Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 07 Dec 2021 21:08 IST

1. AP News: ఏ బ్యాంకులో .. ఏపీ సర్కారుకు ఎన్ని అప్పులు!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 10 జాతీయ బ్యాంకుల నుంచి రూ.57,479 కోట్లు అప్పు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ రాజ్యసభలో వెల్లడించారు. తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు ఈమేరకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు. ఏపీలోని 40 ప్రభుత్వ కార్పొరేషన్లు, కంపెనీలకు జాతీయ బ్యాంకులు నేరుగా రుణాలు మంజూరు చేశాయని, అసలు, వడ్డీ చెల్లింపు బాధ్యత కార్పొరేషన్లు, కంపెనీలదేనని స్పష్టం చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. AP News: ఉపా చట్టం ఉపయోగించినా ఉద్యమం ఆగదు : బండి శ్రీనివాస్‌

ఉద్యోగుల 71 డిమాండ్ల సాధన కోసమే ఉద్యమ బాట పట్టామని ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘‘సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ తీసుకొస్తామని సీఎం  జగన్‌ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అది ఇప్పటికీ అమల్లోకి రాలేదు. 55 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ ఇవ్వాల్సి ఉంది. జులై 2018 నుంచి పెండింగ్‌ లో ఉన్న డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నాం.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కొవిడ్‌ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.30వేల కోట్ల భారం: జగన్‌

3. TS News: తెలంగాణ పురపాలక అధికారులు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారు: ఈసీ

స్థానిక ప్రజాప్రతినిధుల జీతాలు పెంచుతూ పురపాలకశాఖ జీవో జారీ చేయడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఈసీ.. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, పురపాలకశాఖ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డికి హెచ్చరిక జారీ చేయాలని సీఎస్‌ను ఆదేశించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Crime News: జలమండలి వాటర్‌ ట్యాంక్‌లో శవం.. ఆందోళనలో జనం

ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రీసాలగడ్డ జలమండలి వాటర్‌ ట్యాంక్‌లో మృతదేహం లభ్యమైంది. ట్యాంకు శుభ్రపరిచేందుకు వెళ్లిన సిబ్బంది మృతదేహాన్ని గుర్తించారు. అధికారులకు సమాచారమివ్వడంతో శవాన్ని తొలగించారు. ఘటనా స్థలికి చేరుకున్న క్లూస్‌ టీమ్‌, పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఎవరైనా హత్య చేసి వాటర్‌ ట్యాంక్‌లో పడేసి ఉంటారా? లేక  ప్రమాదవశాత్తూ ఎవరైనా ట్యాంక్‌లో పడ్డారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Crime News: నకిలీ వీసాలతో గల్ఫ్‌ వెళ్లేందుకు యత్నం.. పోలీసుల అదుపులో 44 మంది మహిళలు 

5. HP Laptops: గేమర్స్‌ కోసం హెచ్‌పీ కొత్త ల్యాప్‌టాప్‌.. ధర, ఫీచర్లివే! 

హెచ్‌పీ కంపెనీ ఒమెన్‌ సిరీస్‌లో కొత్త గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. హెచ్‌పీ ఒమెన్‌ 16 (HP Omen 16) పేరుతో తీసుకొస్తున్న ఈ ల్యాప్‌టాప్‌లో థర్మల్‌ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ ఉపయోగించారు. దీనివల్ల ల్యాప్‌టాప్ మరింత నాజూగ్గా ఉండటమే కాకుండా, ల్యాప్‌టాప్‌ వేడెక్కకుండా మెరుగైన కూలింగ్ వ్యవస్థను అందిస్తుంది. మరి ఈ ల్యాప్‌టాప్‌లో ఇంకా ఎలాంటి ఫీచర్లున్నాయో చూద్దాం.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Akhanda: ‘అఖండ’కు సీక్వెల్‌ వస్తుందా?

Social Look: లిప్‌స్టిక్‌తో మీనా బిజీ.. చొక్కా దొంగిలించిన సోనాలిబింద్రే!

7. Vaccine for children: పిల్లలకు టీకాలు ఇప్పుడే కాదు: NTAGI

కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దాదాపు 35 దేశాల్లో కేసులు వెలుగుచూశాయి. భారత్‌లోనూ పదుల సంఖ్యలో కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో బూస్టర్‌ డోసులు, పిల్లలకు టీకాలు ఇవ్వాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌ (NTAGI) పిల్లలకు టీకాల విషయంపై స్పష్టతనిచ్చింది. ఈ ఏడాదిలో పిల్లలకు టీకాలు ఇవ్వమని తెలిపింది. వారికి ఎప్పుడు ఇవ్వాలో వచ్చే ఏడాదే నిర్ణయిస్తామని వెల్లడించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Volkswagen Tiguan: ఫోక్స్‌వ్యాగన్‌ టిగువాన్‌ సరికొత్తగా.. ధరెంతంటే?

ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌ 2021 టిగువాన్‌ ఫేస్‌లిఫ్ట్‌ను మంగళవారం భారత్‌లో విడుదల చేసింది. పూర్తిగా దేశీయంగా అనుసంధానం చేసిన ఈ కారు ధరను రూ.31.99 లక్షలుగా నిర్ణయించారు. కేవలం పెట్రోల్‌ వేరియంట్‌ మాత్రమే అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2020లో తొలిసారి మార్కెట్‌లోకి వచ్చిన ఈ కారు తాజాగా అనేక స్టైలింగ్‌ మార్పులతో మన ముందుకు వచ్చింది. జీప్‌ కంపాస్‌, హ్యుందాయ్‌ టక్సన్‌, సిట్రాన్‌ సీ5 ఎయిర్‌క్రాస్‌ కార్లకు ఇది పోటీ ఇవ్వనుంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Harsh Goenka: ఒకేసారి 900 మంది ఉద్యోగుల తొలగింపు.. తప్పు పట్టిన గోయెంకా

9.  IND vs NZ: ఆ ఒక్క రికార్డుతో జీవితమేం మారిపోదు.. కానీ : అజాజ్‌ పటేల్‌

ముంబయి వేదికగా జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌.. ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసి అరుదైన రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘనతతో మాజీ క్రికెటర్లు జిమ్ లేకర్‌, అనిల్‌ కుంబ్లే తర్వాత టెస్టు క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా అజాజ్‌ చరిత్రకెక్కాడు. ఈ రికార్డుపై అతడు తాజాగా స్పందించాడు. ఆ ఒక్క రికార్డుతో జీవితం ఏం మారిపోదని అన్నాడు. కానీ, న్యూజిలాండ్ తరఫున మర్నిన్ని టెస్టులు ఆడేందుకు సహాయపడొచ్చని పేర్కొన్నాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఉగ్రవాదులా.. కాదా..? నిర్ధారించుకోకుండానే కార్మికులపై సైన్యం కాల్పులు.. పోలీస్‌ శాఖ నివేదిక

నాగాలాండ్‌లోని ఒటింగ్‌లో ఈ నెల 4న సైన్యం జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన, అనంతరం చెలరేగిన హింసపై నాగాలాండ్ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర పోలీసు శాఖ నివేదిక సమర్పించింది. అందులో పలు కీలక అంశాలను వెల్లడించింది. గని నుంచి తిరిగి వస్తున్న కార్మికులను ముందుగా గుర్తించకుండానే సైన్యం కాల్పులు జరిపిందని నాగాలాండ్ డీజీపీ, కమిషనర్ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో తెలిపారు. 8 మంది గని కార్మికులు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Farmers Protest: రైతుల ఉద్యమానికి అతి త్వరలో ముగింపు..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని