాల కోసం వీటిని ఉపయోగించుకోవచ్చు. అవేంటో ఒకసారి చూస్తే..పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. క్యాన్సర్ మందుతో హెచ్‌ఐవీ నయం!
ఎయిడ్స్‌కు దారితీసే హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌ను నయం చేయటం ఇంకెంతో దూరంలో లేదా? అదీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందుతోనే నయమవుతుందా? ఆస్ట్రేలియాలోని వాల్టర్ అండ్ ఎలీజా హాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (డబ్ల్యూఈహెచ్‌ఐ), డోహర్టీ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకుల అధ్యయన ఫలితాలు ఇది సాధ్యమేనని చెబుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ఏసీ వేసుకుని నిద్రపోయిన డాక్టర్.. చలికి ఇద్దరు నవజాత శిశువుల మృతి
ఓ వైద్యుడి నిర్లక్ష్యం ఇద్దరు నవజాత శిశువుల ప్రాణాలు బలితీసుకుంది. హాయిగా నిద్రపోవడానికి డాక్టర్ ఏసీ వేసుకోగా.. ఆ చలికి తట్టుకోలేక ఇద్దరు శిశువులు మరణించారు. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని శామలి జిల్లాలో జరిగింది. దీనికి కారణమైన డాక్టర్ నీతును పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కైరాణా ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఇద్దరు పిల్లలు జన్మించారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. నిమజ్జనానికా.. ఒక్క క్షణం!
తొమ్మిది రోజులు వైభవంగా మీ నుంచి పూజలందుకున్న నేను బుధవారం తల్లి గంగమ్మ ఒడికి తిరిగి వెళ్తున్నాను. మీరు చూపిన భక్తి నాకెంతో సంతోషం కలిగించింది. ఆ ఆనందంతో చెబుతున్నా.. నన్ను నిమజ్జనం చేసే నీటి వనరుల వద్ద జాగ్రత్తగా ఉండండి. ఈసారి మీ ఓరుగల్లులో విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు, వాగులు నిండుకుండను తలపిస్తున్నాయి కదా. చాలాచోట్ల ప్రమాదకరంగానూ ఉన్నాయి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
AP HighCourt: ఎస్సై నియామక ప్రక్రియపై హైకోర్టులో విచారణ
ఏపీలో ఎస్సై నియామక ప్రక్రియలో సింగిల్ జడ్జి ధర్మాసనం ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. -
EastCoast Train: ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. భయంతో ప్రయాణికుల పరుగులు
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌లో పొగలు వచ్చాయి. -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Nagarjuna sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత
నాగార్జునసాగర్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏపీ పోలీసులు అర్ధరాత్రి నాగార్జున సాగర్ వద్దకు చేరుకొని ఎస్పీఎఫ్ పోలీసులపై దాడి చేశారు. డ్యామ్‌పై విద్యుత్ సరఫరా నిలిపివేసి, అక్కడి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. -
హైదరాబాద్ ఓటర్ల కోసం ‘పోల్ క్యూ రూట్’ పోర్టల్
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ కొత్త పోర్టల్‌ను ఓటర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/11/23)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.


తాజా వార్తలు (Latest News)
-
Telangana assembly Elections 2023: తెలంగాణ ఎన్నికలు.. సినీ తారల ఫన్నీ మూమెంట్స్
-
Rahul Dravid: ‘టీ20 ప్రపంచకప్ ఉన్న ఈ తరుణంలో’.. కోచ్‌గా ద్రవిడ్ కొనసాగింపుపై గంభీర్ స్పందన
-
AP HighCourt: ఎస్సై నియామక ప్రక్రియపై హైకోర్టులో విచారణ
-
బందీలు విడుదలవుతున్న వేళ.. హమాస్ చెరలో 10 నెలల చిన్నారి మృతి..!
-
పన్నూ హత్య కుట్ర కేసు.. భారత వ్యక్తిపై అమెరికా అభియోగాలు
-
EastCoast Train: ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. భయంతో ప్రయాణికుల పరుగులు