Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలు తీసుకెళ్లిన సీఎంకు మహాద్వారం వద్ద తితిదే ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. రంగనాయక మండపంలో సీఎం జగన్‌కు వేద పండితులు ఆశీర్వచనం పలికారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. మాజీ సీఎంను ఓ టెర్రరిస్టులా అరెస్టు చేయడం దారుణం: వైగో
తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు(Chandrababu) అరెస్టును ఎండీఎంకే(MDMK) నేత వైగో(Vaiko) తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు అరెస్టు రాజకీయ ప్రతీకార చర్య అన్నారు. స్కిల్ కేసులో సమన్లు జారీ చేసి విచారణ జరపవచ్చని.. కానీ ఆ పని చేయకుండా ఆయన్ను నేరుగా అరెస్టు చేశారని ఆక్షేపించారు. మాజీ సీఎంను టెర్రరిస్టులా అరెస్టు చేయడం దారుణమన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ఇంద్రకీలాద్రి నమూనాలో ఆకట్టుకుంటోన్న బాలాపూర్ గణేశ్ మండపం
రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లో ఏర్పాటు చేసిన గణపయ్య (Balapur Ganesh) విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఈసారి పంచముఖ నాగేంద్రుడిపై 18 అడుగుల ఎత్తులో బాలాపూర్ గణపతి కొలువు దీరాడు. ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన మండపం విశేషంగా ఆకట్టుకుంటోంది. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయ నమూనాలో ఈసారి మండపం తీర్చిదిద్దారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. Richest Ganesh: 66 కిలోల బంగారంతో అలంకరణ..
దేశవ్యాప్తంగా వినాయక ఉత్సవాలు (Ganesh Festival) అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కొన్నిచోట్ల ఖరీదైన గణేశ్ విగ్రహాలు ఏర్పాటు చేయగా.. మరికొన్ని చోట్ల భారీ సెట్టింగ్‌లతో తాత్కాలిక మండపాలను నిర్మించారు. ఈ క్రమంలోనే ముంబయిలోని ప్రముఖ జీఎస్‌బీ సేవా మండల్ (GSB Seva Mandal) ‘మహాగణపతి’ ఈ ఏడాదీ వార్తల్లో నిలిచింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ప్రగతి భవన్‌లో వినాయక చవితి వేడుకలు.. సీఎం కేసీఆర్ కుటుంబం పూజలు
వినాయక చవితి వేడుకలు ప్రగతి భవన్ (Pragathi Bhavan)లో ఘనంగా నిర్వహించారు. ప్రగతి భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతి విగ్రహానికి సీఎం కేసీఆర్, శోభ దంపతులతో పాటు మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు, పలువురు భారాస నేతలు పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలకు విఘ్నేశ్వరుడు సుఖశాంతులను అందించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కోరారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలనే కాంగ్రెస్ కాపీ కొట్టింది: మంత్రి జగదీశ్
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చేది ఉందా? ఇచ్చేది ఉందా? అన్నట్టుగా ఉన్నాయని మంత్రి జగదీశ్ రెడ్డి (Guntakandla Jagadish Reddy) ఎద్దేవా చేశారు. విజయభేరి సభలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై సూర్యాపేటలో మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు అన్నీ బోగస్‌ని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన చరిత్ర కాంగ్రెస్‌కు ఏనాడూ లేదన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం (Union Cabinet) భేటీ ముగిసింది. ఈ సాయంత్రం భేటీ అయిన కేబినెట్.. పలు కీలక అంశాలపై దాదాపు రెండు గంటల పాటు చర్చించింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో (Parliament Special Session) ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. China- Taiwan: 24 గంటల్లో 103 యుద్ధవిమానాలు..
తైవాన్ (Taiwan) తమ దేశంలోని భాగమేనంటూ వాదిస్తోన్న చైనా (China).. ఎలాగైనా దాన్ని ఆక్రమించేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల నడుమ.. తాజాగా 24 గంటల వ్యవధిలో చైనా సైన్యం ఏకంగా 103 యుద్ధవిమానాలను తైవాన్ దిశగా పంపడం గమనార్హం.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. కోట్లాది రూపాయల ఫైటర్ జెట్ మిస్సింగ్..
అమెరికా(USA)లో వందల కోట్ల విలువైన ఫైటర్ జెట్ మిస్(F-35 Fighter Jet) అయ్యింది. దాని జాడ కనిపిస్తే చెప్పాలంటూ మిలిటరీ అధికారులు ప్రజలను అభ్యర్థించారు. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. గాల్లో ఉండగా అత్యవసర పరిస్థితి తలెత్తడంతో.. సౌత్ కరోలినాలోని బ్యూఫోర్ట్ ఎయిర్ స్టేషన్ నుంచి అమెరికా ఫైటర్ జెట్ ఎఫ్-35(F-35 Fighter Jet) జాడ లేకుండా పోయింది. ఆదివారం ఈ ఘటన జరిగింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. లంచం విషయంలో గొడవ.. నడిరోడ్డుపై కొట్టుకున్న పోలీసులు!
బిహార్ (Bihar) రాష్ట్రం నలంద జిల్లాలో ఇద్దరు పోలీసులు (Police) నడిరోడ్డుపై గొడవకు దిగారు. లంచంగా వచ్చిన మొత్తాన్ని పంచుకునే విషయంలో తలెత్తిన విభేదం వారి మధ్య గొడవకు కారణమని తెలుస్తోంది. ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. నలందలోని ఓ రహదారిపై పోలీసులు తమ వాహనం ఆపారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nellore: వైకాపా నేత చెప్పాడని.. సీఐ చితక బాదేశారు
-
NTR: ‘ఏఐ’ మాయ.. ఎన్టీఆర్‌ని తలపించేలా.. ఫొటో వైరల్
-
Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవ ఆమోదం
-
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే.. ఈ రికార్డులు నమోదవుతాయా?
-
Hyderabad: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన ఛైర్మన్‌గా బక్కి వెంకటయ్య
-
Sai Rajesh: నా సాయం పొందిన వ్యక్తే నన్ను తిట్టాడు: ‘బేబీ’ దర్శకుడు