Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 03 Oct 2023 09:21 IST

1. ‘మద్యం’తర మరణం

ఉయ్యాలవాడ మండలానికి చెందిన ఓ వ్యక్తి అతిగా మద్యం తాగడంతో కాలేయం పూర్తిగా దెబ్బతింది. నంద్యాల, కర్నూలు ఆసుపత్రుల్లో వైద్యసేవలు పొందినా ఫలితం లేకపోయింది. చివరికి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. కాలేయం దెబ్బతిన్న నేపథ్యంలో దాన్ని మార్చాలిందేనని వైద్యులు తేల్చారు. ఇందుకు రూ.60 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. గ్లోబల్‌ ప్రైజ్‌ అందుకునే దిశగా..

వినూత్నమైన బోధన పద్ధతులు అవలంభిస్తూ పాఠశాల విద్య చదివే పిల్లల్ని ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దటానికి తనవంతు కృషి చేస్తున్న పచ్చారు హరికృష్ణ అనే ఉపాధ్యాయుడు ప్రఖ్యాత ‘గ్లోబల్‌ ప్రైజ్‌’కు ఎంపికైన 50 మంది జాబితాలో ఒకరిగా నిలిచారు. ప్రపంచంలోని 130 దేశాల నుంచి ఆ అవార్డు కోసం 7 వేల దరఖాస్తులు రాగా వారిలో 50 మందిని షార్టు లిస్టు చేయగా అందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఒకరిగా ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఈకేవైసీ పేరుతో వసూళ్లు

రేషన్‌ బియ్యం దుర్వినియోగాన్ని అరికట్టడానికి ప్రభుత్వం  రేషన్‌కార్డులను ఈకేవైసీ చేయాలని నిర్ణయించింది. డీలర్ల వద్ద ఉన్న ఈపాస్‌ యంత్రాల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. ఇదే అదనుగా భావించిన కొందరు వసూళ్లకు తెరలేపారు. ఈకేవైసీ పునరుద్ధరణకు ఎలాంటి గడువు లేదని అధికారులు చెబుతున్నా అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి.. దోచుకుంటున్నారు. కొందరు యంత్రాలు పని చేయడం లేదని దుకాణాలు మూసేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నగరాన్ని మళ్లీ ముంచుతారా..!

వరంగల్‌, హనుమకొండ నగరాల మధ్య ఉండే కీలకమైన భద్రకాళి చెరువును కుదించే కుటిలయత్నం మరోసారి జరుగుతోంది. మినీ బండ్‌ పేరుతో ఆక్రమణలకు తెర తీస్తున్నారు. హనుమకొండ పద్మాక్షిగుట్ట వైపు భద్రకాళి చెరువులో ప్రైవేటు పట్టా భూములు ఉన్నాయని 20 ఏళ్లుగా కొందరు వ్యక్తులు కలెక్టరేటు, రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నేడు ఇందూరుకు ప్రధాని

ప్రధాని మోదీ మంగళవారం నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. రూ.8 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రధాని బీదర్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 2:55 గంటలకు నిజామాబాద్‌ చేరుకుంటారు. కలెక్టరేట్‌ ఆవరణలోని హెలిప్యాడ్‌ నుంచి రోడ్డు మార్గంలో సమీపంలోని గిరిరాజ్‌ కళాశాల మైదానంలో వేర్వేరుగా ఏర్పాటుచేసిన అధికారిక కార్యక్రమాలు, బహిరంగ సభల  వేదికల వద్దకు వెళ్తారు. మధ్యాహ్నం 3 నుంచి 3:40 గంటల వరకు ఓ సభా వేదిక పైనుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభోత్సవాలుంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘ఆ డైరీలో ఏముందో’ తెరుస్తారా! తేల్చేస్తారా!!

ఒంగోలులో ఓ గద్దల ముఠా ప్రైవేట్‌ భూములు, ఆస్తులను తన్నుకుపోతోంది. వివాదాలు సృష్టిస్తూ అందిన కాడికి దండుకుంటోంది. ఈ ముఠా భూబాగోతాలు ఇటీవల వెల్లడయ్యాయి. ఈ వ్యవహారం ఇప్పుడు ఒక్క నగరానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇక్కడికి చెందిన వ్యక్తుల ప్రమేయంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు కీలక ప్రాంతాలకు కార్యకలాపాలు విస్తరించాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సీబీఎస్‌ఈ పాఠశాల పరీక్షల విధానంలో మార్పు

రాష్ట్రంలో సీబీఎస్‌ఈ గుర్తింపు ఉన్న వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9వ తరగతులకు పరీక్షల విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఫార్మెటివ్‌, సమ్మెటివ్‌ పరీక్షలుండగా వాటిని పీరియాడిక్‌, టర్మ్‌ పరీక్షలుగా మార్చింది. పీరియాడిక్‌ రాత పరీక్ష (పీడబ్ల్యూటీ)-2 ఆరో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు నిర్వహించనున్నారు. పీడబ్ల్యూటీలు మొత్తం నాలుగు ఉంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గర్భిణిని భుజాలపై మోస్తూ 4 కి.మీ. నడక

గిరిజన గర్భిణిని భుజాలపై మోస్తూ ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. శహర్‌పుర్‌ తాలుకాలోని పటికచపడ గ్రామానికి చెందిన గర్భిణికి ఆదివారం పురిటినొప్పులు మొదలయ్యాయి. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల అంబులెన్స్‌ సహా ఎలాంటి వాహనం గ్రామానికి వచ్చేందుకు వీలు లేదు. దీంతో గ్రామస్థులు ఆమెను భుజాలపై మోస్తూ నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు యత్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. టైప్‌-1 మధుమేహానికి వ్యాక్సిన్‌

మల్టిపుల్‌ స్లీరోసిస్‌, టైప్‌-1 మధుమేహం వంటి ఆటోఇమ్యూన్‌ వ్యాధుల ఆట కట్టించే దిశగా సరికొత్త టీకా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన శరీరంలోకి ప్రవేశించే ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్‌లను శత్రువులుగా గుర్తించి, వాటిపై దాడి చేయడాన్ని రోగ నిరోధక వ్యవస్థకు సాధారణ టీకాలు నేర్పిస్తాయి. అందుకు భిన్నంగా ప్రత్యేక విలోమ వ్యాక్సిన్‌ను అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రిట్జ్‌కర్‌ స్కూల్‌ ఆఫ్‌ మాలిక్యులార్‌ ఇంజినీరింగ్‌ (పీఎంఈ) పరిశోధకులు తాజాగా అభివృద్ధి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మార్చారా.. ఏమార్చారా?!

విజయవాడ నగరం చుట్టూ వలయ రహదారి నిర్మాణంలో భాగంగా తూర్పు వైపు బైపాస్‌ జాతీయ రహదారి వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. జాతీయ రహదారుల సంస్థకు బందరు సమీపంలో వంద ఎకరాల కేటాయింపునకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రహదారి నిర్మాణంతో విజయవాడ నగరానికి దాదాపు బాహ్య వలయ రహదారి (బైపాస్‌) ఏర్పడినట్లే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని