
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
1. పెట్రోల్ ధర.. శ్రీలంక, పాకిస్థాన్ కంటే భారత్‌లోనే ఎక్కువ
గతకొంత కాలంగా దేశంలో పెట్రోల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హాంకాంగ్, జర్మనీ, బ్రిటన్ దేశాలతో పోలిస్తే మనదగ్గర పెట్రోల్ ధర తక్కువే అయినా చైనా, బ్రెజిల్, జపాన్, అమెరికా, రష్యా, పాకిస్థాన్, శ్రీలంక దేశాలకంటే అధికమని తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో తలసరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొన్న బ్యాంక్ ఆఫ్ బరోడా ఎకనామిక్స్ రీసెర్చ్ రిపోర్ట్ ఈ వివరాలు వెల్లడించింది.
5 ఏళ్లలో రూ.11లక్షల కోట్ల అప్పులా..! : యనమల
2. ట్విన్ టవర్స్ కూల్చివేత గడువు పొడిగింపు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని నొయిడాలో అక్రమంగా నిర్మించిన 40 అంతస్తుల జంట భవనాల (ట్విన్ టవర్స్) కూల్చివేత అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కూల్చివేత గడువును మూడు నెలల పాటు పొడిగించింది. గతంలో మే 22న కూల్చి వేయాల్సిందేనంటూ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ట్విన్ టవర్స్ కూల్చివేతకు ఇంకా ఐదు రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో కీలక ఆదేశాలు ఇచ్చింది.
3. విద్యుత్ వినియోగం తెలుసుకొనేందుకే మీటర్ల ఏర్పాటు: మంత్రి పెద్దిరెడ్డి
విద్యుత్ చౌర్యం, అక్రమాలను అరికట్టేలా చర్యలు వేగవంతం చేయాలని ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ అధికారులను ఆ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సచివాలయంలో ట్రాన్స్‌కో విజిలెన్స్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గృహ వినియోగంతో పాటు పారిశ్రామిక వినియోగంపైనా అధికారులు దృష్టి సారించాలని.. తనిఖీల ప్రక్రియ నిరంతరం కొనసాగాలని అధికారులకు మంత్రి సూచించారు.
అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరగదు: మంత్రి జోగి రమేష్
4. పోలీసు శాఖలో నియామకాలపై సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ
పోలీసు ఉద్యోగాల భర్తీలో అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ లేశారు. కేవలం మూడేళ్ల వయోపరిమితిని పెంచడం ద్వారా నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
5. ఆ ఉద్దేశంతోనే దత్తత తీసుకున్నానని చెప్పా: కరాటే కల్యాణి
చిన్నారి దత్తత వివాదంపై సినీ నటి కరాటే కల్యాణి మరోసారి స్పందించారు. తనపై ఆరోపణలు రావడంతో విచారణ నిమిత్తం సీడబ్ల్యూసీ కార్యాలయానికి హాజరైన ఆమె మీడియాతో మాట్లాడారు. నేడు అక్కడి అధికారులు లేకపోవడంతో విచారణకు బుధవారం మళ్లీ హాజరవనున్నట్టు తెలిపారు. 5 నెలల చిన్నారిని తాను దత్తత తీసుకోలేదని, కానీ దత్తత తీసుకున్నట్లు యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడింది నిజమేనని వివరించారు. పలువురు తనను స్ఫూర్తిగా తీసుకుంటారనే ఉద్దేశంతో అలా చెప్పినట్టు పేర్కొన్నారు.
అవసరానికి అప్పులు చేస్తే తప్పేంటి?: బొత్స
6. జల్‌శక్తి శాఖ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టుపై కీలక సమావేశం
కేంద్ర జల్‌శక్తి శాఖ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టుపై దిల్లీలో కీలక సమావేశం జరుగుతోంది. కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశంలో.. పోలవరం ప్రాజెక్టు డిజైన్లు, డయాఫ్రం వాల్‌పై చర్చిస్తున్నారు. ఏపీ రాష్ట్ర అధికారులు, ఐఐటీ నిపుణులు, సీడబ్ల్యూసీ అధికారులు భేటీలో పాల్గొన్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, సీడబ్ల్యూసీ అధికారులు సమర్పించిన నివేదికలపై భేటీలో ప్రధానంగా చర్చిస్తున్నారు.
7. నిందితుడిగా నా పేరు లేదు.. మరి నా ఇంట్లో సోదాలు ఎందుకు..?
లంచం తీసుకున్నారనే ఆరోపణలతో మంగళవారం కాంగ్రెస్ నేత కార్తి చిదంబరం ఇల్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు జరిపింది. దీనిపై ట్విటర్ వేదికగా చిదంబరం అసహనం వ్యక్తం చేశారు. ‘ఈ రోజు ఉదయం చెన్నైలోని మా ఇల్లు, దిల్లీలోని అధికారిక నివాసంలో సీబీఐ బృందం సోదాలు జరిపింది. అప్పుడు దర్యాప్తు సంస్థ అధికారులు నాకు ఎఫ్ఐఆర్ చూపించారు. అందులో నిందితుడిగా నా పేరు లేదు. చివరకు ఈ బృందం ఏమీ గుర్తించలేదు. వేటినీ స్వాధీనం చేసుకోలేదు’ అంటూ సోదాలు జరిగిన టైమింగ్‌ను ప్రశ్నించారు.
8. ఉత్తరకొరియాలో కరోనా విశ్వరూపం..
ఉత్తర కొరియాలో కరోనా విశ్వరూపం చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లోనే 2లక్షల 69వేల మంది జ్వరం బారినపడినట్లు ఉత్తరకొరియా అధికారిక మీడియా వెల్లడించింది. మరో ఆరుగురు మృత్యువాత పడడంతో కొవిడ్ లక్షణాలతో మరణించిన వారిసంఖ్య 56కు చేరినట్లు తెలిపింది. దీంతో అప్రమత్తమైన కిమ్.. సైన్యాన్ని రంగంలోకి దించి బాధితులకు ఔషధాలు అందించే ప్రయత్నం చేస్తున్నారు.
9. ప్లాస్టిక్ సర్జరీ వికటించి యువ నటి మృతి
అదనపు కొవ్వును తీయించుకొని మరింత అందంగా కనిపించాలని భావించిన ఓ యువ నటి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. శస్త్రచికిత్స వికటించి 21 ఏళ్ల కన్నడ నటి చేతన రాజ్ మృతిచెందారు. కొవ్వును తొలగించే ప్లాస్టిక్ సర్జరీ కోసం చేతన్ రాజ్ సోమవారం బెంళగూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. శస్త్రచికిత్స అనంతరం అనారోగ్య సమస్యలు తలెత్తి నటి మృతిచెందినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
10. బెంగళూరు ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో గేల్, ఏబీడీ
యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, మిస్టర్ 360 బ్యాటర్ ఏబీ డివిలియర్స్‌కు భారత్‌లో భారీ సంఖ్యలోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బెంగళూరు తరఫున టీ20 లీగ్‌లో 14వ సీజన్ వరకు ఆడిన డివిలియర్స్ ఆటకు వీడ్కోలు పలికాడు. గతంలో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన క్రిస్ గేల్‌ను ఈసారి ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. అయితే బెంగళూరు జట్టు మాత్రం వారిని తమ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ జాబితాలో చేర్చి గౌరవించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Mamata Banerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. దీదీ జోస్యం
-
Viral-videos News
Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
-
India News
Sidhu Moose Wala: సిద్ధూ మూసేవాల కేసులో షార్ప్‌షూటర్ అరెస్టు
-
Sports News
IND vs ENG: శ్రేయస్‌ను తెలివిగా బుట్టలో వేసిన ఇంగ్లాండ్.. వీడియో చూడండి
-
Movies News
Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
-
Politics News
BJP: భాజపా బలోపేతానికి మూడు కమిటీలను ప్రకటించిన బండి సంజయ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- Kaali: ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదాస్పదం.. దర్శకురాలిపై మండిపడుతోన్న నెటిజన్లు
- IND vs ENG: నాలుగో రోజు ముగిసిన ఆట.. భారత్ గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సిందే!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Tamil Nadu: తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి.. సంచలన వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎంపీ
- Mamata Banerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. దీదీ జోస్యం
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి
- News In Pics: చిత్రం చెప్పే సంగతులు
- కొత్త పెళ్లికూతుళ్లు.. వీటి గురించే తెగ వెతికేస్తున్నారట!