Top Ten News‌ @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 19 Apr 2021 21:11 IST

1. Corona Vaccine: 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ!

కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీ నుంచి 18 సంవత్సరాలు దాటిని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సోమవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా మూడో విడత కరోనా వ్యాక్సిన్‌ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. KCR Corona Positive: సీఎం కేసీఆర్‌కు కరోనా

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా సోకింది. ఆయనకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు సీఎస్ సోమేశ్‌కుమార్‌‌ తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని సీఎస్‌ తెలిపారు. హోం ఐసోలేషన్‌లో ఉండాలని సీఎంకు వైద్యులు సూచించారని.. ప్రస్తుతం ఆయన తన ఫామ్‌హౌస్‌లో ఉన్నారని చెప్పారు. ప్రత్యేక వైద్యుల బృందం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు సోమేశ్‌కుమార్‌ చెప్పారు.‌ సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మాజీ ప్రధాని మన్మోహన్‌కు కరోనా పాజిటివ్‌

3. నా భర్తను ముద్దు పెట్టుకుంటా..ఏం చేస్తారు..

కరోనా విలయ తాండవం చేస్తున్న వేళ దిల్లీలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా కొందరు వాటిని ఉల్లంఘిస్తూ రోడ్లపై యథేచ్ఛగా సంచరిస్తున్నారు. ప్రతిఒక్కరూ రెండు మాస్క్‌లు పెట్టుకుంటే సురక్షితమని శాస్త్రవేత్తలు చెబుతున్నా కనీసం ఒక్క మాస్క్‌ కూడా పెట్టుకోకుండా వీధుల్లో తిరిగేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్క్‌ పెట్టుకోకుండా కారులో వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులపైనే ఓ జంట ఎదురుదాడికి దిగిన ఘటన దిల్లీలోఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Corona: ఏపీలో 27 మంది మృత్యువాత

 ఏపీలో కరోనా అంతకంతకూ తీవ్రతరమవుతోంది. కొవిడ్‌తో ఒక్కరోజు వ్యవధిలో 27 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 7,437కి చేరింది. మరోవైపు 24 గంటల వ్యవధిలో 37,765 నమూనాలను పరీక్షించగా 5,963 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1182, అత్యల్పంగా పశ్చిమగోదావరి, విజయనగరం జిల్లాల్లో 19 చొప్పున కేసులు నమోదయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

AP: మాస్క్‌ ధరించకపోతే జరిమానా

5. Gully Rowdy Teaser: నవ్వులే నవ్వులు

సందీప్‌ కిషన్, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో జి.నాగేశ్వర రెడ్డి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘గల్లీ రౌడీ’. నేహా శెట్టి నాయిక. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని విజయ్‌ దేవరకొండ విడుదల చేశారు. ‘బాబుని రంగంలోకి దింపు. బాబు రావాలి.. రౌడీ కావాలి అని విశాఖపట్నం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్‌ ఆద్యంతం అలరిస్తుంది. ఓ కిడ్నాప్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. వెన్నెల కిశోర్‌, రాజేంద్ర ప్రసాద్‌ నవ్వులు పూయిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వరుణ్‌ ఫైర్‌.. జాన్వీ అదరహో.. రకుల్‌ చిట్కా

6. పుతిన్‌ బద్ధవిరోధిని ఆసుపత్రికి తరలిస్తాం: రష్యా

రష్యా అధ్యక్షుడికి బద్ధవిరోధి, ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీని ఆసుపత్రికి తరలిస్తామని ఆ దేశ జైళ్ల శాఖ వెల్లడించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ క్లిష్టంగానే ఉంది. ఖైదీలకు చికిత్స చేసే ఆసుపత్రికి ఆయన్ను తీసుకెళ్లే అవకాశం ఉంది. మాస్కో బయట జైలులో ఉన్న ఆయన మూడు వారాల క్రితం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Lancet on Corona: వాటిపై 2 నెలల నిషేధం!

విస్తృత వేగంగా వ్యాపిస్తోన్న కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సందర్భంగా కరోనా ఉద్ధృతిపై ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ లాన్సెట్‌ ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా ఇళ్లల్లో జరిగే సామూహిక కార్యక్రమాలపై కనీసం రెండు నెలలపాటు పూర్తిగా నిషేధం విధిస్తేనే వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వస్తుందని ఆ టాస్క్‌ఫోర్స్‌ నివేదిక స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కొవిడ్‌ను జయిస్తే ఒక్కషాట్‌ టీకా చాలా..!

8. జుత్తాడ హత్యల్లో కొత్త కోణం!

విశాఖ జిల్లా పెందుర్తి పరిధిలోని జుత్తాడలో జరిగిన హత్యల ఘటనలో మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. హత్యలు చేసింది ఒక్కడే కాదని.. దీని వెనుక ఇంకా ఆరుగురు ఉన్నారని మృతుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. నిందితుడు అప్పలరాజుతో సహా మిగతా వారినీ చంపేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్‌, విశాఖ జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌లను మృతుల బంధువులు కలిశారు. ఏమీ తెలియని వారిని కూడా అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని మృతురాలు అరుణ కుమారుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కరోనా ఎఫెక్ట్‌.. India open 2021 వాయిదా! 

టోక్యో ఒలింపిక్స్‌ అర్హత టోర్నీ ఇండియా ఓపెన్‌ సూపర్‌ 500 టోర్నీ వాయిదా పడింది. దేశంలో కరోనా వైరస్‌ విశృంఖలంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో  ఈ టోర్నీని వాయిదా వేస్తున్నట్టు భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) ప్రకటించింది. మే 11  నుంచి 16 వరకు దిల్లీలో జరగాల్సిన ఈ టోర్నీని ప్రేక్షకులు లేకుండా నిర్వహించాలని ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. TS: నైట్‌ కర్ఫ్యూ, వీకెండ్‌ లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోండి

 తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌పై 48 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తగిన ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా నియంత్రణలో ప్రభుత్వం తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

‘ప్రాణవాయువు’ను తోడేస్తున్న సెకండ్‌ వేవ్‌!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని