Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 27 Nov 2021 21:11 IST

1. TS News: సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి అస్వస్థత

ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నల సీతారామశాస్త్రి అస్వస్థతకు గురయ్యారు. రెండ్రోజుల క్రితం శ్వాసకోశ సమస్యతో సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి సిరివెన్నెలకు కిమ్స్‌ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రూ.40కోట్ల సుపారీపై ఈడీ విచారణకు డిమాండ్‌ చేయాలి: చంద్రబాబు

వరద సాయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం, జ్యుడీషియల్‌ విచారణ, జాతీయ విపత్తుగా ప్రకటించేలా కేంద్రపై ఒత్తిడి తేవాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై జగన్‌ ప్రభుత్వం పన్నులు, నిత్యావసరాల ధరల పెరుగుదల, ప్రత్యేక హోదా, 3 రాజధానుల బిల్లు వంటి అంశాలు పార్లమెంట్‌లో లేవనెత్తాలని సమావేశం నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Omicron: ఒమిక్రాన్‌ వేరియంట్‌పై పనిచేస్తున్న టీకాలు!

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్​ ‘ఒమిక్రాన్​’(B.1.1.529) ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. డెల్టా వంటి రకాలకన్నా అత్యంత వేగంగా వ్యాప్తి చెందటమే కాకుండా.. తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న కారణంగా ప్రపంచ దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా ఆరోగ్య శాఖ కాస్త ఊరట కలిగించే వార్త అందించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవిడ్​-19 టీకాలు ఒమిక్రాన్​ రకంపై పనిచేస్తున్నాయని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి జో ఫాహ్లా వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* మరిన్ని దేశాలకు ఒమిక్రాన్‌ వ్యాప్తి.. బయటపడుతున్న కొత్త వేరియంట్‌ కేసులు

4. కుటుంబ పార్టీలు దేశానికి, ప్రజా స్వామ్యానికి ప్రమాదకరం: కిషన్‌రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంతో లిఖిత పూర్వక ఒప్పందం మేరకే కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ విషయాన్ని వదిలిపెట్టి కేసీఆర్‌ కుటుంబం.. కేంద్రంపై అనేక రకాల తప్పుడు ఆరోపణలు చేస్తుందని ధ్వజమెత్తారు. కుటుంబ పార్టీలు దేశానికి, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. రాష్ట్ర భాజపా కార్యవర్గ సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Farm Laws: తొలి రోజే సాగు చట్టాల రద్దు బిల్లు.. ట్రాక్టర్‌ ర్యాలీపై రైతులు వెనక్కి 

రైతుల ఆందోళనలతో నూతన సాగు చట్టాలపై ఎట్టకేలకు దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల తొలి రోజే చట్టాల రద్దుకు బిల్లు తీసుకురానుంది. ఈ నేపథ్యంలో రైతులు తమ ‘చలో పార్లమెంట్‌’ ర్యాలీపై వెనక్కి తగ్గారు. చట్టాల రద్దుపై సోమవారం(నవంబరు 29) బిల్లు తీసుకురానున్న దృష్ట్యా ట్రాక్టర్‌ మార్చ్‌ను ప్రస్తుతానికి ఉపసంహరించుకుంటున్నట్లు రైతు సంఘాల ఐక్యవేదిక సంయుక్త కిసాన్‌ మోర్చా శనివారం వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. International flights: తొందరపడొద్దు.. అంతర్జాతీయ విమానాలపై మరోసారి ఆలోచించండి

దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై శనివారం ఉదయం ప్రధాని నరేంద్రమోదీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు ఈ సమావేశం సాగింది. అలాగే దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అధికారులతో పలు అంశాలపై చర్చించారని పీఎంఓ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* Omicron: ఒమిక్రాన్‌ కలకలం .. ఈ జాగ్రత్తలు మరవొద్దు: WHO హెచ్చరిక

7.  AP News: ఏపీలో మళ్లీ తెరపైకి జిల్లాల పునర్విభజన?.. 25కు పెరగనున్న జిల్లాలు

ఆంధప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. నిన్న జరిగిన ఎంపీల సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. జనగణనకు సంబంధించి కేంద్ర గణాంకశాఖ జారీ చేసిన ఆదేశాలకు ఇబ్బంది లేకుండా ఈ ప్రక్రియ ప్రారంభించాలంటూ ఉన్నతాధికారులకు సీఎం జగన్‌ ఆదేశాలిచ్చినట్టు సమాచారం. జనగణన పూర్తయ్యేలోగా విభజనకు సంబంధించి ప్రాథమిక ప్రక్రియను పూర్తి చేసి నోటిఫికేషన్కు సిద్ధం కావాలని సీఎం సూచించినట్టు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. PF: ఈ ప్రక్రియ పూర్తి చేశారా? లేదంటే పీఎఫ్‌ జమ కాదు!

మీరు ఉద్యోగులా? మీకు మీ సంస్థ ఉద్యోగుల భవిష్య నిధి(పీఎఫ్‌) ప్రయోజనాలు కల్పిస్తోందా? అయితే, మీకు ఓ ముఖ్య గమనిక! ఈ నెలాఖరు కల్లా మీరు మీ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ‘సార్వత్రిక ఖాతా సంఖ్య(యూఏఎన్‌)ను ఆధార్‌తో అనుసంధానించాల్సి ఉంటుంది. లేదంటే.. ‘ఎల‌క్ట్రానిక్ చ‌లాన్ క‌మ్ రిట‌ర్న్ (ఈసీఆర్‌)’ భర్తీ కాదు. అంటే మీ పీఎఫ్ ఖాతాల్లో వచ్చే నెల నుంచి కంపెనీ వాటా జమ కాదు. వెంటనే ఉద్యోగుల యూఏఎన్‌ను ఆధార్‌తో అనుసంధానించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) యాజమాన్యాలకు సైతం తెలియజేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. IND vs NZ: ఇద్దరు రవీంద్రలు.. ఇద్దరు పటేల్‌లు.. ఒకేలా ముగింపు

క్రికెటర్లకు సంబంధించిన కొన్ని విషయాలు యాదృచ్ఛికంగా ఒకరికొకరివి కలుస్తుండటం సహజం. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఆటతీరు, జెర్సీ నంబర్‌.. ఇలా ఏదైతేనేమీ పోలికలు సరిపోతుంటాయి. అయితే ఒకే మ్యాచ్‌లో వారు ప్రత్యర్థులుగా ఎదురుపడటం అరుదుగా జరిగే విషయమే. భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇలాంటి అరుదైన అంశాలు కొన్ని ఉన్నాయి. మరి అవేంటో ఓ సారి చూద్దాం...  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ప్రభుత్వాలు ఆదుకున్నది శూన్యం..థియేటర్‌నే నమ్ముకున్న వాళ్ల పరిస్థితి ఏంటి?

వెంకటేశ్‌ కథానాయకుడిగా జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దృశ్యం2’. సంపత్‌రాజ్‌, మీనా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా విడుదలైన ఈ సినిమాకు మంచిస్పందన వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి.సురేశ్‌బాబు విలేకరులతో మాట్లాడారు. ‘దృశ్యం 1’లాగే ‘దృశ్యం 2’కు కూడా ఆదరణ బాగుందని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* social look: అందాల భామలు.. చురకత్తుల్లాంటి చూపులు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని