Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Updated : 20 Apr 2022 21:18 IST

1. 111జీవో పరిధి గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేత..

జీవో 111 పరిధిలోని గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. షరతులతో ఆయా గ్రామాల్లో ఆంక్షలను ఎత్తివేస్తూ 69వ నంబర్‌ ఉత్తర్వును పురపాలక శాఖ జారీ చేసింది. అయితే హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ జంట జలాశయాల్లో నీటి నాణ్యత దెబ్బతినరాదని షరతు విధించింది. షరతుల్లో భాగంగా ఎస్టీపీల నిర్మాణం, కాలుష్య  తీవ్రత తగ్గింపునకు చర్యలు తీసుకోనున్నారు. 

Video: నజ్రియా.. ఎవరి ఫోన్లు లిఫ్ట్‌ చేయలేదు: నాని

2. నీడనిచ్చే చెట్టును నరుక్కునే మూర్ఖులం కాదు.. సీఎంతో భేటీ అనంతరం కాకాణి

సీఎం జగన్‌తో భేటీ అనంరతం మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి మాట్లాడారు. ‘‘ మాజీ మంత్రి అనిల్‌కు, నాకు ఎలాంటి విభేదాలు లేవు. మా మధ్య గొడవలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సభ పెట్టుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. పోటాపోటీ సభలు అనేది అవాస్తవం. నెల్లూరు అంతా ఫ్రెండ్లీ వాతావరణం ఉంది. నీడనిచ్చే చెట్టును నరుక్కునే మూర్ఖులం కాదు’’ అని తెలిపారు. 

3. బురద రాజకీయాలు చేయడం మాకు చేతకాదు: పవన్‌ 

సాగు నష్టాలు, రుణ భారంతో రైతులు మానసికంగా కుంగిపోతున్నారని.. వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ఇందుకు రైతుల ఆత్మహత్యలే నిదర్శనమనన్నారు. ఈ మేరకు పవన్‌ కల్యాణ్‌ ప్రకటన విడుదల చేశారు. నష్టాలు, అప్పుల బాధతో ప్రకాశం, కర్నూలు జిల్లాలో రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి దిగ్భ్రాంతికి లోనైనట్లు చెప్పారు.

Video: మాస్కో కోల్పోయే ఆయుధ మార్కెట్‌ను చైనా కైవసం చేసుకోనుందా?

4. రసాభాసగా ఎన్‌ఎస్‌యూఐ సమావేశం..

కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగమైన ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రసాభాసగా జరిగింది. హైదరాబాద్ గాంధీభవన్‌ ఆవరణలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో రెండు వర్గాలు విడిపోయి బల్లలు, కుర్చీలు విసిరేసుకున్నారు. మూడేళ్లుగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయకపోవడంతో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను కొంతమంది నిలదీశారు.

5. ఆ మూడు శాఖల్లోనే 72 వేల పోస్టుల భర్తీ: సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణలో మొదట పోలీసు, విద్య, వైద్య శాఖల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ మూడు శాఖల్లో సుమారు 72 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ కానున్నాయని చెప్పారు. ఒక ఉద్యోగం రాకపోతే మరో ఉద్యోగానికి ప్రయత్నించే అవకాశం ఉంటుందన్నారు. 91 వేల ఉద్యోగాల ప్రకటన చేసేముందు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కసరత్తు చేసిందని పేర్కొన్నారు.

Video: ప్పించుకు తిరుగుతున్న నాకు.. ఈ కథ వినిపించారు: విశ్వక్‌సేన్‌

6. బండి ధర ₹71 వేలు.. ఫ్యాన్సీ నంబర్‌కి ₹15 లక్షలు!

మార్కెట్లో ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఖరీదైన కార్లు, బైకులకు తోడు ఫ్యాన్సీ నంబర్‌ ప్లేట్‌ ఉంటే ఆ కిక్కే వేరంటారు వాహన ప్రియులు. తాజాగా హరియాణా రాష్ట్రం చండీగఢ్‌కు చెందిన ఓ వ్యాపారి తనకు నచ్చిన వీఐపీ నంబరు కోసం ఏకంగా రూ. 15లక్షలు చెల్లించాడు. ఈ మధ్యకాలంలో ఇలాంటివి సాధారణమే కదా ఇందులో వింతేముంది అంటారా? అతను ఖరీదు చేసింది ఏ బెంజ్‌ కారు కోసమో కాదు.

7. ఏ ఒక్క ఉద్యోగీ సంతృప్తిగా లేరు: సూర్యనారాయణ

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 11వ వేతన సవరణపై ఏ ఒక్క ఉద్యోగి, ఉపాధ్యాయుడు సంతృప్తిగా లేరని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్‌.సూర్యనారాయణ అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్సీపై సీఎం జగన్‌తో చర్చ సందర్భంగా విధిలేక తప్పనిసరి పరిస్థితుల్లోనే అంగీకరిస్తున్నట్లు చెప్పామన్నారు.

8. ఏడాదిలో దేశవ్యాప్తంగా 50వేల ఛార్జింగ్‌ కేంద్రాలు

వచ్చే ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 50వేల ఛార్జింగ్‌ కేంద్రాల (charging stations)ను ఏర్పాటు చేస్తామని విద్యుత్తు ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్‌ (Hero Electric) బుధవారం వెల్లడించింది. ఈ మేరకు ఛార్జింగ్‌ మౌలిక వసతుల కల్పన సంస్థ బోల్ట్‌ (BOLT)తో చేతులు కలిపినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా హీరో ఎలక్ట్రిక్‌కు చెందిన 750 టచ్‌ పాయింట్లలో బోల్ట్‌ ఛార్జర్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది.

9. ‘30 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు.. కొరత ప్రశ్నే లేదు’

దేశవ్యాప్తంగా థర్మల్‌ విద్యుత్‌ప్లాంట్లలో సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 30 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నందున భయపడాల్సిన అవసరమేదీ లేదని పేర్కొన్నాయి. ప్రస్తుతం కోల్‌ ఇండియా వద్ద 72.5 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉందని సదరు వర్గాలు పేర్కొన్నాయి. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల వద్ద మరో 22 మిలియన్‌ టన్నుల మేర నిల్వలు ఉన్నాయని తెలిపాయి. 

10. మళ్లీ గుబులురేపుతోన్న ‘ఆర్‌ వాల్యూ’.. నాలుగో వేవ్‌కు సంకేతమా?

కరోనా కేసుల వ్యాప్తిలో కీలకమైన రీప్రొడెక్టివ్‌ వాల్యూ(ఆర్‌ వాల్యూ) మరోసారి భారత్‌ను భయపెడుతోంది. మూడు నెలల్లో మొదటిసారి ఆర్‌ వాల్యూ ఒకటి దాటింది. ఇది ఒకటి దాటితే ప్రమాద ఘంటికలు మోగినట్లే. కొద్ది వారాలుగా దేశంలో ఆర్‌ ఫ్యాక్టర్‌ క్రమంగా పెరుగుతూ వస్తున్నట్లు చెన్నైకి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్స్‌ వెల్లడించింది. 

అసాంజే అప్పగింతపై అమెరికాకు అనుకూలంగా తీర్పు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని