Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 28 Sep 2023 09:05 IST

1. ఉద్యోగులకు కొత్త దగా

జగన్‌ ప్రభుత్వం ఉద్యోగులను మళ్లీ దగాచేసింది. శాసనసభలో ‘గ్యారంటీ పింఛను పథకం’ (జీపీఎస్‌) పేరుతో బుధవారం బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించింది. తీరా దాని తీరుతెన్నులు చూసి ప్రభుత్వోద్యోగులు హతాశులవుతున్నారు. ‘‘పింఛను ఉద్యోగుల హక్కు. అలాంటిది జగన్‌ ప్రభుత్వం నమ్మించి నట్టేట ముంచింది. కొత్త పథకంలో మాకు పింఛను భరోసా లేకుండా పోయింది. ఇందులో ఉద్యోగులకు కొత్తగా భరోసాగా ఇచ్చే పింఛను ఎక్కడుంది’’ అని ఆగ్రహోదగ్రులవుతున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మా స్నేహం మీద ఒట్టు.. చంద్రబాబు ఎలాంటి తప్పూ చేయరు

‘మా స్నేహం మీద ఒట్టు. చంద్రబాబు ఎలాంటి తప్పూ చేయరు’ అని తెదేపా అధినేత చంద్రబాబు బాల్య స్నేహితులు, సన్నిహితులు పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తిరుపతి జిల్లా చంద్రగిరిలో చేపట్టిన రిలే దీక్షలో బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రగిరికి నడిచి వచ్చి చదువుకున్న రోజులు గుర్తు చేసుకున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. గ్రూప్‌-1పై సుప్రీంకోర్టుకు!

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష రద్దుచేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించినట్లు తెలిసింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు  సరైనదేనని డివిజన్‌ బెంచ్‌ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో కమిషన్‌ ఆ తీర్పుపై న్యాయనిపుణులతో చర్చించింది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం రెండోసారి నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు దాదాపు 2.33 లక్షల మంది హాజరయ్యారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఉపాధ్యాయ పదోన్నతులకు బ్రేక్‌!

రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు ఇక ఆగిపోయినట్లే!. పదోన్నతి పొందాలన్నా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) తప్పనిసరి అని కొందరు టీచర్లు హైకోర్టును ఆశ్రయించడం.. టెట్‌ ఉత్తీర్ణులై, పదోన్నతి పొందేందుకు అర్హులైన వారి సీనియారిటీ జాబితా సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో స్కూల్‌ అసిస్టెంట్లుగా, గెజిటెడ్‌ హెచ్‌ఎంలుగా పదోన్నతులకు బ్రేక్‌ పడినట్లేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అంతుచిక్కని రీతిలో తుపాన్ల గమనం

పెరుగుతున్న భూతాపం, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు.. వాతావరణ మార్పులతో తుపాన్లు అంతుచిక్కని విధంగా మారుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. తుపాన్లు వేగంగా బలం పుంజుకోవడం, బలహీనపడే సమయంలో మళ్లీ విజృంభించడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని.. వాటిని అంచనా వేయడంలో, నష్ట నివారణ ప్రణాళిక రూపకల్పనలో శాస్త్రవేత్తలకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నార్లాపూర్‌ పంపుహౌస్‌లో మొదలైన ఎత్తిపోత

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు గ్రామ పరిధిలోని నార్లాపూర్‌ పంపుహౌస్‌లో బుధవారం సాయంత్రం నీటి ఎత్తిపోత ప్రారంభమైంది. ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, జెన్‌కో, ట్రాన్స్‌కో, బీహెచ్‌ఈఎల్‌, ప్రాజెక్టు అధికారుల బృందం పంపుహౌస్‌లో సాంకేతిక సమస్యలను పరిష్కరించి మంగళవారం సాయంత్రమే సిద్ధం చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పలాసలో పోలీసుల జులుం

గుంతలు పడిన రోడ్డును పూడుస్తున్న తెదేపా నాయకుల్ని అడ్డుకోవడమే కాకుండా, పనిలోకి వచ్చిన ట్రాక్టర్‌ డ్రైవర్‌పై పోలీసులు చేయిచేసుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కాశీబుగ్గ నుంచి పలాస వైపు వెళ్లే కె.టి.రోడ్డుపై గుంతలు పడటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. టెట్‌ పేపర్‌-2లో 15 శాతమే పాస్‌

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లో ఈసారి ఉత్తీర్ణత శాతం భారీగా పడిపోయింది. టెట్‌ నిర్వహణ మొదలైన 2011 నుంచి పేపర్‌-2లో అతి తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. ఆ పేపర్‌లో కేవలం 15.30 శాతం మందే కనీస మార్కులు పొంది అర్హత సాధించారు. పేపర్‌-1లో గతేడాది కంటే నాలుగు శాతం ఉత్తీర్ణత పెరిగినా అంతకు ముందు జరిగిన ఆరు పరీక్షలతో పోల్చుకుంటే మాత్రం బాగా తగ్గిపోయింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. శతాబ్ది చివరికి వృద్ధ భారతం

దేశంలో వయోధికుల సంఖ్య విస్తరించడం మొదలైందని, ఈ శతాబ్ది చివరినాటికి వృద్ధుల జనాభా ఎక్కువగా ఉంటుందని ‘ఐక్యరాజ్యసమితి జనాభా నిధి’ (యూఎన్‌ఎఫ్‌పీయే) నూతన నివేదిక చెబుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువమంది కిశోరప్రాయులు, యువత ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటి. అరవై ఏళ్లు పైబడిన వృద్ధులు 2021లో 10.1% ఉంటే 2036 నాటికి 15 శాతానికి, 2050కి 20.8 శాతానికి చేరుకుంటారని ఈ నివేదిక అంచనా.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నల్లమల వలవిల

తెలంగాణ రాష్ట్రంలో కవ్వాల్‌, అమ్రాబాద్‌ పులుల సంరక్షణ కేంద్రాలుండగా నల్లమల అటవీ ప్రాంతంలో పులులు ఎక్కువగా సంచరిస్తున్నాయి. అమ్రాబాద్‌ను పులుల సంరక్షణ కేంద్రం (ఏటీఆర్‌) దేశంలోనే రెండో అతి పెద్ద అభయారణ్యం. నల్గొండ జిల్లాలోని నాగర్జునసాగర్‌ నుంచి నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కొల్లాపూర్‌ వరకు 2,611 చదరపు కిలో మీటర్ల మేర నల్లమల అడవులు విస్తరించి ఉన్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు