Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Published : 03 May 2022 20:56 IST

1. భూమ్మీద ఇసుక ఇక దొరకదా..?

ఇసుక.. ఈ భూమ్మీద నీటి తర్వాత అత్యంత ఎక్కువగా వినియోగించే సహజ వనరు. అయితే, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా సంగ్రహించే ఘన పదార్థమైన ఇసుక.. నానాటికీ భూమ్మీద కనుమరుగవుతోందట. త్వరలోనే ఈ భూమండలం ‘ఇసుక కొరత’ సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశముందట. ఈ మేరకు యునైటెడ్‌ నేషన్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రొగ్రామ్‌ (యూఎన్‌ఈపీ) హెచ్చరించింది.

నాపై దాడి చేయించింది పోలీసులే : కేఏ పాల్‌

2. పవన్‌ హన్స్‌ విక్రయంపై అనుమానాలు..: కేటీఆర్‌

లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ పవన్ హన్స్ విక్రయంపై అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. కేవలం లక్ష రూపాయల మూలధనంతో ఆరు నెలల క్రితం ఏర్పాటైన ప్రైవేటు కంపెనీకి పవన్ హన్స్ సంస్థను అమ్మివేశారని కేటీఆర్ ట్విటర్‌లో పేర్కొన్నారు. 2017లో పవన్ హన్స్ సంస్థ విలువ రూ.3,700 కోట్లు కాగా.. ఇప్పుడు అందులో 49 శాతం వాటా కేవలం రూ.211 కోట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు.

3. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ అడ్డుకట్టకు కొత్త మార్గదర్శకాలు

గత కొన్ని రోజులుగా పదో తరగతి ప్రశ్న పత్రాలు లీక్‌ కావడంతో విద్యాశాఖ అప్రమత్తమై దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందుకో కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది. పరీక్షా కేంద్రాలను నో ఫోన్‌ జోన్లుగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. చీఫ్ సూపరింటెండెంట్‌ల ఫోన్లకూ అనుమతి నిరాకరించారు. పరీక్షా కేంద్రాల్లో సెల్‌ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఏమైనా కనిపిస్తే వెంటనే సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. 

మహేశ్‌బాబుకు సారీ చెప్పా: కీర్తి సురేశ్‌

4. నేపాల్‌ నైట్‌ క్లబ్‌లో రాహుల్‌ పార్టీపై స్పందించిన విజయసాయి

నేపాల్‌ నైట్‌ క్లబ్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పార్టీపై ట్విటర్‌ వేదికగా వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ‘‘నేపాల్‌లో చైనా రాయబారితో రాహుల్‌ ఉన్నట్టు వీడియోలో ఉంది. చైనా హనీట్రాప్‌లు పెరుగుతుండటం కలవరపెడుతోంది. రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌లో పరిస్థితి చక్కదిద్దుకోకుండా మోదీ యూరప్‌ పర్యటనపై అనవసర ప్రశ్నలు వేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు.

5. 175 సీట్లు రావాలంటే వైకాపాలో ప్రక్షాళన జరగాలి: రఘురామ

రాష్ట్రంలో శాంతిభద్రతలు కల్పించలేని ప్రభుత్వం.. ప్రభుత్వమే కాదని నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నిత్యం ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో 3 హత్యలు.. 6 మానభంగాలు అని చెబుతుంటే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లేని చట్టాల గురించి వైకాపా నేతలు మాట్లాడుతున్నారని రఘురామ విమర్శించారు.

డెన్మార్క్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..

6. హైదరాబాద్‌ -విజయవాడ హైవే సమీపంలో నగ్నంగా జంట మృతదేహాలు

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు మృతదేహాలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై కొత్తగూడెం బ్రిడ్జి సమీపంలోని కంపచెట్ల మధ్య గుర్తు పట్టలేని స్థితిలో నగ్నంగా పడి ఉన్న యువతి, యువకుడి మృతదేహాలను స్థానికులు గుర్తించారు. ఇవి కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు, క్లూస్‌ టీమ్‌ జంట మృతదేహాలపై దర్యాప్తు చేపట్టాయి.

7. టీ20 లీగ్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు..

టీ20 లీగ్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేస్తూ బీసీసీ నిర్ణయం తీసుకుంది. ముంబయి, పుణె వేదికగా జరుగుతున్న లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాక.. అసలైన సమరం మొదలు కానుంది. తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ మే 24న, ఎలిమినేటర్‌ మ్యాచ్‌ మే 25న, రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ మే 27న, ఫైనల్‌ మ్యాచ్‌ 29న జరగనుంది. ఇంతకుముందు ప్రకటించిన షెడ్యూల్‌లో ఎలిమినేటర్‌ మ్యాచ్‌ మే 26న జరగాల్సి ఉంది.

8. ప్రధాని ఐరోపా పర్యటన.. వైరల్‌గా మారిన 30 ఏళ్లనాటి ఫొటో

ఉక్రెయిన్‌లో భీకర యుద్ధం జరుగుతోన్న వేళ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐరోపా దేశాల పర్యటనకు వెళ్లడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆదివారం జర్మనీకి వెళ్లిన మోదీ.. అక్కడి నుంచి డెన్మార్క్‌ చేరుకున్నారు. అయితే మోదీ జర్మనీకి వెళ్లిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. అది దాదాపు 30 ఏళ్ల క్రితం నాటి ఫొటోగా తెలుస్తోంది.

9. దిల్లీ-ఎన్‌సీఆర్‌లో 40శాతం కేసులు ‘లెక్కలోకి రానివే’..!

దేశ రాజధాని దిల్లీలో ఇటీవల కరోనా ఉద్ధృతి మళ్లీ ఎక్కువవుతోంది. గత కొద్ది రోజులుగా రోజువారీ కేసులు, పాజిటివిటీ రేటు పెరుగుతున్నాయి. అయితే వాస్తవానికి అధికారిక గణాంకాల కంటే ఎక్కువ కేసులే నమోదవుతున్నట్లు తాజాగా ఓ సర్వే వెల్లడించింది. ఏప్రిల్‌లో దాదాపు 40శాతం పాజిటివ్‌ కేసులు లెక్కలోకి రాలేదని తెలిపింది. వీరంతా ఇళ్లలో సెల్ఫ్‌ టెస్టులు చేసుకున్నట్లు పేర్కొంది.

10. పుతిన్‌తో భేటీ కావాలనుకుంటున్నా..: పోప్‌

ఉక్రెయిన్‌ యుద్ధంపై చర్చించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో భేటీ అయ్యే అవకాశం ఇవ్వాలని పోప్‌ ఫ్రాన్సిస్‌ మంగళవారం కోరారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్దతు ఇచ్చిన రష్యాలోని ఆర్థడాక్స్‌ చర్చిని పుతిన్‌కు ఆల్టర్‌ బాయ్‌ వలే పనిచేయకూడదని హితవు పలికారు. కొరియర్‌ డెల్లాసెరా అనే న్యూస్‌పేపర్‌తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యుద్ధం మొదలుకాగానే పోప్‌ ఫ్రాన్సిస్‌ రష్యా దౌత్యకార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని