Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 27 Sep 2023 09:15 IST

1. ల్యాండర్‌, రోవర్‌పై సన్నగిల్లుతున్న ఆశలు

చంద్రయాన్‌-3 మిషన్‌లోని ల్యాండర్‌, రోవర్‌లు మేల్కొంటాయన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ నెల 22న చంద్రుని దక్షిణ ధ్రువంపై సూర్యోదయం కావడంతో శాస్త్రవేత్తలు వాటితో అనుసంధానమయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. అయినా సానుకూల ఫలితాలు రాలేదు. మిషన్‌లో ఉపయోగించిన పరికరాలు అక్కడి అతిశీతల పరిస్థితులను తట్టుకోలేకపోయాయని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సమయం గడిచేకొద్ది అవకాశాలు మందగిస్తున్నాయని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మల్కాజిగిరి అభ్యర్థిగా రాజశేఖర్‌రెడ్డి!

మల్కాజిగిరి భారాస పార్లమెంటరీ పార్టీ ఇన్‌ఛార్జి, మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి మల్కాజిగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి భారాస అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఇక్కడి అభ్యర్థిగా ఇప్పటికే మైనంపల్లి హన్మంతరావును ప్రకటించగా.. ఆయన భారాసకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ స్థానం నుంచి మర్రి రాజశేఖర్‌రెడ్డిని పోటీలో నిలపాలని భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలిసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సింగరేణి ఉద్యోగులకు సీఎం దసరా కానుక

సింగరేణి కాలరీస్‌ సంస్థ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దసరా కానుక ప్రకటించారు. ఆయన ఆదేశాల మేరకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాల్లో 32 శాతం వాటాను ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు 42,390 మంది ఉద్యోగుల ఖాతాల్లో రూ.711 కోట్లను జమ చేయనుంది. అంతకుముందు ఏడాది 30 శాతం వాటా కింద రూ.368 కోట్లను జమ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వయసు 48.. అయినా తగ్గేదేలే..

జిమ్నాస్టిక్స్‌లో కొనసాగాలంటే ఎంతో ఫిట్‌నెస్‌ కావాలి. సరళత ఉండాలి. అందుకే పిన్న వయస్కులే ఈ ఆటలో ఎక్కువగా కనబడతారు. కానీ అమ్మమ్మ వయసు క్రీడాకారిణి బరిలో దిగితే! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా వయసును కేవలం ఒక నంబర్‌ అనుకునే ఒక్సానా చొసోవితినా దీన్ని సాధ్యం చేసింది. ఈ ఉజ్బెకిస్థాన్‌ వెటరన్‌ జిమ్నాస్ట్‌ వాల్ట్‌ ఈవెంట్లో బరిలో దిగి అందర్ని ఆకర్షించింది. ఇప్పటిదాకా ఆసియా క్రీడల్లో ఎనిమిది పతకాలు సాధించిన ఒక్సానా.. 2002లో రెండు పసిడి పతకాలు గెలుచుకుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నవోదయల్లో.. లేటరల్‌ ఎంట్రీ

అత్యున్నత బోధనను ఉచితంగా అందించే వేదికల్లో ముఖ్యమైనవి నవోదయ విద్యా సంస్థలు. వీటిలో అవకాశం వచ్చినవారు ఇంటర్మీడియట్‌ (ప్లస్‌ 2) వరకు నిశ్చింతగా చదువుకోవచ్చు. ఈ సంస్థల్లో ఆరో తరగతి నుంచి విద్య ప్రారంభమవుతుంది. ఈ తరగతిలో చేరిన విద్యార్థులు మధ్యలో వైదొలిగితే ఆ ఖాళీలను తొమ్మిదో తరగతిలో భర్తీ చేస్తారు. ఇందుకోసం ఎనిమిదో తరగతి చదువుతోన్నవారు లేటరల్‌ ఎంట్రీ విధానంలో ప్రవేశ పరీక్ష రాసుకోవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తొమ్మిదిలో ఉన్న ఖాళీల భర్తీకి నవోదయ విద్యాసమితి ప్రకటన విడుదల చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కాగ్‌ కడిగి పారేసింది!

ప్రభుత్వ విద్యాసంస్థల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో అక్రమాలను కాగ్‌ కడిగి పారేసింది. ప్రత్యేకించి కరోనా సమయంలో అమలు తీరును ఎండగట్టింది. వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు, సేవలు, సంక్షేమ పథకాల అమలుపై కాగ్‌ తనిఖీ నివేదికను విడుదల చేసింది. రాష్ట్రంలోని కర్నూలు, శ్రీకాకుళంతో పాటు ఉమ్మడి కడప జిల్లాలో పరిశీలన చేపట్టినట్లు నివేదికలో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కడతారా వీళ్లు.. కట్టబెడతారా ఇళ్లు!

గుడివాడలో ఆఘమేఘాల మీద పూర్తి చేసిన టిడ్కో గృహాలను సీఎం జగన్‌ ప్రారంభించారు. మొత్తం 8,912 గృహాల నిర్మాణం చేపట్టారు. దాదాపు నాలుగు నెలలు గడిచినా.. ఇప్పటికి ఆ గృహాల్లో కేవలం పదుల సంఖ్యలోనే ఆవాసం ఉంటున్నారు. మిగిలిన గృహాలన్నింటికీ తాళాలు వేశారు. కారణం మంచినీటి సౌకర్యం లేదనేది లబ్ధిదారుల మాట. ఇక్కడ నీటిని సరఫరా చేసే ఈఎల్‌ఎస్‌ఆర్‌ వాటర్‌ ట్యాంకు నిర్మాణం పూర్తి కాలేదు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అయోమయం.. గందరగోళం

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పరీక్షల నిర్వహణలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) పొరపాట్లతో అభ్యర్థుల పరిస్థితి అయోమయంగా మారింది. ప్రశ్నపత్రాల లీకేజీ గతంలో వారిలో గందరగోళం సృష్టించింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షపై నెలకొన్న తాజా పరిణామాలతో నవంబరులో జరిగే గ్రూప్‌-2 పరీక్షకు సన్నద్ధతపై అభ్యర్థుల్లో సందిగ్ధత నెలకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సుందర దీవి... కానరాదే ఠీవి?

కేరళ తరహా పచ్చని చెట్లు... గోవాను తలపించే సముద్ర తీరం.. ఆహ్లాదకర, ఆరోగ్యకరమైన వాతావరణంతో ఎటు చూసినా ప్రకృతి కమనీయ దృశ్యాలతో కట్టిపడేస్తూ మూడు వైపులా ఉప్పుటేరు, ఒకవైపు సముద్రంతో ఉన్న ఈ సుందర దీవి ఎక్కడ అనుకుంటున్నారా.. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలోని చినగొల్లపాలెం దీవి. భీమవరానికి సమీపంలో ఉంది. చుట్టూ సముద్రం ఉన్నా ఎక్కడ చూసినా మంచి నీరు ఊరడం ఈ దీవి ప్రత్యేకత. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వైకాపాకు ఒకలా! ప్రజలకు మరోలా!

ఒకే రాజ్యాంగం.. ఒకటే చట్టం. కానీ వైకాపా నేతలు, కార్యకర్తలకు ఒకలా.. మిగిలిన ప్రజలందరికీ మరోలా అమలవుతోంది. చట్టం ఎదుట అందరూ సమానులే అనే మాటలు చెప్పుకొనేందుకే పరిమితం అవుతున్నాయి. చట్టం అధికార పార్టీ చుట్టంలా మారిందనే విమర్శలే ఎల్లెడలా వినిపిస్తున్నాయి. జిల్లాలో చోటు చేసుకుంటున్న సంఘటనలు.. పోలీసుల వ్యవహార తీరు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తమ సమస్యలివీ పరిష్కరించండి అని నోరు మెదపకుండా నొక్కేస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని