Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం..

Updated : 14 Jan 2022 21:14 IST

1. శబరిమలలో మకరజ్యోతి దర్శనం

‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ అయ్యప్ప నామ స్మరణతో  శబరిగిరులు మర్మోగాయి. మకరజ్యోతి దర్శనానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పొన్నాంబలమేడు నుంచి దర్శనమిచ్చిన మకర జ్యోతిని వీక్షించిన అయ్యప్పలు భక్తి పారవశ్యంతో పులకించిపోయారు.  కరోనా నేపథ్యంలో ఆలయ కమిటీ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ భక్తులకు స్వామివారి దర్శనం కల్పించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. బోరిస్‌కు పదవీ గండం.. బ్రిటన్‌ ప్రధాని రేసులో భారత సంతతి వ్యక్తి?

అన్నీ కలిసొస్తే బ్రిటన్‌ అధికార పగ్గాలు భారత సంతతి వ్యక్తి చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని ఆ దేశ మీడియా ఇప్పుడు కోడై కూస్తోంది. ప్రస్తుతం ప్రధానమంత్రి పదవిలో ఉన్న బోరిస్‌ జాన్సన్‌కు కాలం దగ్గరపడిందని పలు  పత్రికలు విశ్లేషిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో జరుగుతోన్న బెట్టింగ్‌లు కూడా దాన్ని బలపరుస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మృతుల్లో 75% టీకా తీసుకోనివారే... 31 వరకు అక్కడ స్కూళ్లు బంద్‌

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావంతో కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 2.64లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగుచూడటం గమనార్హం. రోజురోజుకీ కొవిడ్‌ ఉద్ధృతి పెరుగుతున్న వేళ పలు రాష్ట్రాలు కొవిడ్‌ ఆంక్షల్ని మరింత కట్టుదిట్టం చేసే దిశగా చర్యలు తీసుకొంటున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పండగ వేళ.. సినీ తారలు ఇలా!

4. పొగాకు బోర్డు సభ్యుడిగా జీవీఎల్‌ 

పొగాకు బోర్డు సభ్యుడిగా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు నియమితులయ్యారు. 14 డిసెంబరు 2021న రాజ్యసభలో ఆమోదించిన తీర్మానం మేరకు పొగాకు బోర్డు సభ్యుడిగా జీవీఎల్‌ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని రాజ్యసభ సెక్రటేరియట్‌ లిఖితపూర్వకంగా ఆయనకు తెలియజేసింది. ఈసందర్భంగా జీవీఎల్‌ మాట్లాడుతూ...పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్టు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తెలంగాణలో కొత్తగా 2,398 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 68,525 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,398 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,05,199కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,052కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ప్రముఖ పురాణ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి శివైక్యం

ప్రముఖ పురాణ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి (96) శివైక్యమయ్యారు. వయోభారంతో బాధపడుతూ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పరమపదించారు. తితిదే ఆస్థాన శాశ్వతపండితుడిగా చంద్రశేఖర శాస్త్రి ప్రసిద్ధి. పురాణాలను శాస్త్రబద్ధంగా చెబుతూ ఎందరో ఆస్తికులకు ధర్మ మార్గాన్ని చూపించారు. 1925 ఆగస్టు 28న గుంటూరు జిల్లా క్రోసూరులో చంద్రశేఖర శాస్త్రి జన్మించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బ్రిటన్‌ పార్లమెంట్‌లో డ్రాగన్‌ ఊడలు..

చైనా మనుషులు ఏకంగా బ్రిటన్‌ పార్లమెంట్‌నే లక్ష్యంగా చేసుకొన్నారు. అక్కడ కార్యకలాపాలను కూడా చైనాకు అనుకూలంగా ఉండేలా ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ విషయాన్ని బ్రిటన్‌ నిఘా సంస్థ ఎంఐ5 గుర్తించింది. తొలిసారి బ్రిటన్‌ రాజకీయాల్లో చైనా జోక్యంపై హెచ్చరికలు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆంగ్లో-చైనా జాతీయురాలు క్రిస్టీన్‌ చింగ్‌ కుయ్‌ లీ నడుపుతోందని పేర్కొంది. ఈ ఘటన పశ్చిమ దేశాల్లో సంచలనం సృష్టించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మూడో టెస్టూ హుష్‌...సఫారీలదే సిరీస్‌

దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌ సాధించి చరిత్ర సృష్టించాలనుకున్న భారత జట్టుకి మరోసారి నిరాశే ఎదురైంది. సిరీస్‌ సాధించి చిరకాల విజయం అందుకోవాలంటే తప్పక గెలవాల్సిన మూడో టెస్టులో టీమ్ఇండియా ఘోర పరాజయం పాలైంది. ఆతిథ్య సఫారీ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9.  మా బ్యాటింగ్‌లో లోపాలను అధిగమించాల్సి ఉంది : విరాట్‌

టీమ్ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ మూడో టెస్టు మ్యాచ్‌ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. గత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పర్యటనల్లో మెరుగ్గా రాణించినంత మాత్రాన.. దక్షిణాఫ్రికాలో అదే విధంగా రాణిస్తామని గ్యారంటీ ఇవ్వలేమని విరాట్ కోహ్లీ అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. థర్డ్‌వేవ్‌లో పిల్లలపై ఎందుకంత ప్రభావం..?

తాజా వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. దీంతో అనేక దేశాల్లో కొవిడ్‌ మూడో దశ మొదలైందని ఆయా దేశాల అధికారులు వెల్లడించారు. అయితే ఈ వేరియంట్‌ పిల్లలపైనా అధికంగానే ప్రభావం చూపుతుండటం భయాందోళన కలిగిస్తోంది. మొదటి రెండు దశల సమయంలో పిల్లలపై అంతగా ప్రభావం చూపని కరోనా.. థర్డ్‌ వేవ్‌లో మాత్రం వారిపై అధికంగానే ప్రభావం చూపుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని