Published : 24 Jun 2022 20:56 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. హిందూపురం వైకాపాలో భగ్గుమన్న వర్గపోరు

సత్యసాయి జిల్లా హిందూపురంలో వైకాపాలో వర్గపోరు భగ్గుమంది. ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌, వైకాపా సీనియర్‌నేత కొండూరు వేణుగోపాల్‌రెడ్డి అనుచరుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. ఎమ్మెల్సీ అనుచరుల రౌడీయిజం, అక్రమాలు ఆపాలంటూ నియోజకవర్గంలోని 20 మందికి పైగా కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు ప్రెస్‌క్లబ్‌లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.

తెలంగాణలో కరోనా ఉద్ధృతి... ఒక్కరోజే 493 కేసులు

2. నర్సీపట్నం వచ్చేయ్‌ తేల్చుకుందాం.. విజయసాయిరెడ్డికి అయ్యన్న సవాల్‌

తెదేపా నేత అయ్యన్నపాత్రుడు చేసిన ఓ ట్వీట్‌ చర్చనీయంశంగా మారింది.  ‘‘నన్ను ఎదుర్కోవడానికి రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా నర్సీపట్నంలోనే ఉంది. జేసీబీలు, ఐపీఎస్‌లు, ఆర్డీవోలు, వందల సంఖ్యలో పోలీసులు, పదుల సంఖ్యలో పోలీసు వాహనాలు, సోషల్‌ మీడియా కేసులు. అంత భయం ఎందుకు విజయసాయిరెడ్డి? దమ్ముంటే నేరుగా నువ్వే నర్సీపట్నం వచ్చేయ్‌ తేల్చుకుందాం’’ అంటూ ట్వీట్‌ చేశారు.

బాలినేనీ.. మీ అనుచరులకు ఇది పద్ధతి కాదని చెప్పండి: పవన్‌ కల్యాణ్‌

3. బ్యాంకులు రుణాలు ఇవ్వకూడదనే.. ఏపీని శ్రీలంకతో పోలుస్తున్నారు: బుగ్గన

ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ప్రతిపక్ష తెదేపా బులిటెన్‌ ఇవ్వటం శోచనీయమని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్థిక అంశాల్లో అనుభవజ్ఞుడైన యనమల ప్రజలకు తప్పుడు సమాచారం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వ ఆర్థిక  క్రమశిక్షణ బాగుందని కాగ్‌ చెప్పిందన్నారు. దేశంలోనే ఆర్థిక నిర్వహణ చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రభాగాన ఉందని స్పష్టం చేశారు.

4. బండ్ల గణేశ్‌తో రేవంత్‌రెడ్డి భేటీ

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌తో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఇవాళ సాయంత్రం బండ్ల గణేశ్‌ నివాసానికి వెళ్లిన రేవంత్‌ దాదాపు 2గంటలపాటు ఆయనతో చర్చించారు. భేటీ తర్వాత ఇరువురు నేతలు ఎలాంటి ప్రకటన చేయలేదు. యాక్టివ్‌ పాలిటిక్స్‌కు దూరంగా ఉన్న గణేశ్‌ ను .. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని పీసీసీ అధ్యక్షుడు కోరినట్టు తెలుస్తోంది. 

కాంగ్రెస్‌లోకి చేరికల తుపాన్‌ రాబోతోంది: రేవంత్‌రెడ్డి

5. శివసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్రలో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. అసమ్మతి నేత ఏక్‌నాథ్ శిందే వర్గంలో శాసనసభ్యుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది ఒత్తిడి కారణంగానే ఏక్‌నాథ్‌ వర్గంలో చేరుతున్నారని, తాను తప్పించుకొని వచ్చినట్లు ఒస్మానాబాద్‌ ఎమ్మెల్యే కైలాస్‌ పాటిల్‌ (Kailas Patil) పేర్కొన్నారు.

6. ఏ జాతీయ పార్టీ టచ్‌లో లేదు: ఏక్‌నాథ్‌ శిందే ‘యూ టర్న్‌’!

తమ గ్రూపునకు ఓ జాతీయ పార్టీ ఎలాంటి సహాయమైనా చేస్తానని హామీ ఇచ్చిందంటూ నిన్న వ్యాఖ్యానించిన రెబల్‌ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్‌నాథ్‌ శిందే ఈరోజు యూ టర్న్‌ తీసుకున్నారు. ఏ జాతీయ పార్టీ తమకు కాంటాక్టులో లేదన్నారు. శుక్రవారం ఆయన ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడారు. నిన్నటి వ్యాఖ్యలతో రెబల్‌ ఎమ్మెల్యేలకు భాజపా మద్దతిస్తోందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నం కావడంతో ‘ఓ మహాశక్తి మా వెనుక ఉందని చెప్పడం వెనుక అసలు ఉద్దేశం శివసేన దివంగత నేత బాలా సాహెబ్‌ ఠాక్రే, ఆనంద్‌ డిఘేలా గురించే..’’ అని శిందే సమాధానమిచ్చారు.

7. సికింద్రాబాద్‌ అల్లర్ల కేసు... ఎట్టకేలకు ఆవుల సుబ్బారావు అరెస్టు

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్‌ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. అకాడమీలో పనిచేసే శివ, హరితో పాటు మరో నలుగురిని రైల్వే పోలీసులు అరెస్టు చేసి గాంధీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించారు. అనంతరం జీఆర్పీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి బోయగూడలోని రైల్వే కోర్టులో హాజరుపర్చనున్నారు.

8. కార్డు టోకనైజేషన్‌ గడువు మళ్లీ పొడిగింపు

క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు టోకనైజేషన్‌ గడువును RBI మరోసారి పొడిగించింది. ఈ విధానం అమలుకు గడువు జూన్‌ 30తో ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మరో మూడు నెలలు పొడిగిస్తూ సెప్టెంబర్‌ 30ని తుది గడువుగా పేర్కొంది. టోకనైజేషన్‌ విధానం అమలుకు భాగస్వామ్య పక్షాలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా, వారి విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

9. సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు కరోనా పాజిటివ్‌

సినీ నటుడు, హిందూపూర్‌ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ(Bala krishna) కరోనా బారినపడ్డారు. తాజాగా చేసిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌ నిర్ధారణ కావటంతో హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. తాను పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నానని బాలకృష్ణ తెలిపారు. గత రెండు రోజులుగా తనని కలిసిన వారు కూడా కరోనా టెస్టు చేయించుకోవాలని సూచించారు. 

సంపన్నులు భారత్‌ను ఎందుకు వీడుతున్నారు..?

10. శ్రీలంక గతి పట్టొద్దని పాట్లు పడుతున్న పాక్‌

ఆర్థిక పతనం అంచున ఉన్న పాకిస్థాన్‌ను ఆ గండం నుంచి గట్టెక్కించేందుకు అక్కడి ప్రభుత్వం క్రమంగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఇంధనం, విద్యుత్తు ఛార్జీలను భారీగా పెంచిన ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ సర్కార్‌ తాజాగా మరిన్ని చర్యలకు ఉపక్రమించింది. సిమెంటు, ఉక్కు, వాహన తయారీ వంటి భారీ పరిశ్రమలపై 10 శాతం ‘సూపర్‌ ట్యాక్స్‌’ విధిస్తున్నట్లు ప్రకటించారు. 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని